Latest

ఆరు దాటాక బయటకు రావాలంటే హడల్
AP: శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస టిడ్కో కాలనీలో ఆరుగురు యువకుల వల్ల సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కాలనీవాసులు హడలిపోతున్నారు. ఈ నెల 2న రోడ్డుపై పిల్లలు ఆడుతుండగా కొందరు యువకులు బైక్‌ల మీద వేగంగా వచ్చారు. శెట్టి చిన్నారావు వాళ్లని నిలదీయడంతో ఆయన్ని కొట్టారు. బైక్‌లపై వచ్చేవాళ్లని ఎవరైనా ఆపితే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో జనాలు హడలిపోతున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో కుదుపులు.. 12 మంది!
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపుల(టర్బులెన్స్)ను ఎదుర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు క్యాబిన్ స్టాఫ్ తో పాటు 12 మంది గాయపడ్డారు. ఫ్లైట్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానం దిల్లీ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే ఎయిర్ పోర్టులోని హెల్త్ సెంటర్‌కు పంపినట్లు తెలిపింది. ప్యాసెంజర్, స్టాఫ్ సేఫ్టీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొన్న సంస్థ, ఘటనపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
మూవీ డేట్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్!
'కొరియన్ కనకరాజు' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ మరియు కమెడియన్ కలిసి ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో 'కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7న వస్తున్నాడు' అనే ఒక్క డైలాగ్‌నే యాంగ్రీ, శాడ్, డిస్గస్టింగ్, హ్యాపీ, ఫ్లర్టీ వంటి డిఫరెంట్ ఎమోషన్స్‌లో వీళ్లు చెప్పారు. ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలోకి రాబోతుండగా, ఈ వినూత్న ప్రమోషనల్ వీడియోలో నటీనటులు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఆడియన్స్‌కు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

వివాదంలో రణబీర్-సాయిపల్లవిల ‘రామాయణ’
రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీని ఎదుర్కొంటోంది. సినిమాలో కొన్ని డైలాగులు, సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నట్లు ఢిల్లీలోని శ్రీరామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్రబృందానికి లెటర్ రాశారు. విడుదల కంటే ముందే స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అబ్జెక్షన్ ఉన్న సీన్స్‌ను తొలగించకపోతే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నది దాటుతూ స్కూల్‌కు.. సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో స్కూల్‌కు వెళ్లేందుకు పిల్లలు బేత్వా నదిపై డ్యామ్‌ను దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ ఈ దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విచారణలో ఈ వీడియో విదిశా జిల్లా పలోహ్ గ్రామంలోనిదిగా అధికారులు గుర్తించారు. పలోహ్హై స్కూల్‌కు వెళ్లేందుకు ఈ దారిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు అందించడంతో పాటు వంతెన నిర్మిస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.
నందిగామలో పసుపు రంగు కప్పల కలకలం!
ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా నందిగామలో వర్షాల కారణంగా వింత సంఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పసుపు రంగు కప్పలు గుంపులుగా బయటకు రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇవి 'ఇండియన్ బుల్‌ఫ్రాగ్' జాతికి చెందిన మగ కప్పలని, మేటింగ్ సీజన్ (సంభోగ కాలం) లో ఆడ కప్పలను అట్రాక్ట్ చేసేందుకే ఇలా బ్రైట్ ఎల్లో కలర్‌లోకి మారతాయి. మీకు ఈ ఇండియన్ బుల్‌ఫ్రాగ్ గురుంచి తెలిస్తే కామెంట్ చేయండి.

బూడిదవుతున్న వాషింగ్టన్!
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రాన్ని దారుణమైన కార్చిచ్చు ముంచెత్తింది. ఏకంగా 16 ప్రాంతాల్లో మంటలు తీవ్రరూపం దాల్చడంతో వందలాది భవనాలు కాలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు, మరో 60 వేల మందిని సేఫ్ గా ఉండే షెల్టర్లకు తరలించారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను కంట్రోల్ చేయడం రెస్క్యూ టీమ్‌లకు సవాలుగా మారింది. సేఫ్టీ కారణాల వల్ల డ్రోన్లు ఎగరేయడాన్ని అధికారులు ఆపేశారు.

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధికి బెయిల్!
CM విజయ్, నటి త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన తరువాత అయన మద్రాస్ కోర్టుకు వెళ్లారు. అదే రోజు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఉదయనిధికి తాత్కాలిక రిలీఫ్ దక్కింది.

యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన ఇన్స్టాగ్రామ్..
భారతీయులు రోజుకు సగటున గంటా 39 నిమిషాలు ఇన్స్టాగ్రామ్‌లోనే గడుపుతున్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ సర్వే తెలిపింది. నెలకు సగటున వినియోగించే యాప్స్ లో 'ఇన్స్టాగ్రామ్' 49 గంటల 42 నిమిషాలతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 'యూట్యూబ్' 47 గంటల 23 నిమిషాలు, 'ఫ్రీఫైర్ గేమ్' 41 గంటల 12 నిమిషాలు, 'ఫేస్‌బుక్' 24 గంటల 45 నిమిషాలు, 'జియో హాట్‌స్టార్' 22 గంటల 13 నిమిషాలతో తదపరి స్థానాల్లో నిలిచాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్‌కే భారతీయులు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.

భారీ వర్షాలు.. వాగుల వద్ద హైఅలర్ట్
TG: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లింగంపేట, మేంగారం, ఐలాపూర్, మోతే గ్రామాల చెరువులు నిండగా, తిమ్మారెడ్డి కల్యాణి ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు అలుగు పారుతున్నాయి. లింగంపేట వద్ద పాములవాగు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కామారెడ్డి–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు.

ప్రోటోకాల్ పాటించలేదని MLA వాకౌట్
AP: NTR జిల్లా ఎ.కొండూరు మండలం అట్లప్రగడలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కార్యక్రమానికి హాజరైన MLA కొలికపూడి శ్రీనివాసరావు, MROతో పాటు సంబంధిత అధికారులు గైర్హాజరైన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ మాత్రమే హాజరుకావడంతో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అనంతరం సంబంధిత అధికారులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ MLA అక్కడి నుంచి వెళ్లిపోయారు.
FACT or FAKE..పోలీసులపై కన్వరియాల దాడి?
యూపీలో కన్వర్ యాత్ర సమయంలో కన్వరియాలు పోలీసుల బట్టలు చించి కర్రలతో కొట్టారనే వార్త వైరల్ అవుతోంది. దిల్లీ-దెహ్రాడూన్ హైవేపై దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే దీనిపై మీరట్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది రెండు కన్వరియా గ్రూపుల మధ్య ఘర్షణ అని తేల్చారు. వీడియోలో కనిపించేవారు పోలీసులు కాదని, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశామని చెప్పారు. కాబట్టి ఈ వార్త FAKE.

దేశం ఖర్చులో 43% Gen Z చేతుల్లో.. ఇంత పవర్ ఉందా? 😳
Gen Z అంటే రీల్స్, మీమ్స్ మాత్రమే అనుకుంటున్నారా..? వాళ్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న స్పెండింగ్ ఏకంగా $860B (₹72 లక్షల కోట్లు)!👀 ఇండియాలో దాదాపు 37.7 కోట్ల Gen Z ఉన్నారని <a href="https://www.bcg.com/publications/2024/india-the-2-trillion-opportunity-how-gen-z-is-shaping-the-new-india?linkId=629656651&utm_source=chatgpt.com">BCG </a>రిపోర్ట్ చెబుతోంది. వీళ్లు దేశంలోని కన్జ్యూమర్ స్పెండింగ్‌లో దాదాపు 43% అంటే $860 బిలియన్ విలువైన కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నారట. ఇందులో $200 బిలియన్ డైరెక్ట్‌గా వాళ్లు ఖర్చు చేస్తుండగా, మరో $660 బిలియన్ ఫ్యామిలీ కొనుగోళ్లపై వాళ్ల ఇన్‌ఫ్లుయెన్స్‌తో జరుగుతోంది. 2035 నాటికి ఈ స్పెండింగ్ పవర్ $2 ట్రిలియన్‌కు చేరొచ్చని అంచనా.
2 లక్షల పిటిషన్లతో మోదీ ఇంటికి వెళ్తాం: అరవింద్ కేజ్రీవాల్
ట్రంప్ ఒత్తిడితో అమెరికా నుంచి భారీగా ఇథనాల్ కొంటున్నారని ప్రధాని మోదీపై AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ డెసిషన్‌తో సామాన్యుల వాహనాలు డ్యామేజ్ అయ్యాయని ఆయన 'X' పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2 లక్షలకు పైగా పిటిషన్లతో ప్రధాని ఇంటికి వెళ్తున్నామని తెలిపారు. ఇథనాల్ (E20) కారణంగా తమ వెహికల్స్ దెబ్బతిన్నాయని చెప్పే 100 మంది మాతో ఉన్నారని అన్నారు. ప్రజల గొంతును ప్రధాని తప్పకుండా వింటారని ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

ఫ్రిజ్ పైన వస్తువులు పెడుతున్నారా?
చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ఫ్రిజ్ పైన రకరకాల వస్తువులను ఉంచుతుంటారు. అలా పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫినాయిల్స్, యాసిడ్లు, బ్లీచింగ్ ప్రొడక్ట్స్ వంటి రసాయనాలు ఫ్రిజ్‌పై పెడితే అవి లీకై అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదముంది. వంటనూనెలు, పండ్లు ఉంచితే ఫ్రిజ్ వేడికి వాటి రుచి, వాసన పాడవుతాయి. వీటితో పాటు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, పేపర్లు, బరువైన సామాగ్రిని అసలు పెట్టకూడదు. అందుకే ఫ్రిజ్ పైభాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచడమే సురక్షితం.

మృతదేహం కోసం అంబులెన్స్ సిబ్బంది గొడవ
TG: మంచిర్యాలలో మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమైంది. మృతుడు నాగభూషణం కుటుంబసభ్యులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తమకు తెలిసిన అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా, ఆస్పత్రి వద్ద ఉన్న మరో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మా అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలని తిరిగి ఆస్పత్రికి రప్పించి వాగ్వాదానికి దిగారని తెలిపారు. విషాద సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాణాలను పణంగా పెట్టి చదువులు
TG: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య తరగతులకు హాజరవుతున్నారు. సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం భారీ వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారింది. గోడలు తడిసి పగుళ్లు ఏర్పడగా, తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. 143 మంది విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త పాఠశాల భవనం నిర్మించాలని, అప్పటి వరకు విద్యార్థులను సురక్షితమైన భవనానికి తరలించాలని కోరారు.

శ్రీశైలం ప్రాజెక్టులోకి 100 టీఎంసీలు
AP: ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది ప్రవాహం భారీగా వస్తోంది. ఉదయం జలాశయం నీటిమట్టం 858.70 అడుగులుగా, నీటి నిల్వ 101.9210 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,53,543 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 924 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటక నుంచి దిగువకు నీటి విడుదల పెరుగుతుండటంతో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ABHA నంబర్.. అంటే ఏంటో తెలుసా?
దేశంలోని ప్రతి ఇండియన్‌కు అందుబాటులో ఉన్న 14 డిజిట్స్ స్పెషల్ డిజిటల్ హెల్త్ ఐడీనే ABHA నంబర్. ఈ నంబర్ ద్వారా హెల్త్ రికార్డ్స్, ప్రిస్కిప్షన్లు, టెస్ట్ రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీలు సింగిల్ ప్లాట్‌ఫారమ్‌లో సేవ్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో పేపర్‌వర్క్ తగ్గడంతో పాటు, పేషెంట్ అనుమతితో హెల్త్ రికార్డ్స్‌ను షేర్ చేయవచ్చు. వేర్వేరు హాస్పిటల్లో హెల్త్ ట్రీట్‌మెంట్ కొనసాగడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ABHA నంబర్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా <a href="https://abha.abdm.gov.in/abha/v3/register">క్రియేట్ చేసుకోవచ్చు.</a> ఇండియాలో అందరు ఈ సర్వీస్‌ను యూజ్ చేసుకోవచ్చు.
నేను ఫుల్ నాన్-వెజిటేరియన్- CM రేవంత్ రెడ్డి
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్‌లో ఫన్నీ కామెంట్స్ చేశారు. పక్కనే ఉన్న ఆఫీసర్ రామకృష్ణారావు ప్యూర్ వెజిటేరియన్ కాగా, CM రేవంత్ మాత్రం తాను ఫుల్ నాన్-వెజిటేరియన్ అంటూ సరదాగా చెప్పారు. వారంలో 7 రోజులు, రోజుకి 24 గంటలు నాన్-వెజ్ మాత్రమే తింటానని నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌తో ప్రెస్ మీట్‌లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.
ఉప్పొంగిన వాగు.. రాకపోకలు బంద్
TG: కురిసిన భారీ వర్షాలతో యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు బ్రిడ్జిపైకి చేరడంతో సంగెం–భువనగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఎవరూ వరద నీటిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.