← Back to news

మాతృభాష తెలియకపోవడం అవమానం: నటుడు ధనుష్‌

By Mahesh· 7 Aug 2026· Chennai

మాతృభాష తెలియకపోవడం అవమానకరమని తమిళ్ యాక్టర్ ధనుష్‌ అన్నారు. చెన్నైలోని థాయ్‌ సత్య మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో స్టూడెంట్స్‌తో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను నేర్చుకోవాలని సూచించారు. మాతృభాషలో చదవడం, రాయడం తెలియకపోవడాన్ని గ్రేట్‌గా ఫీల్ అవ్వకూడదన్నారు. తాను చదువుకునే టైమ్‌లో ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేకపోయినా తమిళ్ బాగా మాట్లాడేవాడినని అన్నారు. ప్రస్తుతం తాను కలిసే 10 మందిలో 8 మందికి తమిళ్ చదవడం, రాయడం తెలియకపోవడం బాధ కలిగిస్తోందని ధనుష్‌ చెప్పారు.

More in Cinema