హార్ట్‌బర్న్ అంటే కేవలం ఎసిడిటీ కాదు.. జాగ్రత్త!

తిన్నాక ఛాతిలో మంటగా ఉందా? వెంటనే ఎసిడిటీ అనుకుని ట్యాబ్లెట్ వేసుకోవద్దు! ఇది GERD లక్షణం కూడా కావచ్చు. కడుపులోని పదార్థాలు పదేపదే ఆహారం వెళ్లే పైప్‌లోకి రావడాన్ని GERD అంటారు. కొందరికి దీనివల్ల మంట, ఛాతిలో నొప్పి ఉంటే.. మరికొందరికి ఎలాంటి మంట లేకపోయినా సమస్య ఉండొచ్చు. బరువు ఎక్కువగా ఉండటం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రిస్క్ పెరగొచ్చు. తరచూ హార్ట్‌బర్న్ వస్తే డాక్టర్‌ను కలవడం మంచిది.



