ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?

మహిళా భాగస్వామి కంటే మగవారే పైచేయిగా ఉండాలనే రూల్ వెనుక పితృస్వామ్య (patriarchy) ఆలోచనలు ఉన్నాయి.5,000 ఏళ్ల క్రితం ఇద్దరూ సమానమే అయినా, కాలక్రమేణా మగవారిలో అభద్రతాభావం పెరిగింది. డేటింగ్ యాప్స్‌లో పురుషులు హైట్ అబద్ధం చెప్పడం, వైఫ్ ఎక్కువ సంపాదిస్తే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం దీనికి నిదర్శనం. అమెరికాలో 16% మంది భార్యలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బ్రిటన్ రాణి భర్త ఆల్బర్ట్ కూడా 'నేను ఇంట్లో కేవలం భర్తను, యజమానిని కాదు' అని బాధపడ్డారు. నిజానికి మహిళలు ఎక్కువ హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదించినా అది చాలా నార్మల్! మనసుతో భాగస్వామిని ఎంచుకుంటేనే రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి.

