రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి.. 11 మంది భారతీయులు!

సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై అక్టోబర్ 10న జరిగిన దాడిలో 11 మంది భారతీయులు గాయపడ్డారు. ఈ విషయాన్ని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన భారతీయుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంబసీ స్థానిక అధికారులతో, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతోంది. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనతో అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.



