Gen Z సోమరులా.. లేక స్మార్ట్‌నా?

Gen Zని ‘సోమరులు’ అంటూ విమర్శలు వస్తున్నా.. కంపెనీల్లో మాత్రం వారి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? HPకి చెందిన సీనియర్ అధికారి జార్జ్ బ్రాషర్ ఈ అభిప్రాయాన్ని తప్పని చెబుతున్నారు. తన టీమ్‌లోని Gen Z ఉద్యోగులు బాగా వినడం, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడంలో బలంగా ఉన్నారని చెప్పారు. చిన్నప్పటి నుంచే డిజిటల్ ప్రపంచంలో పెరగడం, కొత్త టెక్ టూల్స్‌తో సులభంగా పనిచేయడం వారికి పెద్ద ప్లస్‌గా మారిందన్నారు. AI వాడకంలోనూ యువత ముందుండటంతో.. కంపెనీలకు వారు విలువైన ఉద్యోగులుగా కనిపిస్తున్నారట.


