మహిళలకు రక్షణ ఎక్కడ : జక్కంపూడి విజయలక్ష్మి

AP : రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని YCP నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. గెలిచే ముందు ఇచ్చిన మాటలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. అడపిల్లలపై అన్యాయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దిశ వ్యవస్థను ఇంకా బలంగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల భద్రత గురించి ప్రభుత్వం పట్టించుకోకపోతే YCP తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



