నవరాత్రుల్లో బొమ్మల కొలువు..
నవరాత్రుల టైంలో ఇళ్లలో బొమ్మలను మెట్లపై అందంగా అలంకరించే ట్రెడిషన్‌నే ‘బొమ్మై కొలు’ అంటారు. తమిళనాడులో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్నే ‘బొమ్మల కొలువు’ అని పిలుస్తారు. దుర్గాదేవి దర్బార్‌ను చూపించేలా బొమ్మలను వేర్వేరు మెట్లపై అమరుస్తారు. దేవుళ్ల బొమ్మలతో పాటు రామాయణం, మహాభారతం సీన్లు, మన రోజువారీ జీవితాన్ని చూపించే బొమ్మలను కూడా పెడతారు. ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్లను ఇంటికి పిలిచి పూజలు చేయడం ఈ ట్రెడిషన్‌లో స్పెషల్.



