నరసింహ, రాఘవన్ మిక్స్‌తో రజినీ కొత్త సినిమా!

తలైవా రజినీకాంత్ తదుపరి చిత్రం మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో కూడిన ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ చిత్రాలైన ‘నరసింహ’ (మాస్ అండ్ స్టైల్), ‘రాఘవన్’ (ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్) కలయికగా ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. "రజినీకాంత్ మార్క్ అదిరిపోయే మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు సీటు అంచున కూర్చోబెట్టే సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది.



