మృతదేహం కోసం అంబులెన్స్ సిబ్బంది గొడవ

TG: మంచిర్యాలలో మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమైంది. మృతుడు నాగభూషణం కుటుంబసభ్యులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తమకు తెలిసిన అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా, ఆస్పత్రి వద్ద ఉన్న మరో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మా అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలని తిరిగి ఆస్పత్రికి రప్పించి వాగ్వాదానికి దిగారని తెలిపారు. విషాద సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.



