Latest

రియల్ లైఫ్‌లో సిలబస్ ఉండదు- ప్రధాని మోదీ
Politics· 8 Aug 2026

రియల్ లైఫ్‌లో సిలబస్ ఉండదు- ప్రధాని మోదీ

IIT ఢిల్లీ ప్రోగ్రామ్‌లో ప్రధాని<a href="https://x.com/narendramodi/status/2086079987908804678?s=20"> మోదీ</a> స్టూడెంట్స్‌కి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. కాలేజీ లైఫ్‌కి, బయట రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందన్నారు. ఐఐటీ ఎగ్జామ్స్‌కి పక్కాగా సిలబస్ ఉంటుంది కానీ, రియల్ లైఫ్ ఎగ్జామ్‌లో ప్రతీదీ 'అవుట్ ఆఫ్ సిలబస్'గానే ఉంటుందని చెప్పారు. లైఫ్‌లో ఎదురయ్యే కొత్త ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వెతికేవారే సక్సెస్ అవుతారన్నారు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు వదులుకోవద్దని స్టూడెంట్స్‌ని మోటివేట్ చేశారు.

మోహన్‌లాల్ లైవ్ షో పోస్ట్‌పోన్.. రీజన్ ఇదే!
Politics· 8 Aug 2026

మోహన్‌లాల్ లైవ్ షో పోస్ట్‌పోన్.. రీజన్ ఇదే!

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కి ఆస్ట్రేలియా వీసా టైమ్‌కి రాకపోవడంతో సిడ్నీలో జరగాల్సిన ఆయన లైవ్ షో పోస్ట్‌పోన్ అయింది. వీసా ప్రాసెస్ లేట్ అవ్వడం వల్లే రాలేకపోయానని, ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందని, ఫ్యాన్స్‌కి సారీ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ లేకుండా షో చేయలేమని, త్వరలోనే న్యూ డేట్స్ అనౌన్స్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఊర్వశి రౌతేలా పోస్టులతో పాఠాలు.
Infotainment· 8 Aug 2026

ఊర్వశి రౌతేలా పోస్టులతో పాఠాలు.

పాప్ కల్చర్, బాలీవుడ్ గాసిప్స్, మీమ్స్ అంటే కేవలం కాలక్షేపం మాత్రమే కాదు. వాటి వెనుక లోతైన ఫిలాసఫీ, సోషియాలజీ ఉన్నాయని కొత్త తరం 'స్కాలర్-ఫ్లూయెన్సర్లు' చెబుతున్నారు. ఊర్వశి రౌతేలా పోస్టులు, కిమ్ కర్దాషియాన్ విజువల్స్, టీవీ సీరియళ్లను కూడా కేస్ స్టడీలుగా వాడుకుంటూ ప్రొఫెసర్లు, పరిశోధకులు రీల్స్ ద్వారా ఫిలాసఫీ, ఎకనామిక్స్ పాఠాలు చెబుతున్నారు. కష్టమైన కాన్సెప్టులను మీమ్స్‌తో ముడిపెట్టి 60 సెకన్ల వీడియోల్లోనే అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

గుడిలో హుండీ దొంగతనం!
News· 8 Aug 2026

గుడిలో హుండీ దొంగతనం!

సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునగర్ కాలనీలోని భవానీ మాతా టెంపుల్‌లో దొంగతనం జరిగింది. మిడ్‌నైట్ (2:22AM) ఒక దొంగ సైలెంట్‌గా గుడిలోకి వెళ్లి హుండీని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత హుండీలో ఉన్న క్యాష్ అంతా తీసేసుకుని, ఖాళీ హుండీని టెంపుల్ పక్కనే పడేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఉదయాన్నే ఇది గమనించిన లోకల్ పీపుల్ పోలీస్‌లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Social Battery అంటే ఏంటి?
Education· 8 Aug 2026

Social Battery అంటే ఏంటి?

ఫ్రెండ్స్‌తో ఔటింగ్, పార్టీ లేదా ఫంక్షన్‌కి వెళ్లాక.. “ఇంక చాలు, ఇంటికి వెళ్లాలి” అనిపిస్తుందా? 😮‍💨🔋 దీన్నే చాలామంది “సోషల్ బ్యాటరీ అయిపోయింది” అంటారు. అంటే నిజంగా బ్యాటరీ అయిపోవడం కాదు. 😅 ఎక్కువసేపు జనాలతో మాట్లాడటం, సోషల్ ఈవెంట్స్‌లో ఉండటం వల్ల మెంటల్‌గా అలసిపోయి, కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపించడం. ఇది ఇంట్రోవర్ట్స్‌లో ఎక్కువగా కనిపించినా, ఎవరికైనా ఇలా అనిపించొచ్చు. కొద్దిసేపు ప్రశాంతంగా గడిపితే మళ్లీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఫోన్‌కి ఛార్జర్ ఎలా అవసరమో.. కొన్నిసార్లు మనకూ “మన Time” అంతే అవసరం!

ప్రభుదేవాకు రేర్ హానర్..
Cinema· 8 Aug 2026

ప్రభుదేవాకు రేర్ హానర్..

ఇండియన్ మైఖేల్ జాక్సన్ <a href="https://x.com/PDdancing/status/2085711918602547640?s=20">ప్రభూదేవా</a>కు USAలో అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్‌లోని 'సిటీ ఆఫ్ డల్లాస్' నుంచి ఆయన ఒక స్పెషల్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. "నాపై ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న ఫ్యాన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్, మీ ప్రేమే నా మెయిన్ స్ట్రెంగ్త్" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

చెరువులుగా మారిన రోడ్లు!
News· 8 Aug 2026

చెరువులుగా మారిన రోడ్లు!

ఢిల్లీలోని సంగమ్ విహార్‌లో భారీ వర్షాలు పడటంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ కొందరు పిల్లలు మాత్రం రోడ్డుపై మోకాళ్ల వరకు నిలిచిన వర్షపు నీటిలోనే స్విమ్మింగ్ చేస్తూ జాలీగా ఆడుకున్నారు. ఒకవైపు జనాల ఇబ్బందులు, మరోవైపు రోడ్డుపై సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ పిల్లల వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?
Politics· 8 Aug 2026

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?

ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పెద్దవాళ్ల విషయం అనుకునేవారు.. ఇప్పుడు Gen Z కూడా బలంగా మాట్లాడుతోంది..! 🗳️ సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్స్ వల్ల యువత తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు, విద్య, AI, ఆర్థిక అవకాశాలు వంటి తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా స్పందిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల నాటికి Gen Z భారతదేశంలో అతిపెద్ద ఓటర్ల వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

PM ఫుడ్ సెక్యూరిటీ సీక్రెట్స్..
Politics· 8 Aug 2026

PM ఫుడ్ సెక్యూరిటీ సీక్రెట్స్..

ప్రధాని మోదీ తినే ఆహారం వెనుక ఉండే ఫుడ్ సెక్యూరిటీ ఎంత టైట్‌గా ఉంటుందో తెలుసా? ఆయన సెక్యూరిటీ బాధ్యతలను కమాండెంట్ ఆఫీసర్ ఎం. రామకృష్ణ అండ్ టీమ్ పర్యవేక్షిస్తారు. మార్కెట్‌లో ఫ్రెష్ వెజిటబుల్స్ కొనడం దగ్గర్నుంచి కుకింగ్ పూర్తయ్యే వరకు ప్రతీదీ వీళ్ల కళ్లముందే జరుగుతుంది. ప్రధాని తినడానికి కంటే ముందే రామకృష్ణ తన టీమ్‌తో కలిసి ఆ ఫుడ్‌ని స్వయంగా టేస్ట్ చేసి క్వాలిటీ చెక్ చేస్తారు. ప్రధాని రక్షణ కోసం వీళ్లు తీసుకునే కేర్ ఇలా ఉంటుంది. ఇంకా డీటైల్ గా తెల్సుకోవలంటే <a href="https://x.com/tathvamasi6/status/2085984525012660650?s=20">లింక్(రెడ్ కలర్)</a> క్లిక్ చేయండి.

మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?
India· 8 Aug 2026

మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?

బెంగళూరులోని ఓ ఇంట్లో దక్షాయిని(57) అనే మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు 2005లో మరణించాడు. దీంతో ఆమెకు స్కిజోఫ్రేనియా వచ్చింది. 2017లో భర్త మరణించాక ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండేళ్లుగా ఎవరితోనూ ఆమెకు సంబంధాలు లేవు. ఆమె సోదరుడు మహేష్ బసప్ప పోలీసులకు చెప్పడంతో వాళ్లు వచ్చి శవాన్ని గుర్తించారు. ఆమె మరణించి రెండేళ్లయ్యిందా అని అనుమానిస్తున్నారు.

రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!
Politics· 8 Aug 2026

రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని కమలానగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ టైమ్‌లో వెహికల్స్ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, అధికారులు అక్కడికొచ్చి వాహనాల రాకపోకలను ఆపేశారు. సమాజ్‌వాదీ పార్టీ లీడర్ నితిన్ కోహ్లీ అక్కడికి చేరుకున్నారు. నిచ్చెనతో గుంతలోకి దిగిన ఆయన.. ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనుల్లో కరప్షన్ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.

UPI ఛార్జీల రూమర్స్‌కి చెక్
News· 8 Aug 2026

UPI ఛార్జీల రూమర్స్‌కి చెక్

UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు పడవని PhonePe CEO <a href="https://x.com/_sameernigam/status/2085983802778583313?s=20">సమీర్ నిగమ్</a> క్లారిటీ ఇచ్చారు. "ఇండియన్ యూజర్లకు UPI ఎప్పటికీ పూర్తి ఫ్రీగా అందుతుంది. యూజర్లు చేసే పేమెంట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు" అని ఆయన ఎక్స్ (Twitter) పోస్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. రీసెంట్‌గా ఛార్జీలపై వస్తున్న రూమర్స్‌కి ఈ ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పటిలాగే ఫ్రీగా UPI వాడుకోవచ్చు.

ట్రాఫిక్‌కు టాటా.. గాల్లో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్!
Technology· 8 Aug 2026

ట్రాఫిక్‌కు టాటా.. గాల్లో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్!

దేశంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ఉత్తరాఖండ్‌ యువకుడు రవి తమ్తా సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను డిజైన్ చేశాడు. అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి.. ‘హపిదా స్కైనెక్స్’ పేరుతో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను డెవలప్ చేశాడు. అల్మోరా గ్రౌండ్‌లో దీన్ని సక్సెస్ఫుల్‌గా టెస్ట్ చేశాడు. పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే ఈ వెహికల్ గ్రీన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రవి స్థాపించిన హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్‌ ద్వారా దీనిని డెవలప్ చేశారు.

డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్?
News· 8 Aug 2026

డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్?

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వచ్చే డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వీటిపై యాక్షన్ తీసుకోవాలని మెటా కంపెనీని ఆర్డర్ చేసింది. సోషల్ మీడియాలో ఉండే కంటెంట్‌కు ఆయా కంపెనీలే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని క్లియర్‌గా చెప్పింది. మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో రీసెంట్‌గా జరిగిన మీటింగ్‌లో ఆరా తీశారు. గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్స్‌కి రెస్పాండ్ అయిన మెటా, డీప్‌ఫేక్స్ ఆపడానికి తమ దగ్గర ప్రాపర్ సొల్యూషన్స్ ఉన్నాయని తెలిపింది.

అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్
Crime· 8 Aug 2026

అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్

AP: కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో ఫీజ్ కట్టలేదని అవమానించడంతో ఇంటర్ ఫస్టియర్ (15 ఇయర్స్) స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఫీజ్ కట్టలేదని క్లాస్‌రూమ్‌లో అందరి ముందు స్టాఫ్ నిలదీసి ఇంటికి పంపారు. ఇది చూసిన తోటి స్టూడెంట్స్ నవ్వడంతో అవమానంగా భావించి ఆ స్టూడెంట్ నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారు.

టెక్నాలజీ వరమా.. ప్రైవసీకి శాపమా?
Infotainment· 8 Aug 2026

టెక్నాలజీ వరమా.. ప్రైవసీకి శాపమా?

మెటా విడుదల చేసిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అమ్ముడవుతూ పాపులర్ అవుతున్నాయి. వీటి ద్వారా ఎదుటివారికి తెలియకుండా సీక్రెట్‌గా వీడియోలు తీసే ఛాన్స్ ఉందేమోనని ప్రజలు భయపడుతున్నారు. చూపు లోపం ఉన్నవారికి, రోజువారీ పనులకు ఇవి బాగా హెల్ప్ అవుతున్నాయని యూజర్లు అంటుంటే, ఇతరుల ప్రైవసీని దెబ్బతీసేలా మారుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ వరమా లేక ప్రైవసీకి శాపమా అని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..
Cinema· 8 Aug 2026

వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త హారర్-కామిడీ సినిమా 'కోరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్‌గా రూ.10.2 కోట్లకు పైగా మొత్తం కలెక్షన్స్ సాధించి, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. హారర్‌తో పాటు మంచి కామెడీ ఉండటంతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్లలో జనాలు బాగానే వస్తుండటంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక నార్త్ అమెరికాలో కూడా ఆల్రెడీ $175K కంటే ఎక్కువ కలెక్ట్ చేసి మంచి రన్ సాధిస్తోంది.

లాంగ్ వీకెండ్ లేకున్నా తగ్గేదేలే..
Infotainment· 8 Aug 2026

లాంగ్ వీకెండ్ లేకున్నా తగ్గేదేలే..

ఈసారి 'Independence Day' శనివారం రావడంతో పెద్దగా లాంగ్ వీకెండ్ లేకపోయినా టూరిస్టులేమీ నిరాశపడటం లేదు. విమానాల్లో దూర ప్రాంతాలకు వెళ్లేకంటే, సొంత వాహనాల్లోనే 2 నుండి 5 గంటల దూరంలో ఉన్న రిసార్ట్స్, రోడ్ ట్రిప్స్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముంబై వాసులు లోనావాలా, బెంగళూరు జనాలు కూర్గ్, అలాగే ఊటీ, కొచ్చి వైపు క్యూ కడుతున్నారు. దీంతో విల్లాలు, హోటళ్ల బుకింగ్స్ 30 శాతం వరకు పెరిగాయి.

25 మంది Bangladeshisను పంపించానంటూ పోలీసులకు సవాల్!
Crime· 8 Aug 2026

25 మంది Bangladeshisను పంపించానంటూ పోలీసులకు సవాల్!

బెంగళూరుకు 25 మంది బంగ్లాదేశీయులను పంపించానని, వారిని పోలీసులు పట్టుకోలేరంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన వీడియో కలకలం రేపింది. వారు పోలీసులు, రాజకీయ నాయకుల ఇంటికి వచ్చి వారి ఫ్యామిలీకి హాని చేస్తారని బెదిరించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేస్ బుక్ చేసి దర్యాప్తు చేసారు. ఆ వ్యక్తి మండ్య జిల్లా కృష్ణరాజపేట చెందిన సంతోష్ కుమార్‌గా గుర్తించారు. దుబాయ్‌లో హోటల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తరువాత వీడియోను డిలీట్ చేసి, పోలీసులకు సారీ చెబుతూ మరో వీడియోను పోస్ట్ చేశాడు.

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
TG· 8 Aug 2026

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని నేషనల్ హైవేపై RTC ఎలక్ట్రిక్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, RTC అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా, ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Art + Fashion
Infotainment· 8 Aug 2026

Art + Fashion

ఫ్యాషన్ ప్రపంచంలో కళ (Art) సరికొత్తగా మారుతుంది. డిజైనర్లు, లగ్జరీ బ్రాండ్ల పెయింటింగ్స్, శిల్పకళను డ్రెస్సులు, యాక్సెసరీలలో కలిపి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. డాలీ ఆర్ట్‌ను పోలిన పెదవుల బ్రోచ్, తరుణ్ తహిలియాని 'పిచ్వాయ్ ఆర్ట్' జంప్‌సూట్, అనామికా ఖన్నా 'పటాచిత్ర' కోట్లతో పాటు డోల్చే అండ్ గబ్బానా టీషర్ట్‌లు డిజైనర్ వేర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లూయిస్ విటన్ బ్యాగులు, వెరైటీ డిజైన్ వాచీలు, సన్‌గ్లాసెస్ వింటేజ్ అండ్ మోడ్రన్ లుక్ ఇస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.