Latest

ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?
National· 24 Aug 2026

ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?

ముంబైలో ఆటో నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉంటే సరిపోదా? “అవును, సరిపోదు” అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీలో కనీసం మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలట. RTO అధికారులు ప్రయాణికులతో మాట్లాడే పరిస్థితులపై 16 ప్రశ్నలు అడుగుతున్నారు. మరాఠీ రాకపోతే ముందుగా నెలరోజుల గడువు ఇస్తారు. అప్పటికీ అవసరమైన స్థాయిలో రాకపోతే బ్యాడ్జ్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ రూల్‌పై కొందరు డ్రైవర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం మాత్రం ప్రయాణికులతో లోకల్ లాంగ్వేజ్‌లో ఈజీగా మాట్లాడేందుకే ఈ రూల్ అంటోంది.

బహుజనుల రాజ్యంతోనే ప్రజల అభివృద్ధి: డాక్టర్ కదిరి కృష్ణ
Local· 24 Aug 2026

బహుజనుల రాజ్యంతోనే ప్రజల అభివృద్ధి: డాక్టర్ కదిరి కృష్ణ

TG : తెలంగాణలో బహుజనుల రాజ్యం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని బహుజన సేన వ్యవస్థాపకులు డాక్టర్ కదిరి కృష్ణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న BC,SC,ST శ్రామిక వర్గాలకు సరైన వాటా, అధికారాలు దక్కాలని కోరారు. ఇప్పటిదాకా పాలకులు బహుజనులను మోసం చేశారని, ప్రజల తరఫున బహుజన సేన ఎప్పుడూ పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, చంద్రశేఖర్, నారాయణ పాల్గొన్నారు.

కన్స్యూమర్ కమిషన్‌లో కేసు ఎలా వేయాలి?
Local· 24 Aug 2026

కన్స్యూమర్ కమిషన్‌లో కేసు ఎలా వేయాలి?

AP : వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడానికి డిస్ట్రిక్ట్ కంజ్యూమర్ సొసైటీస్ ఫెడరేషన్ (DCSF) ఆధ్వర్యంలో డుంబ్రిగుడలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 30(ఆదివారం)న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. లాయర్ అవసరం లేకుండా కన్స్యూమర్ కోర్టులో కేసు ఎలా వేయాలి, e-Jagriti ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం, సరైన పేపర్లు జత చేసి నష్టపరిహారం ఎలా పొందాలో వివరంగా నేర్పిస్తారు. వ్యాపారులు, ప్రజలంతా వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాలని DCSF చెప్పింది.

స్థానిక ఎన్నికలపై ఫైనల్ డెసిషన్ పవన్‌కళ్యాణ్‌దే: జనసేన
Current Affairs· 24 Aug 2026

స్థానిక ఎన్నికలపై ఫైనల్ డెసిషన్ పవన్‌కళ్యాణ్‌దే: జనసేన

AP: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు సాగుతున్నాయని వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని చూసిన తర్వాతే జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల విషయంలో పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది.

జార్ఖండ్‌లో కొత్త యాత్ర స్టార్ట్!
Education· 24 Aug 2026

జార్ఖండ్‌లో కొత్త యాత్ర స్టార్ట్!

జార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు తేవడమే లక్ష్యంగా JLKM లీడర్ దేవేంద్ర నాథ్ మహతో ‘భారతి వ్యవస్థ సుధార్ యాత్ర’ను ప్రారంభించారు. మాజీ CM శిబు సోరేన్ జన్మస్థలమైన రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలో ఆగస్టు 24న ఈ యాత్రను ఆయన స్టార్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధివిధానాలు పారదర్శకంగా ఉండాలని, ఎగ్జామ్ ప్రాసెస్ మారాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నట్లు దేవేంద్ర నాథ్ స్పష్టం చేశారు.

లారీ అసోసియేషన్ ఫైర్
Local· 24 Aug 2026

లారీ అసోసియేషన్ ఫైర్

AP : విశాఖపట్నం షీలానగర్ దగ్గర మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ పిడిగుద్దులతో దాడి చేయడంతో వివాదంగా మారింది. లారీ ఆపలేదని చెప్పి ఇన్‌స్పెక్టర్ ముందే కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై AP లారీ అసోసియేషన్ ఆందోళనకు సిద్ధమవుతోంది. దెబ్బలు తిన్న డ్రైవర్‌కి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని అడుగుతున్నారు. డ్రైవర్ల రక్షణ కోసం, వాళ్ల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటానికి దిగాలని అసోసియేషన్ ప్లాన్ చేస్తోంది.

నా టూర్‌కు NO.. గుజరాత్ CMకు ఎలా అనుమతిచ్చారు?: CM రేవంత్
TG· 24 Aug 2026

నా టూర్‌కు NO.. గుజరాత్ CMకు ఎలా అనుమతిచ్చారు?: CM రేవంత్

TG: ఈరోజు సచివాలయంలో CM రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతించిందని, అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. BJP నేతలు తన పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్య, క్రీడా రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమన్నారు. తనకు అనుమతి నిరాకరించి గుజరాత్ CMకు ఎలా అనుమతిచ్చారని కేంద్రాన్ని, BJP ఎంపీలను ప్రశ్నించారు.

లారీ డ్రైవర్‌పై దాడి.. ధర్నాకు లారీ అసోసియేషన్!
AP· 24 Aug 2026

లారీ డ్రైవర్‌పై దాడి.. ధర్నాకు లారీ అసోసియేషన్!

AP: విశాఖపట్నంలోని గాజువాకలో లారీ డ్రైవర్‌పై ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ డ్రైవర్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ ఆపలేదని బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి వెహికల్‌ను ఓవర్‌టేక్ చేసినట్లు తెలుస్తోంది. తరువాత ఇన్‌స్పెక్టర్ దగ్గరే ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో దారుణంగా దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్
TG· 24 Aug 2026

రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్

TG : పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగంలోకి మార్చి, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి కలిపేలా ప్రభుత్వం తెచ్చిన GO 97పై ABVP మండిపడింది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మరింత బాగు చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిర్ణయంతో Btechలో నేరుగా సెకండియర్‌లో చేరే (లేటరల్ ఎంట్రీ) అవకాశం ఉండదేమోనని స్టూడెంట్స్ భయపడుతున్నారు.

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్ ఇవే!
Education· 24 Aug 2026

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్ ఇవే!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ల దారుణమైన పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కే ఎడ్యుకేషన్ మినిస్టర్లకు లెటర్ రాశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లవుతున్నా స్కూళ్లల్లో మంచి నీరు, టాయిలెట్స్, కనీసం బెంచీలు కూడా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రిపేర్లు చేసిన స్కూళ్లు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, కేటాయించిన ఫండ్స్ వివరాలను పబ్లిక్‌గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

UPI కి 10 ఏళ్లు!
Politics· 24 Aug 2026

UPI కి 10 ఏళ్లు!

మనం ప్రతీ చిన్నదానికి వాడే 'UPI' వచ్చి 10 ఏళ్లు అవుతుంది. 2016 ఆగస్టు 25న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. ఈ దశాబ్ద కాలంలో మన దేశ ఆర్థిక వ్యవస్థకే UPI ఒక వెన్నుముకలా నిలిచింది. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న ఏడాది మొత్తం లావాదేవీలు, 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ తెలిపింది. లావాదేవీల సంఖ్య దాదాపు 13 వేల రెట్లు పెరిగింది. లావాదేవీల విలువ 0.07 లక్షల కోట్ల నుంచి 314 లక్షల కోట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది.

అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు అభిజీత్ దీప్కే లెటర్
Current Affairs· 24 Aug 2026

అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు అభిజీత్ దీప్కే లెటర్

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు లెటర్ రాశాడు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను దేశం తెలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ఇప్పటికీ సురక్షితమైన నీరు, టాయిలెట్లు, సరైన తరగతి గదులు, కూర్చోవడానికి బెంచీలు లేకుండా చదువుతున్నారని లెటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏ పిల్లవాడూ ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోకూడదు. వారిని జంతువుల కంటే ఘోరంగా చూస్తున్నారు” అని పేర్కొన్నారు.

విమెన్ ప్రొటెస్టర్స్ Vs పోలీస్: CJI సంచలన ఆర్డర్!
National· 24 Aug 2026

విమెన్ ప్రొటెస్టర్స్ Vs పోలీస్: CJI సంచలన ఆర్డర్!

NEET ప్రొటెస్ట్ టైమ్‌లో జూలై 20న విమెన్ ప్రొటెస్టర్స్‌పై జరిగిన సెక్సువల్ అసాల్ట్, పోలీస్ దాడిపై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ కీలక అనౌన్స్‌మెంట్ చేశారు. బాధితులు ఎవరైనా సరే డైరెక్ట్‌గా హై పవర్డ్ ఎంక్వైరీ కమిటీ నోడల్ ఆఫీసర్‌ను కలిసి పోలీసులపై కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ శోభా గుప్తా అడిగిన స్పెషల్ సేఫ్టీ రెఫరెన్స్‌పై స్పందించిన CJI, ఈ కమిటీ నోడల్ ఆఫీసర్‌గా లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్ ఉంటారని క్లారిటీ ఇచ్చారు.

‘వారణాసి’ కోసం AI ని పక్కన పెట్టిన రాజమౌళి
Entertainment· 24 Aug 2026

‘వారణాసి’ కోసం AI ని పక్కన పెట్టిన రాజమౌళి

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రూ.1,400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. డబ్బింగ్ కోసం ఎలాంటి AI వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీలు వాడకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారు. సినిమాలోని భావోద్వేగాలు సహజంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో స్థానిక యాసలోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారని తెలుస్తోంది.

మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. ఈసారి?
National· 24 Aug 2026

మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ్.. ఈసారి?

తమిళనాడు CM విజయ్ ఈరోజు అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు Free బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎక్స్‌ప్రెస్, LSS, డీలక్స్ Govt. బస్సుల్లోనూ మహిళలు Freeగా జర్నీ చేయవచ్చని వెల్లడించారు. ఈ స్కీమ్ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుందని అనౌన్స్ చేసారు. అలాగే మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. రైతుల వ్యతిరేకత కారణంగా పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు.

హిడింబి: ఆదిమ జాతుల తిరుగుబాటు గాథ
Arts/Literature· 24 Aug 2026

హిడింబి: ఆదిమ జాతుల తిరుగుబాటు గాథ

మహాభారతంలో భీముని భార్య, ఘటోత్కచుని తల్లి హిడింబి. రాక్షస వంశంలో పుట్టి, పాండవుల కథలో కొద్దిసేపు కనిపించి మాయమైపోయిన ఆమెకు సాహిత్యంలో సరైన స్థానం లభించలేదు. ఆ లోపాన్ని పూరించే ప్రయత్నమే నరేష్‌కుమార్ సూఫీ రాసిన ‘హిడింబి’ నవల. ఝాన్సీ పబ్లికేషన్స్ ద్వారా ఈ నవల పబ్లిష్ అయ్యింది. మేజిక్ రియలిజం కోణంలో సాగే ఈ నవలలో దేవతలు, రాక్షసులు ఉండరు. ఆదిమ జాతుల ప్రేమ, త్యాగం, సంస్కృతి, ప్రపంచం గురించి లోతైన విషయాలతో నవల ఆసక్తిగా సాగుతుంది. ఈ నవల త్వరలో మలయాళంలోకి అనువాదమవుతోంది. దీని ధర ₹220. కొనేందుకు <a href="https://amzn.in/d/04Ubx767">లింక్</a>.

‘ఇరుముడి’  కొత్త రికార్డు!
Entertainment· 24 Aug 2026

‘ఇరుముడి’ కొత్త రికార్డు!

హీరో రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.80 కోట్ల గ్రాస్ సాధించి, తాజాగా 2026లో ఆదివారం రోజు అత్యధికంగా జనాలు చూసిన సినిమాగా రికార్డు సాధించింది.

KYC.. OTP.. ఇక గ్యాస్ డెలివరీ ఎప్పుడు?
Local· 24 Aug 2026

KYC.. OTP.. ఇక గ్యాస్ డెలివరీ ఎప్పుడు?

చింతపల్లి ఆదివాసీలకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం క్యూలు కాదు, KYC-OTPలే కొత్త టెన్షన్! బుక్ చేసుకున్నా డెలివరీ రావడం లేదు, ఏజెన్సీల వద్ద వాగ్వాదాలు పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. E-KYC ప్రక్రియకు Aug15 వరకు గడువు పెట్టినా, ఇంకా చాలామంది పూర్తి చేయలేదు. సాఫ్ట్‌వేర్ లోపాలు, నెట్వర్క్ సమస్యలు, ఫింగర్ ప్రింట్ ఫెయిలవ్వడం – ఆదివాసీ ప్రాంతాల్లో ఇవి రోజువారీ సమస్యలు. ధరల పెరుగుదల, డెలివరీ జాప్యం – రెండు కలిసి ఆదివాసులను ఇరుక్కునేలా చేస్తున్నాయి.

కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు
National· 24 Aug 2026

కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు

జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఓ మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదు దొరికింది. హూర్(68) తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. సోదరి రెండేళ్ల క్రితం మరణించారు. వీళ్లిద్దరూ వివాహం చేసుకోలేదు. ఆదివారం హూర్ మరణించింది. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, 10, 20, 50 రూపాయల నోట్లు, వేలాది నాణేలు కలిపి 30కు పైగా సంచుల్లో కనిపించాయి. మొత్తం ₹8,40,000 ఉన్నట్లు గుర్తించారు. అందులో కొంత సోదరులు తీసుకోగా, మిగిలింది మసీదుకు దానం చేశారు.

శిక్షణ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు?
Local· 24 Aug 2026

శిక్షణ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు?

AP : నర్సీపట్నంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద 3 నెలల కోర్సు పూర్తి చేసిన యువతకు ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. రెండు బ్యాచ్‌ల అభ్యర్థులు శిక్షణ ముగించుకున్నా, ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఉద్యోగ ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లు అత్యవసరమని అభ్యర్థులు బాధపడుతున్నారు. ఆఫీసు సిబ్బందిని ఎన్నిసార్లు అడిగినా దాటవేత సమాధానాలే చెబుతున్నారని అంటున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా
Local· 24 Aug 2026

ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ వచ్చిన G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విలీనం వల్ల B.Techలో లాటరల్ ఎంట్రీ (ECET) దెబ్బతింటుందని, ఫీజులు పెరుగుతాయని, డిప్లొమా విలువ తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. PPP మోడల్లో నడిచే YISU ఫీజులు పెంచే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇది పాలిటెక్నిక్ విద్యను ‘జనరల్ లేబర్ ట్రైనింగ్’గా మారుస్తుందని ఆందోళన.