అరకు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
AP : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 516E జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, మిగతా వివరాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.



