అనాథ శవానికి దహన సంస్కారాలు చేసిన ఖిద్మత్ టీం

AP : గుంటూరు జిల్లాలో మంగళగిరి గోపాలకృష్ణ హాల్ ఎదురుగా ఉన్న వీధిలో ఓ వ్యక్తి అనాథగా చనిపోయి పడి ఉండగా ఖిద్మత్ టీమ్ సభ్యులు ఆదుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. పోలీసుల అనుమతితో ఆ మృతదేహానికి కనీస గౌరవం ఇస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడానికి తమ టీమ్ ఎప్పుడూ ముందుంటుందని టీమ్ కన్వీనర్ షఫీ తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి మంచి పనులు చేస్తున్న ఖిద్మత్ టీం సభ్యులను స్థానికులు మెచ్చుకున్నారు.




