ఆఫీసర్‌గా వస్తాడనుకుంటే.. అంబులెన్స్‌లో వచ్చాడు!

ఆఫీసర్ అవ్వాలనే కలలతో పుణే వెళ్లిన 28 ఏళ్ల <a href="https://www.theclearcutnews.com/n/X4mRRFR">ప్రథమేష్ దేశ్‌ముఖ్</a> అనే MPSC అభ్యర్థి అప్పుల భారం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మంచి పొజిషన్‌లో ఊరికి వస్తాడనుకుంటే, శవమై అంబులెన్స్‌లో రావడంపై అతని తల్లి కన్నీటి సంద్రమైంది. పేపర్ లీక్‌లు, ఎగ్జామ్స్ ఆలస్యం కావడం వల్ల పల్లెటూరి పేద విద్యార్థులు నగరాల్లో రూమ్ రెంట్లు, కోచింగ్ ఫీజులు భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ యువత ప్రాణాలను బలితీసుకుంటోందని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు.



