← Back to news

అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి

By dk· 12 Aug 2026· హన్మకొండ జిల్లా
అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి

TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్‌చందర్‌రెడ్డి (29) మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. జూలై 25న ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనకు 75శాతం కాలిన గాయాలయ్యాయి. అప్పటి నుంచి టాంపా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భరత్‌, 15రోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

More in TG