Latest

చైనా కంటే ఎంతో ముందంజ!
Sports· 6 Aug 2026

చైనా కంటే ఎంతో ముందంజ!

ప్రపంచంలోనే అత్యధిక చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. 2026 ఎఫ్‌ఐడీఈ (FIDE) డేటా ప్రకారం.. 85 కంటే ఎక్కువ గ్రాండ్‌మాస్టర్లతో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో 250 మందికి పైగా గ్రాండ్‌మాస్టర్లతో రష్యా టాప్‌లో ఉండగా.. జర్మనీ (100+), యునైటెడ్ స్టేట్స్ (95+), ఉక్రెయిన్ (90+) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా 40కి పైగా గ్రాండ్‌మాస్టర్లతో 10వ స్థానానికి పరిమితమైంది.

'ది ప్యారడైజ్' టీజర్ చూసేయండి!
Cinema· 6 Aug 2026

'ది ప్యారడైజ్' టీజర్ చూసేయండి!

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది ప్యారడైజ్' టీజర్‌ను రిలీజ్ అయింది. ఇందులో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్‌బాబు, తనికళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

రిజర్వేషన్లు ఉంటే వెనుకబాటుతనం పోయినట్టేనా?
Politics· 6 Aug 2026

రిజర్వేషన్లు ఉంటే వెనుకబాటుతనం పోయినట్టేనా?

రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన STల వెనుకబాటుతనం పోయినట్లు కాదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల <a href="https://x.com/OfficeOfKavitha/status/2085333805381156866?s=20">కవిత</a> అన్నారు. "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ 99% ఎస్టీలు అత్యంత పేదరికంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టి, 1/70 చట్టాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులు, లంబాడీలు, ఎరుకల వెనుకబాటుతనాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని సభలో ప్రతిజ్ఞ చేశారు.

మీకు కూడా Years చాలా Fastగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందా?
Education· 6 Aug 2026

మీకు కూడా Years చాలా Fastగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందా?

చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా లాంగ్‌గా అనిపించేవి.. ఇప్పుడు చూస్తుండగానే మరో సంవత్సరం అయిపోతోంది! 😭 ఎందుకిలా? దీనికి మన బ్రెయిన్‌లోని టైమ్ పర్సెప్షన్ ఒక కారణం. చిన్నప్పుడు కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేసెస్, కొత్త ఎక్స్‌పీరియన్స్‌లు అంటూ చాలా విషయాలు ఫస్ట్ టైమ్ చూస్తాం. దీంతో ఎక్కువ కొత్త మెమరీస్ క్రియేట్ అవుతాయి. పెద్దయ్యాక రోజులు ఎక్కువగా ఒకే రొటీన్‌లో వెళ్లడంతో, వెనక్కి చూసినప్పుడు నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్‌గా గడిచినట్టు అనిపించొచ్చు. టైమ్ అదే.. మన అనుభూతే మారింది! ⏳

టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం!
News· 6 Aug 2026

టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం!

నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న రంజిత్ (8) అనే స్టూడెంట్‌ని గురువారం క్లాస్‌రూమ్‌లో ఉండగానే పాము కాటువేసింది. గమనించిన టీచర్లు వెంటనే అతడిని గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ రంజిత్ చనిపోయాడు. క్లాస్‌రూమ్‌లోనే చిన్నారికి పాము కరవడంతో బాధితుడి ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఊరంతా షాక్‌లో ఉండిపోయింది.

ఇకపై PhonePe, GPay ఉచితం కాదా?
Politics· 6 Aug 2026

ఇకపై PhonePe, GPay ఉచితం కాదా?

గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకర్లకు పర్మిషన్ ఇచ్చే 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007' సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు పాస్ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రతీ చిన్న పేమెంట్‌కి UPI వాడుతున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య యూజర్లపై పెద్ద భారం మోపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం
Crime· 6 Aug 2026

బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాష్ట్రం బెళగావిలో KSRTC బస్సు, మోటార్ సైకిల్ ఢీకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

నా లైఫ్ అంతా వీరికి అంకితం- కల్వకుంట్ల కవిత
Politics· 6 Aug 2026

నా లైఫ్ అంతా వీరికి అంకితం- కల్వకుంట్ల కవిత

"సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అగ్రవర్ణాల్లో పుట్టడం నా చేతుల్లో లేదు, ఎవరి పుట్టుకపైనా వాళ్లకు గర్వం ఉంటుంది.. కానీ ఎవరి కోసం పనిచేయాలో నా చేతుల్లో ఉందని ఆమె అన్నారు. దశాబ్దాలుగా అసెంబ్లీ, పంచాయతీల ముఖం చూడని BC, SC, ST, అణగారిన వర్గాల హక్కుల కోసమే తన ఫైట్ అని చెప్పారు. రాజకీయాధికారం లేని ఈ కమ్యూనిటీస్ అందరికీ కంప్లీట్ సోషల్ జస్టిస్ దక్కేంత వరకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని కవిత అనౌన్స్ చేశారు.

బిగ్ స్క్రీన్ కల: నటుడు భాను స్టేజ్‌పై అలా ఎందుకు చేశాడు?
Cinema· 6 Aug 2026

బిగ్ స్క్రీన్ కల: నటుడు భాను స్టేజ్‌పై అలా ఎందుకు చేశాడు?

తన్ను తాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవడం ఒక కల అని నటుడు భాను ఎమోషనల్ అయ్యారు. బిక్షు డైరక్షన్ లో అన్ను, వాసవి గణేష్ జంటగా నటించిన 'హుషార్ పిట్టలు' మూవీలో ఆయన కీ రోల్ చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుండగా, రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాను మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రావడానికి 8 ఏళ్లు స్ట్రగుల్ అయ్యానని చెప్పారు. ఇది కలనా, నిజమా అంటూ స్టేజ్ మీదే పదే పదే చెంపలు కొట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

యూపీఐ పేమెంట్స్‌ ఛార్జీల వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 6 Aug 2026

యూపీఐ పేమెంట్స్‌ ఛార్జీల వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌ 2007లో మార్పులు చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు విధించే పూర్తి అధికారం బ్యాంకులకు దక్కుతుంది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు, పేమెంట్ సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయడానికి వీల్లేదు. ఈ రూల్ తొలగించేలా కొత్త చట్టం తీసుకొచ్చారు.

‘ఏమైపోతున్నాయి ఆప్యాయతలు?’..కదిలించిన సజ్జనార్ పోస్ట్
Motivational· 6 Aug 2026

‘ఏమైపోతున్నాయి ఆప్యాయతలు?’..కదిలించిన సజ్జనార్ పోస్ట్

హరియాణా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో మరణించారు. కుమార్తెలు కన్నతండ్రి అంత్యక్రియలను రాలేక వీడియో కాల్ ద్వారా చూస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం రూ.5 వేలు పంపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌ ఎంతోమందిని కదిలిస్తోంది.

రైతులకు బిగ్ అప్డేట్!
Politics· 6 Aug 2026

రైతులకు బిగ్ అప్డేట్!

ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఊళ్లలో ఉండే పశువుల పేడ, వ్యవసాయ చెత్త నుంచి బయోగ్యాస్, క్లీన్ ఫ్యూయెల్ మరియు సేంద్రీయ ఎరువులు తయారు చేసే 'గోబర్ధన్' స్కీమ్‌కు రూ.23,731 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం రానుంది. దీంతో పాటు రూ.8,970 కోట్లతో అసోంలో నిర్మించబోయే 4-లేన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్‌కి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!

బస్ స్టాప్ వద్ద ఘోర ప్రమాదం
TG· 6 Aug 2026

బస్ స్టాప్ వద్ద ఘోర ప్రమాదం

TG: హైదరాబాద్ జగద్గిరిగుట్ట PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి బస్ స్టాప్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు!
News· 6 Aug 2026

తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు!

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన IMD.. హైదరాబాద్‌తో పాటు ఆసిఫాబాద్, మెదక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది.

పార్లమెంట్ బయట వర్షంలో రాహుల్, ప్రియాంక!
Politics· 6 Aug 2026

పార్లమెంట్ బయట వర్షంలో రాహుల్, ప్రియాంక!

ఢిల్లీలో వర్షం పడుతున్న టైమ్‌లో పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా కనిపించారు. మీటింగ్స్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు వర్షంలో తడుస్తూ కాసేపు డిస్కస్ చేసుకున్నారు. సెక్యూరిటీ వాళ్లు గొడుగులు పట్టుకోగా, వీరిద్దరూ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ చిట్‌చాట్ చేశారు. ఆ తర్వాత ఇతర లీడర్స్‌తో కలిసి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ముందుకు వెళ్లారు

బ్యాంక్‌లోనే కుప్పకూలిన వ్యక్తి
TG· 6 Aug 2026

బ్యాంక్‌లోనే కుప్పకూలిన వ్యక్తి

TG: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఉన్న SBI బ్యాంకులో జంగాపల్లి గ్రామానికి చెందిన అనుమండ్ల బాలయ్య (55) డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకు వచ్చారు. లావాదేవీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది, స్థానికులు స్పందించి పరిశీలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఆకస్మిక ఘటనతో బ్యాంకులో ఉన్న ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన CJP
India· 6 Aug 2026

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన CJP

CJP(Cockroach Janata Party) తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. సెప్టెంబర్‌లో ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా సమస్యలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఝార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల ర్యాలీకి మద్దతుగా నిలిచేందుకు రాంచీ వెళ్లనున్నట్టు తెలిపారు.

కొడుకు ప్రేమకు విలన్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
News· 6 Aug 2026

కొడుకు ప్రేమకు విలన్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ప్రేమ పెళ్లికి రెడీ అయిన కొడుకు మీద దాడి చేయించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ విషయాన్ని ఆయన కొడుకే మీడియాకు వివరించారు. ‘తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రికి అస్సలు ఇష్టం లేదని, తమని విడదీయడానికే అనుచరులతో కాబోయే భార్య ఇంటిపై అటాక్ చేయించారని’ రాజేంద్రనగర్ కాంగ్రెస్ MLA ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ వివరించారు. తండ్రి నుంచే తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఏ క్షణంలోనైనా తమపై దాడి జరగొచ్చని, తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు.

'మెటా' యూ-టర్న్.. కంగనా ఏమన్నారంటే?
Politics· 6 Aug 2026

'మెటా' యూ-టర్న్.. కంగనా ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్టును తొలగించిన ఘటనపై మెటా క్షమాపణ చెప్పడాన్ని BJP MP కంగనా రనౌత్ స్వాగతించారు. ఈ అంశాన్ని పరిశీలించిన పార్లమెంటరీ కమిటీలో తాను కూడా సభ్యురాలినని తెలిపారు. కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాను క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రోత్సాహం కల్పిస్తున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశామన్నారు. చివరకు మెటా తన తప్పును ఒప్పుకోవడం సంతోషకరమని కంగనా అన్నారు.

వంట మొదలుపెట్టగానే సిలిండర్ బ్లాస్ట్
TG· 6 Aug 2026

వంట మొదలుపెట్టగానే సిలిండర్ బ్లాస్ట్

TG: వనపర్తి జిల్లా పానుగల్ మండలం చిక్కేపల్లి గ్రామంలో సిలిండర్ పేలిన ఘటనలో వార్డు సభ్యురాలు రేణుక తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం వంట చేసేందుకు వంటగదిలోకి వెళ్లి సిలిండర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్ కార్తీక్‌రావు గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.

తమిళనాడు అసెంబ్లీలోకి జపమాల ఎందుకు?
India· 6 Aug 2026

తమిళనాడు అసెంబ్లీలోకి జపమాల ఎందుకు?

తమిళనాడు అసెంబ్లీలోకి ఆర్థికమంత్రి మేరీ విల్సన్ క్రైస్తవ జపమాల తీసుకువరావడంపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గతంలో తిరుపతి ఆలయంలో బడ్జెట్‌ను వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచినప్పుడు మధురై ఎంపీ సు.వెంకటేశన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలోకి జపమాల తీసుకువచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. హిందూ సంప్రదాయాలను లౌకికత్వానికి వ్యతిరేకంగా చూపే తిరుమావళవన్ కూడా ఈ విషయాన్ని సమర్థించారని పేర్కొన్నారు.