Latest

“రేపు చేద్దాం”.. అంటూ టైమ్ పోతుందా?
Motivational· 25 Aug 2026

“రేపు చేద్దాం”.. అంటూ టైమ్ పోతుందా?

“ఇది రేపు చేద్దాంలే” అని మనం రోజూ ఎన్నిసార్లు అనుకుంటామో లెక్కే ఉండదు. చిన్న పని కాబట్టి పర్లేదనిపిస్తుంది. కానీ ఇలా ఒక్కో పని వాయిదా పడుతూ పోతే.. మన టైమ్ మాత్రమే కాదు, మన అవకాశాలు కూడా జారిపోవచ్చు. చదువు కావచ్చు, కొత్త పని మొదలుపెట్టడం కావచ్చు, ఎవరికైనా మనసులో మాట చెప్పడం కావచ్చు.. “తర్వాత” అనే మాటతో మనమే మనల్ని ఆపుకుంటుంటాం. అసలు సమస్య పని చేయలేకపోవడం కాదు.. మొదలుపెట్టే క్షణాన్ని ప్రతిసారీ రేపటికి నెట్టేయడమే. “తర్వాత” కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఒకరోజు “ఇప్పుడైనా?” అని మనమే మనల్ని అడగాల్సి రావచ్చు.

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?
Technology· 24 Aug 2026

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?

వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక్కసారిగా “404 Not Found” అని కనిపించిందా? ఇది మీ ఇంటర్నెట్ పనిచేయడం లేదని అర్థం కాదు. మీరు ఓపెన్ చేయాలనుకున్న వెబ్‌పేజ్‌ను సర్వర్‌లో కనుగొనలేకపోయినప్పుడు ఈ Error వస్తుంది. ఉదాహరణకు, ఒక వెబ్‌పేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, దాని లింక్ మారి ఉండొచ్చు లేదా URL తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు. అందుకే 404 అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. “మీరు అడిగిన పేజ్ ఇక్కడ కనిపించలేదు” అన్నమాట. 💻

మరిపెడ నుంచి State under–14 క్రికెట్‌ జట్టుకు జశ్వంత్‌
Local· 24 Aug 2026

మరిపెడ నుంచి State under–14 క్రికెట్‌ జట్టుకు జశ్వంత్‌

మరిపెడ నుంచి మరో స్పోర్ట్స్ స్టార్ రెడీ అవుతున్నాడు. 🏏మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన మేరుగు జశ్వంత్ తెలంగాణ రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టుకు select అయ్యాడు. వరంగల్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ గా జశ్వంత్ చూపిన ప్రతిభ రాష్ట్ర సెలెక్టర్లను ఆకట్టుకుంది. ఇక ఈ నెల 26-29 వరకు ఛత్తీస్గఢ్ చంపా జిల్లాలో జరిగే టోర్నమెంట్లో తెలంగాణ తరఫున బరిలోకి దిగనున్నాడు. 🔥<br>సెయింట్ అగస్టీన్ పాఠశాలలో 7వ తరగతి చదివే ఈ చిన్నోడు మరింత గొప్పోడు అవ్వాలని wish చేద్దాం.

4 రోజుల్నుంచి No water.. ఉయ్యూరు మహిళల టెన్షన్!
Local· 24 Aug 2026

4 రోజుల్నుంచి No water.. ఉయ్యూరు మహిళల టెన్షన్!

ఉయ్యూరు 7వ వార్డు కాలవగట్టులో ముస్లిం మహిళలు తాగునీరు లేక అవస్థ పడుతున్నారు. 💧 అతిసార వ్యాధి నివారణ పేరిట పైప్‌లైన్ సరఫరా నిలిపివేశారు. ట్యాంకర్ల దగ్గర కుస్తీలవుతున్నయ్. 🚰 4 days నుంచి ఇంటి అవసరాలకు కూడా నీళ్లు లేవు. బస్తీ వాళ్లంతా కలిసి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు complaint చేశారు. అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చారు.

అమరావతి ఛాంపియన్షిప్.. 2 లక్షల మంది ఆటగాళ్లతో Asian Record!
Local· 24 Aug 2026

అమరావతి ఛాంపియన్షిప్.. 2 లక్షల మంది ఆటగాళ్లతో Asian Record!

New Record...! అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఏకంగా 2,07,498 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున Grass route నుంచి ఒకే వేదికపై ఆటగాళ్లను సమీకరించిన ఈ ఈవెంట్.. Asian Book of Records లో place సంపాదించుకుంది. ఆగస్టు 24న తిరుపతి ఎస్వీయూ తారకరామ స్టేడియంలో Asian Book of Records ప్రతినిధి ఆర్. హరీష్ చేతులమీదుగా శాప్ చైర్మన్ అనిమినీ రవి నాయుడు అవార్డు, సర్టిఫికెట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో Great mile stone.

school కూల్చారు.. పిల్లలెక్కడ చదవాలె?
Local· 24 Aug 2026

school కూల్చారు.. పిల్లలెక్కడ చదవాలె?

బుల్టోజరుతో పని చేయించిన అధికారులకు సోయి తప్పింది. అనుమతి లేదనే పేరిట, అనుమతి ఉన్న ZPHS బిల్డింగును కూడా కూల్చేశారు. పిల్లలకు క్లాసు రూములు లేకుండా పోయినయ్. ఈ విషయాన్ని PDSU జిల్లా అధ్యక్షుడు హాలిం పాషా ప్రజావాణిలో అధికారులకు complaint ఇచ్చారు. ’’అడ్డగోలుగా, మతి తప్పి పిల్లల స్కూలును కూల్చినోళ్ల మీద చర్యలు తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు. ఇప్పుడు పిల్లల క్లాసురూముకు ఎక్కడైనా జాగా చూపెట్టాలన్నారు. వెంటనే కొత్త బిల్డింగు కట్టియ్యాలన్నారు. అధికారులేం చేస్తరో చూడాలి మరి.

గుంటూరులో single use plasitc కు NO
Local· 24 Aug 2026

గుంటూరులో single use plasitc కు NO

గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ఇక గ్రీన్ సిగ్నల్ లేదు. 🚫<br>ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి దిగిపోయారు. కండీషన్లు ఉల్లంఘిస్తే 'స్వచ్ఛ యాప్' ద్వారా వెంటనే ఫైన్ వేస్తున్నారు.⚠️<br>ప్లాస్టిక్ వాడితే చాలా నష్టాలున్నాయ్. అందుకే ప్రత్యామ్నాయాలు వాడండి, నిబంధనలకు సహకరించండి. అని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంతకంటే క్లియర్ మెసేజ్ ఏముంది? ప్లాస్టిక్‌కు దూరంగా ఉంటేనే గుంటూరు క్లీన్.

పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి
Local· 24 Aug 2026

పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా మొట్టమొదటి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రంజిత్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలిసి పుష్పగుచ్చం అందించి, ఎన్నిక వివరాలను తెలియజేశారు. జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

మా భూములు వేరోళ్లకు ఎందుకిస్తరు?
Local· 24 Aug 2026

మా భూములు వేరోళ్లకు ఎందుకిస్తరు?

‘‘30 ఏళ్లుగా ఉంటున్నం. ఇవి మా భూములు. పోలవరంలో మునిగిపోయినోళ్లకు ఇస్తారట. మరిమేం ఏం కావాలె?‘‘ అంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద AIKMS ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బుట్టాయిగూడెం మండలం వెలుతురువారిగూడెం గిరిజనులు 30 ఏళ్లు గా సాగు చేస్తున్న భూములను పోలవరం నిర్వాసితుల R &amp; R ప్యాకేజీ కోసం సేకరించడాన్ని నిలిపి వేయాలన్నది వారి డిమాండ్‌. భూములపై వివాదాస్పద తీర్పులు, కేసులు పెండింగ్‌లో ఉన్నందున సర్వే, భూసేకరణ, అవార్డు విచారణ నిలిపివేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.

ప్రజలు ఇచ్చిన  ఫిర్యాదులను వెంటనే తీర్చాలి
Local· 24 Aug 2026

ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే తీర్చాలి

AP : ప్రజావాణిలో జనం ఇచ్చిన వినతులను త్వరగా చూసి, చెప్పిన టైమ్‌లో సమస్యలు తీర్చాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. పనులు ఏమైనయ్యో అర్జీలు ఇచ్చిన జనానికి కూడా కచ్చితంగా చెప్పాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 42 వినతులు వచ్చాయి. కాగితం తీసుకోగానే పని అయిపోదని, సమస్య పూర్తిగా తీరేదాకా అధికారులదే బాధ్యత అని చెప్పారు. వేరే శాఖల సమస్యలు ఉంటే వెంటనే వాళ్లతో మాట్లాడి సమస్యను తీర్చాలన్నారు.

అనాథ శవానికి దహన సంస్కారాలు చేసిన ఖిద్మత్ టీం
Local· 24 Aug 2026

అనాథ శవానికి దహన సంస్కారాలు చేసిన ఖిద్మత్ టీం

AP : గుంటూరు జిల్లాలో మంగళగిరి గోపాలకృష్ణ హాల్ ఎదురుగా ఉన్న వీధిలో ఓ వ్యక్తి అనాథగా చనిపోయి పడి ఉండగా ఖిద్మత్ టీమ్ సభ్యులు ఆదుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. పోలీసుల అనుమతితో ఆ మృతదేహానికి కనీస గౌరవం ఇస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడానికి తమ టీమ్ ఎప్పుడూ ముందుంటుందని టీమ్ కన్వీనర్ షఫీ తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి మంచి పనులు చేస్తున్న ఖిద్మత్ టీం సభ్యులను స్థానికులు మెచ్చుకున్నారు.

నెల రోజుల పోరాటానికి ఫలితం
Local· 24 Aug 2026

నెల రోజుల పోరాటానికి ఫలితం

AP : కాకినాడ జిల్లా శంఖవరం SC హాస్టల్‌ను మూసేయడాన్ని వ్యతిరేకిస్తూ దళిత, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. నాయకుల ఆవేదన విన్న కలెక్టర్ పిల్లల మంచికోసమే పాత హాస్టల్‌ను తాత్కాలికంగా మూసేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా బడి దగ్గరలోనే కొత్త హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. పాత హాస్టల్ భవనాన్ని SC, ST విద్యార్థులు కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మారుస్తామన్నారు. నెల రోజులుగా చేస్తున్న పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కడంతో నాయకులు ఆనందపడ్డారు.

4 రోజులుగా చీకటిలో అమీన్‌పూర్
Local· 24 Aug 2026

4 రోజులుగా చీకటిలో అమీన్‌పూర్

TG : అమీన్‌పూర్ పరిధిలోని భవానీపురం NSL ఫేజ్-2లో గత నాలుగు రోజులుగా street lights&nbsp; వెలగడం లేదు. ఇక్కడ పనిచేసే పాత లైన్‌మెన్ వేరే ప్రాంతానికి బదిలీ కాగా, కొత్తగా వచ్చిన లైన్‌మెన్లు నాలుగు రోజులుగా లైట్లు వేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. చీకటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి స్ట్రీట్ లైట్లను వెలిగించాలని జనం కోరుతున్నారు.

అరకు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
Local· 24 Aug 2026

అరకు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

AP : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 516E జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, మిగతా వివరాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం : కాంగ్రెస్ నేత ప్రణవ్
Local· 24 Aug 2026

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం : కాంగ్రెస్ నేత ప్రణవ్

TG : కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టులకు తగిన గౌరవం ఇస్తామని, అర్హులైన ప్రతి విలేకరికి ఇళ్ల పట్టాలు అందేలా చూస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ చెప్పారు. హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్‌లో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల దగ్గరకు వెళ్లి, వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గతంలో ఇచ్చిన పట్టాల్లో ఉన్న చట్టపరమైన సమస్యలను తీర్చి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పెదశంఖర్లపూడిలో ప్రజా దర్బార్‌
Local· 24 Aug 2026

పెదశంఖర్లపూడిలో ప్రజా దర్బార్‌

ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై ఆమె ఆరా తీశారు. రౌతుపాలెం, చింతలూరు, శరభవరం, వెంకటనగరం తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వినతిపత్రాల ద్వారా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె ఓర్పుగా విని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

కలెక్టర్‌ను కలిసిన రైతు నాయకులు
Local· 24 Aug 2026

కలెక్టర్‌ను కలిసిన రైతు నాయకులు

TG : రైతు బీమా పథకంపై రైతుల్లో ఉన్న భయాలను ప్రభుత్వం వెంటనే పోగొట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరింది. హనుమకొండ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఇంట్లో ఆధారమైన రైతు అనుకోకుండా చనిపోతే రైతు బీమా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తుందని నాయకులు చెప్పారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వం తొందరగా స్పష్టత ఇచ్చి ఎప్పటిలాగే నడిపించాలని, రైతుల మనసులో ఉన్న భయాన్ని పోగొట్టాలని డిమాండ్ చేశారు.

మహిళలకు రక్షణ ఎక్కడ : జక్కంపూడి విజయలక్ష్మి
Local· 24 Aug 2026

మహిళలకు రక్షణ ఎక్కడ : జక్కంపూడి విజయలక్ష్మి

AP : రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని YCP నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. గెలిచే ముందు ఇచ్చిన మాటలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. అడపిల్లలపై అన్యాయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దిశ వ్యవస్థను ఇంకా బలంగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల భద్రత గురించి ప్రభుత్వం పట్టించుకోకపోతే YCP తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

విరిగిపోయిన డ్రైనేజీ స్లాబులు
Local· 24 Aug 2026

విరిగిపోయిన డ్రైనేజీ స్లాబులు

AP : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పాతపాడేరు పంచాయతీ ఆఫీస్ దగ్గర డ్రైనేజీ స్లాబులు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. పెద్దవాళ్లు, పిల్లలు నిత్యం తిరిగే ఈ రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఊరి జనం కంగారుపడుతున్నారు. వర్షాలు పడితే గుంతలు కనిపించక పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యేలా ఉందన్నారు. అధికారులు వెంటనే వచ్చి చూసి, పగిలిపోయిన స్లాబుల స్థానంలో కొత్తవి వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మూడు నెలలుగా తాగడానికి నీళ్లు లేవు
Local· 24 Aug 2026

మూడు నెలలుగా తాగడానికి నీళ్లు లేవు

AP : అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం తోకరాయి గ్రామంలో గత మూడు నెలలుగా మంచినీళ్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. పోయిన నెల PGRS కార్యక్రమంలో అధికారులకు చెప్పిన సమస్య తీరలేదు. వర్షాలు పడుతున్నా మంచి నీళ్లు రాకపోవడంతో వేరే దారి లేక వాగుల నుంచి కలుషిత నీటిని తెచ్చుకుని తాగుతున్నారు. ఆ నీళ్లు తాగి చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ ఊరికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

కూలే స్థితిలో పాఠశాల
Local· 24 Aug 2026

కూలే స్థితిలో పాఠశాల

AP : అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ దాసరి తోట జిపిఎస్ (TW) పాఠశాల భవనం దారుణంగా దెబ్బతింది. బిల్డింగ్ స్లాబ్‌కు పెద్ద పెద్ద పగుళ్లు వచ్చి భవనం ప్రమాదకరంగా మారడంతో పిల్లలను స్కూలుకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.ఈ భవనం గురించి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగి పిల్లల ప్రాణాలకు ముప్పు రాకముందే అధికారులు వచ్చి పరిశీలించి, వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలని ఊరి జనం కోరుతున్నారు.