← Back to news

గాంధీ నుంచి నేర్చుకోవాల్సిన గుణం!

By Nani Eluri· 2 Oct 2026
గాంధీ నుంచి నేర్చుకోవాల్సిన గుణం!

‘గాంధీ’ అనే మాట వినగానే ఒక ధైర్యమైన నాయకుడి ఇమేజ్ గుర్తొస్తుంది. కానీ మొదట్లో ఆయన కూడా అంత ధైర్యంగా ఉండేవారు కాదు. యువ లాయర్‌గా ఉన్నప్పుడు నలుగురి ముందు మాట్లాడాలంటే నెర్వస్‌గా ఫీలయ్యేవారు. మనకి తెలిసిన గాంధీగా ఆయన ఒక్కరోజులో మారిపోలేదు. ఇబ్బందులు, అపజయాలు ఎదుర్కొంటూ నెమ్మదిగా తన కాన్ఫిడెన్స్‌ను పెంచుకున్నారు. అలా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తూ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే నాయకుడిగా మారారు. ఆయన్నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి అది.

More in Motivational