← Back to news

కలెక్టర్‌ను కలిసిన రైతు నాయకులు

By Srikanth· 24 Aug 2026· హనుమకొండ
కలెక్టర్‌ను కలిసిన రైతు నాయకులు

TG : రైతు బీమా పథకంపై రైతుల్లో ఉన్న భయాలను ప్రభుత్వం వెంటనే పోగొట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరింది. హనుమకొండ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఇంట్లో ఆధారమైన రైతు అనుకోకుండా చనిపోతే రైతు బీమా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తుందని నాయకులు చెప్పారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వం తొందరగా స్పష్టత ఇచ్చి ఎప్పటిలాగే నడిపించాలని, రైతుల మనసులో ఉన్న భయాన్ని పోగొట్టాలని డిమాండ్ చేశారు.

More in Local