← Back to news

నేటి నుంచి వర్షాల కోసం తిరుమలలో యాగం

By Mahesh· 5d ago· AP
నేటి నుంచి వర్షాల కోసం తిరుమలలో యాగం

AP: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక యాగాలు నిర్వహించనుంది. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మహా పూర్ణాహుతితో యాగాలు ముగుస్తాయి. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి, రైతులకు మేలు జరగాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు TTD తెలిపింది.

More in AP