Latest

💊 $400 బిలియన్ ఫార్మా జెయింట్ రాబోతోందా?
రెండు పెద్ద ఫార్మా కంపెనీలు ఒక్కటైతే.. ఏకంగా $400 బిలియన్ జెయింట్! అమెరికాకు చెందిన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా మధ్య ప్రాథమిక మెర్జర్ టాక్స్ జరిగినట్లు రిపోర్ట్స్ రావడంతో మార్కెట్‌లో హీట్ పెరిగింది. ఈ డీల్ జరిగితే ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ కంపెనీల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. వార్త బయటకు రావడంతో బ్రిస్టల్ మైయర్స్ షేర్లు ప్రీ-మార్కెట్‌లో 8% పెరగగా, ఆస్ట్రాజెనెకా షేర్లు దాదాపు 6% పడిపోయాయి. అయితే డీల్ ఇంకా ఫైనల్ కాలేదు.

త్వరలోనే రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష?
నటి త్రిష మరోసారి తమిళనాడు వైరల్ అయ్యారు. మదురైలో కొత్తగా ఏర్పడిన ‘త్రిష వెల్ఫేర్ అసోసియేషన్’ సభ్యులు త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ నగరమంతా పోస్టర్లు అంటించారు. ‘మదురై అనేది ప్రతి రాజకీయ పార్టీ మొదలయ్యే మొదటి నేల’ అని అందులో రాశారు. ‘తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన మొదటి అసోసియేషన్’ తమదే అని అందులో పేర్కొన్నారు. త్రిష సీఎం విజయ్‌తో తరచూ కనిపించడం, ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు రావడం, ఇప్పుడు ఈ పోస్టర్లు..అన్నీ కలిసి త్రిష రాజకీయ ఎంట్రీని సూచిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

భారీ వర్ష సూచన.. ఎంప్లాయీస్‌ను త్వరగా ఇళ్లకు పంపండి!
TG: హైదరాబాద్‌లోని వెస్ట్, నార్త్, సెంట్రల్ ఏరియాల్లో మరో 2 నుంచి 3 గంటల పాటు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించారు. IT కారిడార్‌లో పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ను ఫేజ్‌వైజ్‌గా ఇళ్లకు పంపాలని సైబరాబాద్ పోలీసులు కంపెనీలను కోరారు. వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.

ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండొద్దు: ప్రశాంత్ కిశోర్
బంకీపూర్ బై ఎలక్షన్‌లో విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఇది బీహార్ ప్రజల విజయం అని చెప్పారు. బీజేపీ మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిని సీఎంగా చేయాలి, నేరస్తుడిని కాదనే సంకేతాన్ని ప్రజలు పంపారని అన్నారు. ప్రజలు ఎక్కడికీ వెళ్లవవసరం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, బిహార్ మెరుగుపడాలని అన్నారు. కులమతాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండకూడదని చెప్పారు.

వాకింగ్‌తో బరువు తగ్గడమే కాదు... ఆరోగ్యమూ పక్కా!
రోజుకు కేవలం 30 నుంచి 60 నిమిషాల నడక మన శరీరాన్ని, మనస్సును అద్భుతంగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ వాకింగ్ వల్ల 150 నుంచి 300 కేలరీలు కరిగి పొట్ట కొవ్వు తగ్గుతుంది. దానివల్ల మనం తిన్న తిండి కొవ్వుగా మారకుండా, వెంటనే ఎనర్జీగా మారిపోతుంది. నడక వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగై బ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతో పాటు, శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

BJPకి SHOCK..ప్రశాంత్ కిశోర్ గెలుపు
మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బిహార్ రాష్ట్రంలోని బంకిపూర్ సీటు బీజేపీ చేజారింది. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఇక్కడ విజయం సాధించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత జరిగిన బైఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను ఓడించి ఆయన గెలుపొందారు. ఎన్నికల ప్రచారం నుంచే దూకుడు పెంచిన ప్రశాంత్ కిశోర్ బిహార్ ప్రభుత్వం మార్పు కోరుతోందని, బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.

జీలకర్ర నీటితో ఆరోగ్య ప్రయోజనాలు!
రోజువారీ ఆహారంలో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కడుపు ఉబ్బరం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ నీరు, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రొటెస్ట్‌లో మొదలైన ట్రెండ్.. బాలీవుడ్‌కి చేరింది!
ప్రొటెస్ట్‌లో వైరల్ అయిన ట్రెండ్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా చేసేస్తున్నారు! 😂🎬 సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగీ’ ట్రెండ్‌లో అనుపమ్ ఖేర్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు బొమన్ ఇరానీ, రణవీర్ షోరే, పర్విన్ దబాస్ కలిసి ఫన్నీ రీక్రియేషన్ వీడియో చేశారు. ఖోస్లా కా ఘోస్లా 2 ఆగస్టు 26 రిలీజ్‌కు ముందు వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో నోస్టాల్జియా పెంచుతూ వైరల్ అవుతోంది. ప్రొటెస్ట్ నుంచి మొదలైన ట్రెండ్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ వరకు వచ్చేసింది!

కర్ణాటక Vs తమిళనాడు వాటర్ వార్.. సుప్రీంకోర్టుకు కేసు
కావేరి నదిలో తమకు కేటాయించిన నీటిని విడుదల చేయాలని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు సీఎం విజయ్ ఆదేశాలతో పిటిషన్ ఫైల్ చేసింది. కావేరి జలాల నిర్వహణ అథారిటీ (CWMA), కావేరి జలాల నియంత్రణ కమిటీ (CWRC) ఆర్డర్స్‌ను కర్ణాటక ఇంప్లిమెంట్ చేయడం లేదని ఆరోపించింది. దీంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటర్ సప్లై ఆర్డర్స్‌ను ఇంప్లిమెంట్ చేసేలా కర్ణాటకను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది.
నేను చూపిస్తా.. మోడీ చూపిస్తారా- అభిజిత్ దీప్కే
CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే తన ఎడ్యుకేషన్ లోన్, ఫండింగ్‌పై వస్తున్న విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన ఎడ్యుకేషనల్ లోన్ డాక్యుమెంట్స్, స్కాలర్‌షిప్ లెటర్స్ చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఛాలెంజ్ విసిరారు. నేను నా సర్టిఫికెట్లు చూపించినట్లే, మోడీ కూడా తన డిగ్రీ సర్టిఫికెట్లు బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. Credits: ANI

సకల కళల జేఏసీ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం
TG: తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు గడిచినా తెలంగాణ జానపద అకాడమీ గానీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం గానీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదని సకల కళల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. భావితరాలకు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి తెలంగాణ జానపద అకాడమీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశానికి తప్పక రావాలని సకల కళల జేఏసీ తరఫున భూపతి వెంకటేశ్వర్లు కోరారు.

నితిన్ హీరోగా ‘దండోరా’ దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం
‘దండోరా’ సినిమాతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మురళీకాంత్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. హీరో నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ అనే పేరు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియో నాని వాయిస్ ఓవర్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది.

సాయి పల్లవిని రకుల్ డామినేట్ చేసిందా?
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న‘రామాయణ’ ట్రైలర్ విడుదలైన తర్వాత పాత్రల ప్రెజెంటేషన్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రైలర్‌లో రావణాసురుడిగా నటించిన యష్ రాజసం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, మరోవైపు శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించి సాయి పల్లవి కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బ్యాంకిపూర్ బీజేపీ చేయిజారినట్టేనా?
బిహార్ రాష్ట్రంలోని బ్యాంకిపూర్ సీటు మీద బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ సుమారు 12 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంగా పిలిచేవారు. ఈ నియోజకవర్గంలో 25 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు కాయస్థులున్నారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత నీరజ్ కుమార్ సిన్హాను ఇక్కడ నుంచి పోటీలో నిలబెట్టారు. అటు ప్రశాంత్ కిశోర్‌కీ, ఇటు నీరజ్ కుమార్‌కీ ఇవే తొలి ఎన్నికలు కావడం విశేషం.

బాంకీపూర్ బైపోల్: ప్రశాంత్ కిషోర్‌కు 16,000 ఓట్ల భారీ ఆధిక్య
బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. మొత్తం 31 రౌండ్లలో 26 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై దాదాపు 16,000 ఓట్ల స్పష్టమైన ముందంజలో ఉన్నారు. దీంతో 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యం ప్రమాదంలో పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

పెల్లెట్ గన్స్ వాడకంపై గైడ్‌లైన్స్- సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌లో ఫైల్ అయిన కేసులను ఉపసంహరించుకునే పూర్తి ఫ్రీడమ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మర్డర్, రేప్, టెర్రరిజం లాంటి తీవ్రమైన నేరాలకే 'క్రిమినల్' అనే పదం వర్తిస్తుందని, చిన్న చిన్న కేసులున్న వారిని అలా చూడకూడదని పేర్కొంది. ఇక పెల్లెట్ గన్స్ వాడకంపై కంప్లీట్ గైడ్‌లైన్స్ ఇస్తామని చెబుతూ, తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

పగలు కాలేజ్.. రాత్రి పెట్రోల్ పంప్‌లో Job!
పగలు కాలేజీలో స్టూడెంట్.. రాత్రి పెట్రోల్ పంప్‌లో వర్కర్.. చదువు కోసం ఆమె చేస్తున్న హార్డ్‌వర్క్ ఇప్పుడు వైరల్! ❤️ మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన ఓ కాలేజీ విద్యార్థిని తన చదువు ఖర్చులను తానే చూసుకునేందుకు క్లాసులు పూర్తయ్యాక పెట్రోల్ పంప్‌లో పనిచేస్తోంది. అక్కడికి వచ్చిన ఓ కస్టమర్ ఆమె స్టోరీ తెలుసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. చదువుతో పాటు జాబ్‌ను బ్యాలెన్స్ చేస్తున్న ఆమె డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఖర్చులపైనా చర్చ మొదలైంది.
4.5 KMకి 45 మినిట్స్.. ఇదేం ట్రాఫిక్!
4.5 కిలోమీటర్లే కదా.. త్వరగా వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? బెంగళూరు ట్రాఫిక్‌లో మాత్రం లెక్క వేరే! బెంగళూరులో కేవలం 4.5 కిలోమీటర్లు వెళ్లడానికి 45 నిమిషాలు పట్టిందంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో చూసిన చాలామంది బెంగళూరు ట్రాఫిక్‌లో తమ రోజువారీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేశారు. గూగుల్ మ్యాప్స్ "Almost there" అంటుంది... బెంగళూరు ట్రాఫిక్ మాత్రం “కూర్చో బ్రో, ఇంకా టైమ్ ఉంది” అంటుందేమో!😂

సహజీవనంలో గృహహింస కేసు పెట్టొచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
లైవ్-ఇన్ రిలేషన్‌షిప్(సహజీవనం)లో ఉన్న మహిళలకు కూడా సెక్షన్ 498A (గృహ హింస) రక్షణ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనంలో హరాస్‌మెంట్‌కు గురైన మహిళలు ఈ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటేనే మహిళ నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఫైల్ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

బాంకీపూర్ బైపోల్: 11,500 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్!
బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 11,500 ఓట్ల ముందంజ సాధించారు. 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యానికి ఇది పెద్ద దెబ్బ. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

‘అగధ’ మూవీ ట్రైలర్ : 5 భాషల్లో రిలీజ్!
దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. అతీంద్రియ శక్తులు, మంత్ర తంత్రాలు సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా, ఆగస్టు 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.