← Back to news

‘ఇదే నేను పనిచేసే ఆఫీస్’ అని చూపించిన క్షణం

By Nani· 28 Aug 2026
‘ఇదే నేను పనిచేసే ఆఫీస్’ అని చూపించిన క్షణం

చిన్నప్పుడు మనల్ని స్కూల్‌కి తీసుకెళ్లిన తల్లిదండ్రులనే పెద్దయ్యాక మనం పనిచేసే చోటికి తీసుకెళ్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? బెంగళూరులో గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తన తల్లిదండ్రులను తొలిసారి ఆఫీస్‌కి తీసుకెళ్లి, అక్కడి వాతావరణాన్ని చూపించింది. ఆ క్షణాలను వీడియోగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన ఆనందం, గర్వమే ఈ వీడియోను ఇంతగా కనెక్ట్ చేసిందంటున్నారు. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసిన ఈ చిన్న క్షణం నెటిజన్లను బాగా టచ్ చేసింది.

More in Gen Z