← Back to news

ఆరు దాటాక బయటకు రావాలంటే హడల్

By విశీ· 4 Aug 2026
ఆరు దాటాక బయటకు రావాలంటే హడల్

AP: శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస టిడ్కో కాలనీలో ఆరుగురు యువకుల వల్ల సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కాలనీవాసులు హడలిపోతున్నారు. ఈ నెల 2న రోడ్డుపై పిల్లలు ఆడుతుండగా కొందరు యువకులు బైక్‌ల మీద వేగంగా వచ్చారు. శెట్టి చిన్నారావు వాళ్లని నిలదీయడంతో ఆయన్ని కొట్టారు. బైక్‌లపై వచ్చేవాళ్లని ఎవరైనా ఆపితే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో జనాలు హడలిపోతున్నారు.

More in AP