← Back to news

🧘 సైనస్‌కు యోగా.. డాక్టర్ల సూచన!

By BK· 9 Aug 2026
🧘 సైనస్‌కు యోగా.. డాక్టర్ల సూచన!

సైనస్ సమస్యతో ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖంలో ఒత్తిడి వంటి ఇబ్బందులు ఉంటే యోగా కొంత ఉపశమనం ఇవ్వొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధోముఖ శ్వానాసనం, భుజంగాసనం, సేతు బంధాసనం, ఉత్తానాసనం వంటి ఆసనాలు ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. జల నేతి కూడా ముక్కు మార్గాలను శుభ్రం చేయడంలో సహాయపడొచ్చని అంటున్నారు. అయితే సరైన పద్ధతిలోనే చేయాలని తెలిపారు.

More in Health