హిడింబి: ఆదిమ జాతుల తిరుగుబాటు గాథ

మహాభారతంలో భీముని భార్య, ఘటోత్కచుని తల్లి హిడింబి. రాక్షస వంశంలో పుట్టి, పాండవుల కథలో కొద్దిసేపు కనిపించి మాయమైపోయిన ఆమెకు సాహిత్యంలో సరైన స్థానం లభించలేదు. ఆ లోపాన్ని పూరించే ప్రయత్నమే నరేష్‌కుమార్ సూఫీ రాసిన ‘హిడింబి’ నవల. ఝాన్సీ పబ్లికేషన్స్ ద్వారా ఈ నవల పబ్లిష్ అయ్యింది. మేజిక్ రియలిజం కోణంలో సాగే ఈ నవలలో దేవతలు, రాక్షసులు ఉండరు. ఆదిమ జాతుల ప్రేమ, త్యాగం, సంస్కృతి, ప్రపంచం గురించి లోతైన విషయాలతో నవల ఆసక్తిగా సాగుతుంది. ఈ నవల త్వరలో మలయాళంలోకి అనువాదమవుతోంది. దీని ధర ₹220. కొనేందుకు <a href="https://amzn.in/d/04Ubx767">లింక్</a>.



