Latest

🌿 తులసి.. ఆరోగ్యానికి మేలు!
Health· 9 Aug 2026

🌿 తులసి.. ఆరోగ్యానికి మేలు!

తులసి ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, శ్వాస సంబంధ సమస్యల్లో ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడతాయని, అలాగే జీర్ణక్రియ మెరుగుపడటానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని అంటున్నారు. ఉదయాన్నే తులసి ఆకులు లేదా తులసి నీరు తీసుకోవడం మంచిదని తెలిపారు.

యష్ ఒక్క కాల్ చేయగానే వచ్చా- నయనతార
Cinema· 9 Aug 2026

యష్ ఒక్క కాల్ చేయగానే వచ్చా- నయనతార

సాధారణంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌కి దూరంగా ఉండే నయనతార, 'టాక్సిక్' మూవీ ఈవెంట్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు ప్రమోషనల్ ఈవెంట్స్ మాట్లాడటం సరిగ్గా రాదని, అందుకే దూరంగా ఉంటానని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే రాకింగ్ స్టార్ యష్ ఒకే ఒక్క కాల్ చేసి అడగ్గానే ఈ ఈవెంట్‌కి వచ్చానని చెప్పారు. టీమ్ విజన్, ప్రొడ్యూసర్ వెంకట్ గారి సపోర్ట్ వల్లే ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్‌గా మారిందని నయనతార చెప్పారు.

60 ఏళ్లు దాటాక ఇవి తగ్గించండి!
Health· 9 Aug 2026

60 ఏళ్లు దాటాక ఇవి తగ్గించండి!

60 ఏళ్లు దాటిన తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్త అవసరమని డాక్టర్లు అంటున్నారు. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు, ప్రాసెస్డ్‌ మాంసం, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం, మైదా పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, పాపడ్‌, ప్యాకెట్‌ స్నాక్స్‌ తగ్గించడం మంచిదని చెబుతున్నారు. వీటికి బదులుగా కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు తీసుకోవాలని తెలిపారు.

🧘 సైనస్‌కు యోగా.. డాక్టర్ల సూచన!
Health· 9 Aug 2026

🧘 సైనస్‌కు యోగా.. డాక్టర్ల సూచన!

సైనస్ సమస్యతో ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖంలో ఒత్తిడి వంటి ఇబ్బందులు ఉంటే యోగా కొంత ఉపశమనం ఇవ్వొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధోముఖ శ్వానాసనం, భుజంగాసనం, సేతు బంధాసనం, ఉత్తానాసనం వంటి ఆసనాలు ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. జల నేతి కూడా ముక్కు మార్గాలను శుభ్రం చేయడంలో సహాయపడొచ్చని అంటున్నారు. అయితే సరైన పద్ధతిలోనే చేయాలని తెలిపారు.

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి?
Business· 9 Aug 2026

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి?

భారత్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పశ్చిమాసియా టెన్షన్స్, మార్కెట్ పరిస్థితుల వల్ల గోల్డ్‌కి డిమాండ్ మళ్లీ పెరిగింది. ఆగస్టు 5న ₹1,44,000గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర ఈ నాలుగు రోజుల్లో ఏకంగా ₹8 వేలకు పైగా పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹1,52,350గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,39,650 కాగా, 18 క్యారెట్ల రేట్ ₹1,14,260 వద్ద ఉంది. గోల్డ్ ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి, కోనాలనుకునేవారు రేట్స్ చెక్ చేసుకోవడం బెట్టర్.

తగ్గిన చికెన్ ధరలు?
News· 9 Aug 2026

తగ్గిన చికెన్ ధరలు?

హైదరాబాద్‌లో ఈరోజు బోనాల పండుగ ఉన్నా కూడా చికెన్ ధరలు బాగా తగ్గాయి. రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ₹240 నుంచి ₹260 వరకు అమ్మితే, కోడి (లైవ్ బర్డ్) కిలో ₹137గా ఉంది. అలాగే స్కిన్‌తో ఉన్న చికెన్ కిలో ₹212కి లభిస్తోంది. ఫారమ్ దగ్గరైతే లైవ్ బర్డ్ కిలో కేవలం ₹110 మాత్రమే. మరోవైపు షాపుల్లో గుడ్డు ధర ₹7 నుంచి ₹8 మధ్యలో ఉంది.

కూరగాయలు తింటున్నా నీరసంగా ఉంటోందా?
Health· 9 Aug 2026

కూరగాయలు తింటున్నా నీరసంగా ఉంటోందా?

మనం రోజూ కూరగాయలు తింటున్నా అందులోని పోషకాలన్నీ మన శరీరానికి నేరుగా అందవు. టమోటోల్లో ఉండే లైకోపీన్ శరీరానికి బాగా పట్టాలంటే కొద్దిగా ఆయిల్ లేదా కొబ్బరి లాంటి వాటితో కలిపి వండాలి. బీట్‌రూట్‌లో ఐరన్ ఎక్కువగా ఉన్నా, శరీరం దాన్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్-సి (నిమ్మకాయ, ఉసిరి) జత చేయాలి. గ్రీన్ టీలో కొన్ని నిమ్మచుక్కలు పిండితే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా పడతాయి. ఇలా చిన్న మార్పులతో పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

‘రుద్ర’గా మహేష్ బాబు.. ఫస్ట్ లుక్ అవుట్!
Cinema· 9 Aug 2026

‘రుద్ర’గా మహేష్ బాబు.. ఫస్ట్ లుక్ అవుట్!

మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రాజమౌళి డైరెక్షన్‌లో రాబోతున్న ‘వారణాసి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’, ‘శ్రీరాముడు’గా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 'రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు' అనే క్యాప్షన్‌తో రుద్ర క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. ఎప్పుడూ క్లాస్ లుక్‌లో కనిపించే మహేష్.. ఇందులో ఒత్తైన జుట్టు, గెడ్డంతో రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు.. ఇద్దరి కండిషన్ సీరియస్!
AP· 9 Aug 2026

వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు.. ఇద్దరి కండిషన్ సీరియస్!

అనంతపురం జిల్లా పామిడి మండలం పోగూరు దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఘోరమైన యాక్సిడెంట్‌కి గురైంది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న ఈ బస్, ఎదురుగా వస్తున్న ఐచర్ వెహికల్‌ని డైరెక్ట్‌గా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కి బస్ కంట్రోల్ తప్పి హైవే పక్కనే ఉన్న కల్వర్టు పైనుంచి కింద పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో 18 మంది ప్యాసింజర్స్‌కి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి. బస్, ఐచర్ డ్రైవర్లు క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో.. పోలీసులు, స్థానికులు వాహనం భాగాలను కట్ చేసి వాళ్లని బయటికి తీశారు. ప్రజెంట్ ఇద్దరి కండిషన్ సీరియస్‌గా ఉంది.

🌿ఆదివాసీల సంస్కృతికి సెల్యూట్..!
News· 9 Aug 2026

🌿ఆదివాసీల సంస్కృతికి సెల్యూట్..!

ప్రతి ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. అడవులు, ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, భాషలను ఆదివాసీలు నిలబెట్టుకుంటున్నారు. వారి జీవన విధానం, హక్కులు, అభివృద్ధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఆదివాసీ సంస్కృతిని గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడటం మనందరి బాధ్యత. 🌿🤝

ఏంటి ఈ 'మిల్క్ బన్స్' క్రేజ్?
News· 9 Aug 2026

ఏంటి ఈ 'మిల్క్ బన్స్' క్రేజ్?

జపాన్‌కు చెందిన 'మిల్క్ బన్స్' ప్రస్తుతం UK సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చాలా స్వీట్‌గా, సాఫ్ట్‌గా, ఫోటోజెనిక్‌గా ఉండటంతో Gen Z వీటి లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. వీటి క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. UKలోని సూపర్‌మార్కెట్ వెబ్‌సైట్లలో ఈ మిల్క్ బన్స్ సెర్చెస్ ఏకంగా 617% పెరగ్గా, సేల్స్ 27% పెరిగాయి. ప్రెజెంటేషన్, టేస్ట్ అద్భుతంగా ఉండటంతో గ్లోబల్ బేకరీలు, రెస్టారెంట్లలో ఈ జపనీస్ ఫుడ్ మెయిన్ అట్రాక్షన్‌గా మారింది.

బ్రెయిన్ మెమరీ పెరిగే ప్రాసెస్ ఇదే?
Health· 9 Aug 2026

బ్రెయిన్ మెమరీ పెరిగే ప్రాసెస్ ఇదే?

మనం తినే ఫుడ్, చేసే వర్కవుట్, పోయే నిద్ర.. ఈ మూడూ డైరెక్ట్‌గా మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేస్తాయని న్యూరోసైంటిస్ట్ హన్నా క్రిచ్‌లో రీసెర్చ్‌తో ప్రూవ్ చేశారు. మనం మంచి ఫుడ్ తింటే మన ఒంట్లోని సెల్స్ దాన్ని బ్రెయిన్ ఎనర్జీగా మారుస్తాయి. ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బ్రెయిన్‌లో మెమరీ స్టోరేజ్ పెరిగి ఆలోచించే స్పీడ్ డబుల్ అవుతుంది. ఇక మనం నిద్రపోయే టైమ్‌లోనే బ్రెయిన్ సెల్స్ సిస్టమ్ అప్‌డేట్‌లాగా రిపేర్ అవుతాయి. సో బ్రెయిన్ సూపర్‌ఫాస్ట్ ప్రాసెసర్‌లా పనిచేయాలంటే ఈ మూడూ లైఫ్‌లో పక్కా ఉండాల్సిందే.

ఉదయాన్నే తాగితే ఏమవుతుంది?
Health· 9 Aug 2026

ఉదయాన్నే తాగితే ఏమవుతుంది?

ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగితే అలసట తగ్గి, మంచి ఎనర్జీతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. రోజుకు 3-4 కప్పుల వరకు పరిమితంగా తాగితే గుండెకు మంచిది, అలాగే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు రావచ్చు. ఎక్కువగా తాగితే ఒత్తిడి, ఆందోళన పెరగడమే కాకుండా శరీరం ఐరన్, క్యాల్షియంలను పీల్చుకునే శక్తి తగ్గిపోతుందని, లిమిట్‌గా తాగితే మంచిదని తెలిపారు.

'అఖండ' లుక్ కాపీ కొట్టారా?
Cinema· 9 Aug 2026

'అఖండ' లుక్ కాపీ కొట్టారా?

వరుణ్ తేజ్ మూవీ 'కొరియన్ కనకరాజు' చుట్టూ ఇప్పుడు బిగ్ కాంట్రావర్సీ నడుస్తోంది. ఈ సినిమాలో కామెడియన్ సత్య సీనియర్ NTR ఐకానిక్ డైలాగ్‌ని స్పూఫ్ చేయడంపై ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అలాగే మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ బాలకృష్ణ 'అఖండ' లుక్‌కి కార్బన్ కాపీలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఎవరినీ డిస్రెస్పెక్ట్ చేసే ఇంటెన్షన్ తమకు లేదని, కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికే ఆ ట్రెండింగ్ క్లిప్‌ని వాడామని హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ క్లారిటీ ఇచ్చారు.

8 ఏళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్!
News· 9 Aug 2026

8 ఏళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్!

బీహార్‌కు చెందిన రాహుల్ 12 ఏళ్ల వయసులో స్నేక్ బైట్‌కు గురికాగా, చనిపోయాడని అనుకుని పేరెంట్స్ అతని బాడీని గంగా నదిలో వదిలేశారు. కానీ సరిగ్గా 8 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయి ఇంటికి రిటర్న్ వచ్చి అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. రివర్‌లో కొట్టుకుపోతున్న తనను ఒక సాధువు సేవ్ చేసి గోరఖ్‌పూర్ తీసుకెళ్లాడని రాహుల్ చెప్పాడు. ఒంటిపై ఉన్న గాయం గుర్తు ఆధారంగా ఫ్యామిలీ మెంబర్స్ అతనిని గుర్తుపట్టారు.

ఈ నెల 17 నుంచే AP అసెంబ్లీ సమావేశాలు!
Politics· 8 Aug 2026

ఈ నెల 17 నుంచే AP అసెంబ్లీ సమావేశాలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ కానున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి మీటింగ్స్ ప్రారంభమవుతాయి. అదే రోజు ఉదయం జరిగే BAC మీటింగ్‌లో అసెంబ్లీని ఎన్ని రోజులు రన్ చేయాలి, ఏమేం టాపిక్స్ డిస్కస్ చేయాలనే దానిపై డిసిషన్ తీసుకోనున్నారు.

డ్రోన్ కారు భలే ఉంది భయ్యా!
Technology· 8 Aug 2026

డ్రోన్ కారు భలే ఉంది భయ్యా!

ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా అనే వ్యక్తి 'హపిడా స్కై' పేరుతో గాల్లో ఎగిరే ఒక కొత్త కారును తయారు చేశారు. ఒకరు మాత్రమే ప్రయాణించేలా, పూర్తిగా ఎలెక్ట్రిక్ తో నడిచేలా దీనిని డిజైన్ చేశారు. డ్రోన్ టెక్నాలజీని వాడుకొని తయారు చేసిన ఈ కారు టెస్టింగ్ సక్సెస్ అయింది. భవిష్యత్తులో మనం ట్రాఫిక్‌తో పనిలేకుండా గాల్లోనే ఈజీగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.

డేటింగ్ యాప్‌లో రూ.6 కోట్ల స్కామ్!
News· 8 Aug 2026

డేటింగ్ యాప్‌లో రూ.6 కోట్ల స్కామ్!

UP కి చెందిన పల్లవి సింగ్ అనే యువతి డేటింగ్ యాప్స్‌లో అబ్బాయిలని ట్రాప్ చేసి భారీ స్కామ్ చేసింది. పరిచయం పెంచుకుని, వాళ్ళతో క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగింది. ఇలా బెదిరించి ఏకంగా రూ.6 కోట్లు వసూలు చేసింది. ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లపై ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపేది. ఫైనల్ గా ఒక హైకోర్టు లాయర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈమె స్టోరీ బయటపడింది. ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.

స్విమ్మింగ్‌లో తెలంగాణ అమ్మాయి గోల్డ్ మెడల్ రికార్డ్!
Sports· 8 Aug 2026

స్విమ్మింగ్‌లో తెలంగాణ అమ్మాయి గోల్డ్ మెడల్ రికార్డ్!

జైపూర్‌లో జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా గోల్డ్ మెడల్ సాధించింది. గర్ల్స్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరీలో 4:38.47 సెకన్ల టైమింగ్‌తో అందరికంటే ముందుగా రేస్ ఫినిష్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కేరళ, కర్ణాటక స్విమ్మర్ల నుంచి గట్టి కాంపిటీషన్ ఎదురైనప్పటికీ శివాని టాప్ ప్లేస్ దక్కించుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయుష్ యాదవ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న శివానిని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది.

జనసేనకు బీజేపీ బిగ్ షాక్!
Politics· 8 Aug 2026

జనసేనకు బీజేపీ బిగ్ షాక్!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ జనసేనతో కానీ, వేరే ఏ పార్టీతోనూ కానీ పొత్తు ఉండదని రాష్ట్ర BJP అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో జనసేన NDAతో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం BJP ఒంటరిగానే పోటీకి దిగుతుందన్నారు. పొత్తులపై జాతీయ నాయకత్వానిదే ఫైనల్ డిసిషన్ అని, తెలంగాణలో మాత్రం తమ స్టాండ్ సోలో ఫైటే అని క్లారిటీ ఇచ్చారు.

న్యాయం లేట్ గా  ఎందుకు జరుగుతుంది అంటే?- CJP సూర్య కాంత్
Legal· 8 Aug 2026

న్యాయం లేట్ గా ఎందుకు జరుగుతుంది అంటే?- CJP సూర్య కాంత్

ఇండోర్‌లో జరిగిన NALSA కాన్ఫరెన్స్‌లో సుప్రీంకోర్ట్ జడ్జి సూర్య కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి డాక్టర్స్ ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తారో, న్యాయం కోసం వచ్చే పేదలు, మహిళలకు పారాలీగల్ వాలంటీర్లు కూడా అలాగే సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. లీగల్ ప్రాసెస్‌లో నోటీసులు, ఎవిడెన్స్ వల్ల కేసులు కాస్త లేట్ అవ్వొచ్చు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది! 10-20 ఏళ్ల క్రితం లాగా కాకుండా, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తూ పబ్లిక్‌కి చాలా ఫాస్ట్‌గా న్యాయం అందేలా కొత్త స్కీమ్స్ తెస్తున్నామన్నారు.