KYC.. OTP.. ఇక గ్యాస్ డెలివరీ ఎప్పుడు?
చింతపల్లి ఆదివాసీలకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం క్యూలు కాదు, KYC-OTPలే కొత్త టెన్షన్! బుక్ చేసుకున్నా డెలివరీ రావడం లేదు, ఏజెన్సీల వద్ద వాగ్వాదాలు పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. E-KYC ప్రక్రియకు Aug15 వరకు గడువు పెట్టినా, ఇంకా చాలామంది పూర్తి చేయలేదు. సాఫ్ట్‌వేర్ లోపాలు, నెట్వర్క్ సమస్యలు, ఫింగర్ ప్రింట్ ఫెయిలవ్వడం – ఆదివాసీ ప్రాంతాల్లో ఇవి రోజువారీ సమస్యలు. ధరల పెరుగుదల, డెలివరీ జాప్యం – రెండు కలిసి ఆదివాసులను ఇరుక్కునేలా చేస్తున్నాయి.



