← Back to news

Expiry సిరప్‌!

By BK· 7 Aug 2026· TG

మహబూబాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కొడుకుకి వాంతులు, విరోచనాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు రెండు సిరప్‌లు రాయగా, ఒకదాన్ని బయట కొనాలని, మరో సిరప్‌ను ఆసుపత్రిలోనే ఇచ్చారు. ఇంటికెళ్లి పిల్లాడికి వేసేందుకు చూడగా, ఆ సిరప్ ఎక్స్‌పైరీ జూన్ 2026 నాటికే ముగిసినట్లు తండ్రి గమనించాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి 'ఎక్స్‌పైరీ మందులిచ్చి పిల్లాడి ప్రాణాలతో చెలగాటమాడుతారా?' అని ప్రశ్నించాడు.

More in News