Old is Gold.. Gen Z మళ్లీ పాత బ్రాండ్ల వైపు!

Gen Z యువతలో చిన్నప్పుడు చూసిన, వాడిన బ్రాండ్లపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. TelmarHelixa రిపోర్టు ప్రకారం, అమెరికాలోని Gen Zలో 47% మంది తాము చిన్నప్పుడు చూసిన లేదా తమ పేరెంట్స్ వాడిన బ్రాండ్లను కొంటున్నట్లు చెప్పారు. Pokémon, MTV, Taco Bell వంటి పాత బ్రాండ్లు వారికి ఇప్పటికీ గుర్తున్నాయి. మారుతున్న డిజిటల్ ప్రపంచంలో చిన్ననాటి జ్ఞాపకాలు వారికి సంతోషం, నమ్మకాన్ని ఇస్తున్నాయి. అందుకే పాత బ్రాండ్లు కొత్త రూపంలో తిరిగి వస్తే యువత వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు రిపోర్ట్ చెబుతోంది.



