Latest

'విశ్వనాథ్ అండ్ సన్స్' రికార్డు వసూళ్లు!
Entertainment· 16 Aug 2026

'విశ్వనాథ్ అండ్ సన్స్' రికార్డు వసూళ్లు!

హీరో సూర్య కొత్త సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

కెమెరాలు ఆఫ్ చేసి.. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ
Local· 16 Aug 2026

కెమెరాలు ఆఫ్ చేసి.. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

TG: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు.. అనంతరం లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కైట్ ఎగరేస్తుండగా కరెంటు తీగకు తగిలింది.. ఏమైందంటే?
National· 16 Aug 2026

కైట్ ఎగరేస్తుండగా కరెంటు తీగకు తగిలింది.. ఏమైందంటే?

దిల్లీలోని కొండ్లి ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. టెర్రస్‌పై గాలిపటం (కైట్) ఎగరేస్తున్న ఓ బాలుడి గాలిపటం దారం కరెంటు తీగను తాకడంతో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై గాయాలయ్యాయి. దీంతో పేరెంట్స్, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఓవర్‌హెడ్‌ లైన్లకు దగ్గరలోని టెర్రస్‌లు, భవనాలపై గాలిపటాలు ఎగరేయకూడదు. ముఖ్యంగా మెటల్‌తో ఉన్న దారాలు, మాంజాను అసలు వాడకూడదు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశముంది.

మెడలోనుంచి గోల్డ్ చైన్ చోరీ..
TG· 16 Aug 2026

మెడలోనుంచి గోల్డ్ చైన్ చోరీ..

మేడ్చల్‌ పరిధిలోని గిర్మాపూర్‌లో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఒక మహిళ దగ్గరికి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఆమె వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి, CCTV ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండమని పోలీసులు చెబుతున్నారు.

నాగదేవత మండపం ప్రారంభం
Local· 16 Aug 2026

నాగదేవత మండపం ప్రారంభం

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద నాగదేవత మండపాన్ని ఆదివారం ప్రారంభించారు. తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ రూ 1,20,000 సొంత ఖర్చులతో వెంగళ శివలక్ష్మి నరసయ్య ఈ మండపం నిర్మించారని పేర్కొన్నారు. వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, సుద్దాల కర్ణాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Local· 16 Aug 2026

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

TG: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో TPCC ఉపాధ్యక్షుడు, DCC అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. గిరిజన యువతీ యువకులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు భరోసా
TG· 16 Aug 2026

స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు భరోసా

TG: స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా దొరకుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డుల ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పచ్చదనం పరిరక్షణకు విరాళం
Local· 16 Aug 2026

పచ్చదనం పరిరక్షణకు విరాళం

AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఓల్డ్ ఐరెన్ డీలర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను కలిశారు. రూ.50 వేల చెక్కును టీడీపీ నాయకులు, ఇబ్రహీంపట్నం మండలం క్లస్టర్ ఇంచార్జి గరికపాటి శివకు చెక్‌ను అందజేశారు. గ్రామస్తుల తరఫున దాతలకు గరికిపాటి శివ కృతజ్ఞతలు చెప్పారు.

గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
Local· 16 Aug 2026

గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డిన్ టి.గోపికృష్ణ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉత్తరకోస్తా కళింగ సీమలో ఉద్దానం ప్రాంతాన సోంపేట తాలూకాలో 1909 ఆగస్టు 16వ తేదీన గౌతు లచ్చన్న జన్మించారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, రైతు పోరాటాలు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలలో కీలక పాత్ర వహించారని అన్నారు. 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ డాక్టర్ ఎం.కిషన్ తేజ్ పాల్గొన్నారు.

తైవాన్ తన డిఫెన్స్ బడ్జెట్‌ను ఎందుకు పెంచుతోంది?
International· 16 Aug 2026

తైవాన్ తన డిఫెన్స్ బడ్జెట్‌ను ఎందుకు పెంచుతోంది?

చైనా నుంచి పెరుగుతున్న సైనిక ఒత్తిడి నేపథ్యంలో తైవాన్ తన రక్షణను మరింత బలోపేతం చేసుకుంటోంది. 2027లో రక్షణ బడ్జెట్‌ను దాదాపు 16% పెంచి, తొలిసారి 1 ట్రిలియన్ తైవాన్ డాలర్లను దాటించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఖర్చు ఆధునిక ఆయుధాలు, సామర్థ్యాల పెంపుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సంసిద్ధతపైనా ఉంటుంది. అమెరికా కూడా తైవాన్ తన రక్షణ కోసం మరింత ఖర్చు చేయాలని కోరుతోంది. ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాల్లో దాడి, సముద్ర దిగ్బంధనం, ఇంటర్నెట్ అంతరాయం వంటి పరిస్థితులను కూడా పరీక్షించారు.

చందుపట్ల గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
TG· 16 Aug 2026

చందుపట్ల గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. డప్పుల చప్పుళ్లు, డీజే మోతలు, పోతురాజుల నృత్యాల మధ్య మహిళలు నైవేద్యంతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా గుట్టపై ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

దర్శకుడు రాజా సేన్ కన్నుమూత!
National· 16 Aug 2026

దర్శకుడు రాజా సేన్ కన్నుమూత!

నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ బెంగాలీ సినిమా డైరెక్టర్ (దాము, ఆత్మీయ స్వజన్, దేశ్, దేవీపక్ష లాంటి సినిమాలు చేసిన) రాజా సేన్ (71) గారు కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ కావడంతో కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ ఉండగానే ఇవాళ మరణించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
Local· 16 Aug 2026

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

AP: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం జివి పురం గ్రామపంచాయతీ పరిధిలో దళిత ఎంపీటీసీ పత్తూరు ఈశ్వరమ్మ, బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ సర్పంచి కాణిపాకం సుబ్బలక్ష్ముమ్మ ఉండగా, ప్రోటోకాల్ ప్రకారం దళిత ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని గ్రామస్థులు మండిపడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అవమానించిన జీవి పురం గ్రామపంచాయతీ కార్యదర్శి గిరిపై అఖిలభారత అంబేద్కర్ సేన జాతీయ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం
Local· 16 Aug 2026

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం

TG: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన భీమదేవరపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ బస్టాండ్ సమీపంలోని సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం బాషా (65) బిందెలు, బకెట్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం అక్కడికి వచ్చిన ఆయన నీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా, కూలీలతో దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

సెప్టెంబర్‌లో DYFI 16వ రాష్ట్ర మహాసభలు
AP· 16 Aug 2026

సెప్టెంబర్‌లో DYFI 16వ రాష్ట్ర మహాసభలు

AP: సెప్టెంబర్ 1, 2, 3వ తేదీలలో నెల్లూరులో DYFI 16వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా Dr.జెట్టి శేషరెడ్డి భవన్‌లో DYFI లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి మూలం రమేష్, DYFI జిల్లా కార్యదర్శి MV రమణ, జిల్లా అధ్యక్షుడు BP నరసింహ, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు చొప్ప రవీంద్ర పాల్గొన్నారు.

దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
Local· 16 Aug 2026

దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలో 1999లో ప్రభుత్వం 73 మంది దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రజాసంఘాల నాయకులు ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్ల చొప్పున సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఇళ్ల స్థలాలు, స్మశాన వాటిక, పోరంబోకు భూముల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని తహసీల్దార్‌ను కోరారు. పిడియం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటనాయక్, పాల్గొన్నారు.

విశాఖకు గుడ్‌బై.. రేపటి నుంచి Flights అక్కడి నుంచే!
AP· 16 Aug 2026

విశాఖకు గుడ్‌బై.. రేపటి నుంచి Flights అక్కడి నుంచే!

AP: విశాఖపట్నం విమాన ప్రయాణాలలో కీలక మార్పు జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రేపటి నుంచి విశాఖకు రాకపోకలు సాగించే అన్ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ సర్వీసులు భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు ఉన్న VTZ కోడ్‌ను భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు బదిలీ చేయనున్నారు. దీంతో విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఆపరేషన్స్‌లో ఇది కీలకమైన మార్పుగా నిలవనుంది.

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన
Local· 16 Aug 2026

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన

TG: కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల అమలుపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్
AP· 16 Aug 2026

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్

AP: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వారణాసికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా సర్వీసును ప్రారంభించారు. వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సిన ప్రయాణికులకు ఇప్పుడు నేరుగా కాశీ చేరుకునే అవకాశం దక్కింది.

'డాన్ 3' కోసం రణ్‌వీర్..తండ్రి
Entertainment· 16 Aug 2026

'డాన్ 3' కోసం రణ్‌వీర్..తండ్రి

'డాన్ 3' సినిమా నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ లాస్ట్ మినిట్‌లో తప్పుకోవడంతో, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ధ్వానిలు ఫిలిం మేకర్స్ అసోసియేషన్‌లో (IMPPA) కంప్లైంట్ చేశారు. మొదట మా లాయర్లు చూసుకుంటారు అని చెప్పినా, రీసెంట్‌గా రణ్‌వీర్ తండ్రి నిర్మాతల మండలిని కలిసి చర్చలకి ఓకే చెప్పారు. రెండు వైపుల వాదనలు విని త్వరలోనే ఈ సమస్యపై నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది.

కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
AP· 16 Aug 2026

కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

AP: కాలువలోకి కారు దూసుకెళ్లిన <a href="https://www.theclearcutnews.com/n/SqTyj4c">ప్రమాదం</a>లో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల మలుపు వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు కోనసీమ జిల్లా మోరి వైపు కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుస్వంత, సాయిసూర్య నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు.