← Back to news

పండుగ వేళ గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు

By Naresh Kumar· 1h ago· Vikarabad
పండుగ వేళ గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని సర్పంచ్ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, వీధుల్లో చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పండుగల వేళ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.

More in Local