Latest

‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రూ.25 వేలు: పవన్ కళ్యాణ్
Politics· 7 Aug 2026

‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రూ.25 వేలు: పవన్ కళ్యాణ్

AP: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ చేనేత వారసత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. చేనేత వస్త్రాల్లో మన సంస్కృతి, కళానైపుణ్యం స్ఫూర్తి ప్రతిబింబిస్తాయని అన్నారు. తాను చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. వీవర్స్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌ను ఏర్పాటు చేసి చేనేత రంగం అభివృద్ధి, రక్షణకు కృషి చేస్తామన్నారు. NDA ప్రభుత్వం నేతన్నలకు ఫ్రీ పవర్, ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రూ.25 వేల సాయం వంటివి అమలు చేస్తోందని పవన్‌ కల్యాణ్‌ 'ఎక్స్' అన్నారు.

పట్టుదలకు హాట్సాఫ్ : సొనాక్షి, రూఫాలీ గంగూలీ స్పందన!
News· 7 Aug 2026

పట్టుదలకు హాట్సాఫ్ : సొనాక్షి, రూఫాలీ గంగూలీ స్పందన!

జార్ఖండ్‌లో JPSC, JSSC CGL పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై బాలీవుడ్ నటి సొనాక్షి సిన్హా స్పందించారు. మన దేశంలో విద్యార్థులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని, ఇవి ఎప్పటికి ముగుస్తాయంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థుల పట్టుదలను గౌరవించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని నటి రూఫాలీ గంగూలీ కూడా డిమాండ్ చేశారు.

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపాలి
Crime· 7 Aug 2026

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపాలి

TG: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన రాజేశ్వరరావును యాక్సిడెంట్ చేసి చంపాలని భార్య భవాని తన ప్రియుడు సైదులుకు మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్తకు అనుమానం రావడంతో ఆమె ఫోన్ పరిశీలించగా షాకింగ్ చాటింగ్ బయటపడింది. ఇంట్లో కాకుండా బయట ప్రమాదంగా చూపించి హత్య చేయాలని ఆమె సూచించినట్లు బాధితుడు రాజేశ్వరరావు ఆరోపించారు. చాటింగ్ ఆధారాలను పోలీసులకు అందించి భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

HYDRAAలో 150 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ రిలీజ్
Jobs· 7 Aug 2026

HYDRAAలో 150 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ రిలీజ్

TG: HYDRAA పరిధిలోని DRFలో 150 కాంట్రాక్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో DRF అసిస్టెంట్‌కు 100, హెవీ వెహికల్‌ డ్రైవర్‌కు 50 పోస్టులున్నాయి. 10th క్లాస్ పాసై, 35 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రైటెన్ టెస్ట్ లేకుండా ఫిజికల్‌ ఈవెంట్స్‌తో సెలెక్ట్ చేస్తారు. ఆగస్ట్ 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు సరూర్‌నగర్‌ స్టేడియంలో సెలెక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. కాండిడేట్లు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్‌, ఫొటోలతో హాజరుకావాలి. డ్రైవర్‌ పోస్టులకు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాండేటరీ.

చేనేత కార్మికులే సూపర్‌హీరోలు : ఆదా శర్మ
Infotainment· 7 Aug 2026

చేనేత కార్మికులే సూపర్‌హీరోలు : ఆదా శర్మ

చేనేత దుస్తులు వేసుకున్నప్పుడు సాధారణ బట్టలు కాకుండా ఒక గొప్ప కథను ధరించినట్లు అనిపిస్తుందని నటి ఆదా శర్మ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె, ఒక నేత కార్మికుల కేంద్రాన్ని విజిట్ చేసి అక్కడ స్టాంపింగ్, ప్రింటింగ్ ప్రాసెస్ ను ట్రై చేశారు. చేనేత వస్త్రాల తయారీ వెనుక ఎంతో శ్రమ, నైపుణ్యం దాగి ఉన్నాయని, చేనేత కళాకారులే అసలైన సూపర్‌హీరోలని ఆమె అన్నారు. షూటింగ్ పూర్తయ్యాక హుస్సేన్ సాగర్ ఒడ్డున సమయం గడపడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

గ్యాస్ కనెక్షన్ అంటూ నమ్మించి.. డబ్బులతో పరార్
Crime· 7 Aug 2026

గ్యాస్ కనెక్షన్ అంటూ నమ్మించి.. డబ్బులతో పరార్

TG: యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(M) మండలం కొరటికల్‌లో గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ కేటుగాడు మహిళను మోసం చేసి రూ.4,500 కాజేశాడు. మెడలో ఐడీ కార్డు ధరించి గ్యాస్ సంస్థ ప్రతినిధినంటూ ఇంటింటికీ తిరిగిన వ్యక్తి.. ప్రభుత్వ ప్రత్యేక పథకంలో గ్యాస్ కనెక్షన్ మంజూరైందని రాములమ్మను నమ్మించాడు. రూ.4,500 చెల్లిస్తే అదేరోజు కనెక్షన్ ఇస్తానని చెప్పడంతో ఆమె డబ్బులు ఇచ్చింది. అనంతరం ఫోన్ నంబర్ స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రైతు బావిలో కదులుతున్న నీరు.. వింతగా చూస్తున్న జనం!
Viral· 7 Aug 2026

రైతు బావిలో కదులుతున్న నీరు.. వింతగా చూస్తున్న జనం!

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా విర్‌పర్దా గ్రామంలోని ఓ బావిలో నీరు దానికదే కదలడం కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీటిలో కదలికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం కూడా ఇలాగే జరగగా.. గురువారం మధ్యాహ్నానికి కదలికలు ఆగిపోయి, ఆ తర్వాత మళ్లీ కదలికలు వచ్చాయి. దీంతో గ్రామస్థులు బావి వద్దకు చేరుకుని వింతను చూస్తున్నారు. గతంలో భూకంపాలు నమోదైన ప్రాంతం కావడంతో.. దీనికి అదే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు GWRI ఎక్స్పర్ట్స్‌ను విచారణకు ఆదేశించింది.

'బ్లూ జోన్'
World· 7 Aug 2026

'బ్లూ జోన్'

ప్రపంచంలో ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించే ప్రజలు ఉండే ప్రాంతాలను 'బ్లూ జోన్లు' అని పిలుస్తారు. జపాన్‌లోని 'ఒకినావా' దీవిలో ఉండే 'ఓగిమి' గ్రామం బ్లూ జోన్లలో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రజలు 100 ఏళ్లు దాటినా హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు. వీరు పొలాల్లో సొంతంగా పండించుకునే తాజా కూరగాయలు, పండ్లు తింటారు. (హరా హాచి బు) 80 శాతం మాత్రమే తినడం, రోజు ఎక్సర్‌సైజ్ చేయడం, మైండ్‌లో ఒత్తిడి లేకుండా పీస్‌ఫుల్‌గా ఉండటం, ప్రతీరోజూ 'ఇకిగై' అంటే ఒక మంచి ఆశయం లేదా లక్ష్యం ఉండడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

కర్నూలులో TDP కార్యకర్త దారుణ హత్య
Crime· 7 Aug 2026

కర్నూలులో TDP కార్యకర్త దారుణ హత్య

AP: కర్నూలులో TDP కార్యకర్త ఇంతియాజ్ దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవపడ్డారు. పక్కనే ఉన్న వక్తి ఇంతియాజ్‌పై రాయితో దాడి చేయగా అక్కడిక్కడే చనిపోయాడు. గత ఎన్నికల్లో ఇంతియాజ్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. తరువాత TDPలో చేరి పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. భూ వివాదాల కారణాలతో హత్య జరిగి ఉండొచ్చన్న పర్‌స్పెక్టివ్‌లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతియాజ్ హత్యను మంత్రి టీజీ భరత్ ఖండించారు.

అర్ధరాత్రి హాస్టల్‌లోకి యువకుడు
TG· 7 Aug 2026

అర్ధరాత్రి హాస్టల్‌లోకి యువకుడు

TG: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని KGBV హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడటం కలకలం రేపింది. సిబ్బంది కంటపడకుండా సుమారు రెండుగంటల పాటు హాస్టల్ ఆవరణలో అనుమానాస్పదంగా తిరిగాడు. యువకుడిని గమనించిన విద్యార్థినులు, సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో అతడు గోడ దూకి పరారయ్యాడు. ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో భద్రతా లోపాలపై ప్రశ్నించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో అస్సాం రెస్టారెంట్
Infotainment· 7 Aug 2026

హైదరాబాద్‌లో అస్సాం రెస్టారెంట్

హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అస్సామీ వంటకాల రుచులను అందించడానికి 'ఆఖోల్' అనే 90 సీట్ల కొత్త రెస్టారెంట్ మొదలైంది.. అస్సామీ భాషలో 'ఆఖోల్' అంటే వంటగది అని అర్థం. అస్సాం పల్లెటూరి వాతావరణం గుర్తుకొచ్చేలా, వెదురు, బెత్తం వస్తువులతో ఈ రెస్టారెంట్ ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. అస్సామీ స్టైల్ వెజ్, నాన్-వెజ్ థాళీలతో పాటు ఖార్, తిల్ చికెన్, మటన్ కర్రీ, ఫిష్ తెంగా లాంటి వాళ్ల సాంప్రదాయ రుచులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఇద్దరు కలిసి భోజనం చేయడానికి రూ. 1,500 వరకు ఖర్చవుతుంది.

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్
Crime· 7 Aug 2026

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్

TG: బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి యువకుడు(19) మృతి చెందాడు. శివాలయం వద్ద ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఇనుప పైప్ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో మల్పర్తి హర్షవర్ధన్‌కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Healthy Habits
Health· 7 Aug 2026

Healthy Habits

మనం చేసుకునే చిన్న మంచి అలవాట్లే ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఉదయాన్నే కాఫీకి ముందు నీళ్లు తాగడం, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం, ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. రాత్రి 11 గంటల లోపే పడుకోవడం, రోజూ 5 నిమిషాలు స్ట్రెచింగ్, 15 నిమిషాలు ఎండలో ఉండడం వల్ల బాడీ ఆక్టివ్ గా ఉంటుంది. వారానికి 3 సార్లు వెయిట్ లిఫ్టింగ్, రోజూ పండ్లు తినడం, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం, రోజుకు 10 పేజీలు బుక్స్ చదవడం లాంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయని అంటున్నారు.

ఆధార్‌ వెరిఫికేషన్‌ అంటూ వచ్చి హత్య చేశారు
Crime· 7 Aug 2026

ఆధార్‌ వెరిఫికేషన్‌ అంటూ వచ్చి హత్య చేశారు

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులోని దామచర్లపాలెంలో దారుణ ఘటన జరిగింది. వృద్ధ దంపతుల ఇంట్లోకి ఆధార్‌ కార్డు వెరిఫికేషన్‌ పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్య అరుణను గొంతుకోసి చంపేసి పారిపోయారు. స్థానికులు గాయాలైన బాలగురవయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు, డీఎస్పీ క్రిష్ణ చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

కోహ్లీని దాటేసిన షారుఖ్ ఖాన్
Infotainment· 7 Aug 2026

కోహ్లీని దాటేసిన షారుఖ్ ఖాన్

'క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025' రిపోర్ట్ ప్రకారం, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ $177.9 మిలియన్ల బ్రాండ్ వాల్యూతో టాప్‌లో నిలిచారు. ఈ లిస్ట్‌లో రణ్‌వీర్ సింగ్ ($162.9 మిలియన్లు) రెండో స్థానాన్ని, కోహ్లీ ($158.4 మిలియన్లు) మూడో స్థానంలో నిలిచారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. AI టెక్నాలజీ వల్ల బ్రాండ్లు, సెలబ్రిటీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే వాళ్ల బ్రాండ్ వ్యాల్యూలు ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ప్రకటించిన CJP
Politics· 7 Aug 2026

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ప్రకటించిన CJP

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిన్న తన తొలి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లిస్టును ప్రకటించింది. పార్టీ బలోపేతం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. 'ఎక్స్‌'లో చేసిన పోస్టులో తమ యాక్షన్ ప్లాన్ అమలుకు నేషనల్ కమిటీ తొలి లీడర్‌షిప్ లిస్టును అప్రూవ్ చేసింది. పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నేషనల్ కన్వీనర్‌గా ఉండగా, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కో-కన్వీనర్లుగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్స్ వయసులను కూడా పార్టీ ప్రత్యేకంగా వెల్లడించడం విశేషంగా నిలిచింది.

ఆరోగ్యం మీ చేతుల్లో..
Health· 7 Aug 2026

ఆరోగ్యం మీ చేతుల్లో..

నరాల బలానికి, శరీరంలో శక్తి పెరగడానికి ఉపయోగపడే మెగ్నీషియం కోసం డార్క్ చాక్లెట్, ధాన్యాలు, అరటిపండు, పాలకూర, బాదం తీసుకోవాలి. మనకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు రాకుండా ఉండాలంటే జింక్ చాలా అవసరం. దీని కోసం రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలు, జీడిపప్పు, శనగలు, పాలు, గుడ్లు తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి, థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడే సెలీనియం కావాలంటే చేపలు, బ్రెజిల్ నట్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు, బ్రౌన్ రైస్‌ను డైట్‌లో తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం
Crime· 7 Aug 2026

మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం

AP: ఈడీ అధికారులం, మేము ఢిల్లీ పోలీసులం అంటూ సైబర్‌నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు అలవేలు మంగమ్మను మోసం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని, ఆస్తులు సీజ్ చేస్తామని బెదిరించి వీడియో కాల్స్‌తో నమ్మించారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బు చెల్లించాలని చెప్పడంతో ఆమె రూ.1.43 కోట్లు RTGS ద్వారా వారి ఖాతాలకు బదిలీ చేశారు. మరో రూ.95 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పింది. అతడి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించింది.

CJP నేషనల్ కమిటీలో హైదరాబాద్ యువకుడికి కీలక బాధ్యతలు
Politics· 7 Aug 2026

CJP నేషనల్ కమిటీలో హైదరాబాద్ యువకుడికి కీలక బాధ్యతలు

TG: హైదరాబాద్‌కు చెందిన యంగ్ సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌రెడ్డి మల్లంగి CJP నేషనల్ మీడియా కోఆర్డినేటర్‌గా, సౌత్ స్టేట్స్ ఇన్‌చార్జిగా ఎంపికయ్యారు. CJP తొలి నేషనల్ లీడర్‌షిప్ టీమ్‌లో తెలుగు యువకుడికి చోటు దక్కడం విశేషం. అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ వదిలి సోషల్ సర్వీస్‌లోకి వచ్చిన విజయ్‌రెడ్డి, 'Save KBR', 'కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ' వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చేసిన నిరసన కార్యక్రమాల్లో కోఆర్డినేటర్‌గా చేసిన ఆయన సేవలను గుర్తించి సీజేపీ ఈ బాధ్యతలు అప్పగించింది.

YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్‌.. జైలుకు తరలింపు
Politics· 7 Aug 2026

YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్‌.. జైలుకు తరలింపు

AP: కిడ్నాప్‌, SC, ST అట్రాసిటీ కేసులో YSRCP మాజీ MLA ముస్తఫాకు నూజివీడు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్‌ విధించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోయిలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్‌ కేసులో ముస్తఫా, ఆయన కొడుకు బషీర్‌ నిందితులుగా ఉన్నారు. అబ్స్కాండింగ్‌లో ఉన్న ముస్తఫాను పోలీసులు గుజరాత్‌లో అదుపులోకి తీసుకుని, మిడ్‌నైట్ మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్‌కు ఆదేశించింది. తరువాత ఆయనను, బషీర్‌ను నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.

గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్
Politics· 7 Aug 2026

గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్

TG: కొమురంభీమ్ జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పందించారు. డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో పేరుతో హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట చేపట్టిన నిరసనలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆసిఫాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పార్టీపై అసంతృప్తులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని, బహిరంగ నిరసనలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.