యూపీఐ పేమెంట్స్ ఛార్జీల వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మార్పులు చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు విధించే పూర్తి అధికారం బ్యాంకులకు దక్కుతుంది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు, పేమెంట్ సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయడానికి వీల్లేదు. ఈ రూల్ తొలగించేలా కొత్త చట్టం తీసుకొచ్చారు.


