← Back to news

ప్యాకేజ్డ్ కొబ్బ‌రి నీళ్లు వ‌ద్దు!

By BK· 16 Aug 2026
ప్యాకేజ్డ్ కొబ్బ‌రి నీళ్లు వ‌ద్దు!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, బాటిళ్లలో అమ్మే ప్యాకేజ్డ్ నీళ్ల కంటే తాజా నీళ్లు తాగడమే మంచిదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే ప్యాకేజ్డ్ నీళ్లలో ఖనిజాలు తగ్గి, పంచదార కలపవచ్చు. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రక్తంలో పొటాషియం ఎక్కువ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వీటిని ఎక్కువగా తాగకూడదు. విరోచనాలు, వాంతులై బాడీలో నీటిశాతం తగ్గినప్పుడు కొబ్బరి నీళ్లు ORS కి ఆల్టర్నేటివ్ కావు. ఆ టైమ్‌లో ORS వాడటమే మేలని డాక్టర్లు చెబుతున్నారు.

More in Health