Latest

బాంబ్ ఫార్ములా రాస్తూ దొరికిన మెడికల్ స్టూడెంట్
Crime· 3 Aug 2026

బాంబ్ ఫార్ములా రాస్తూ దొరికిన మెడికల్ స్టూడెంట్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలో రాజ్‌శ్రీ దశరథ్ మెడికల్ కాలేజీలో ఫస్టియర్ పారామెడికల్ స్టూడెంట్ బాంబ్ ఫార్ములాను రాస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. నైట్ డ్యూటీ టైమ్‌లో దీన్ని గుర్తించిన కాలేజ్ మేనేజ్‌మెంట్ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో ఆ స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఘటనపై మరింత ఇన్ఫర్మేషన్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్
Crime· 3 Aug 2026

పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్

AP: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద గంజాయి స్మగ్లర్ల గుట్టు ప్రమాదంతో బయటపడింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం రోడ్డు అంచు దాటి గుంతలో బోల్తా పడగా, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పరిశీలించగా, ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో గంజాయి పెట్టెలు కనిపించాయి. తహసీల్దార్ సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 213 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.

RTI కి పవర్‌ఫుల్ కౌంటర్- అభిజీత్ దిప్కే
Politics· 3 Aug 2026

RTI కి పవర్‌ఫుల్ కౌంటర్- అభిజీత్ దిప్కే

తన విద్యార్హతలపై ఓ BJP కార్యకర్త RTI ఫైల్ చేయడంపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే స్పందించారు. బోస్టన్ యూనివర్సిటీలో తాను చదివిన చదువుకు సంబంధించిన స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ లెటర్స్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వీడియోలో తెలిపారు. "నా డాక్యుమెంట్స్ చూపించడానికి నేను రెడీ, మరి మీ BJP లీడర్స్ తన ఒరిజినల్ డిగ్రీ చూపిస్తారా?" అని ప్రశ్నించారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి విదేశాల్లో చదువుకుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఘాటుగా స్పందించారు

చిట్టీలు వేసి.. కోట్లతో ఉడాయించిన దంపతులు
Crime· 3 Aug 2026

చిట్టీలు వేసి.. కోట్లతో ఉడాయించిన దంపతులు

TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చిట్టీల పేరుతో సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన కలకలం రేపింది. BSR కాలనీలో నివసిస్తున్న శిరీష, సాంబశివరావు, స్థానికుల నుంచి చిట్టీల పేరుతో భారీగా డబ్బు సేకరించారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు వారిని సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయంటే?
Business· 3 Aug 2026

ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయంటే?

సోమవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24, 22, మరియు 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై ₹10 చొప్పున రేట్లు పెరిగాయి. ఈ రోజు 1PMకి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,44,220, 22 క్యారెట్ల ధర ₹1,32,200, అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేటు ₹1,08,160 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ చేంజ్ అయ్యే చాన్స్ ఉంటుంది కాబట్టి కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

ఇచ్చాపురాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
AP· 3 Aug 2026

ఇచ్చాపురాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

AP: వర్షాభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడిందని YSR CP సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇచ్చాపురం మండలం టీ. బరంపురం గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వర్షాలు లేక మొలకెత్తిన వరి ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సాగునీటి కొరతతో దమ్ములు చేసి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చాపురాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, అత్యవసర సాగునీటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వ్యూ్స్ కోసం నన్ను మీమ్ చేశారు: శ్రద్ధా సింగ్
Politics· 3 Aug 2026

వ్యూ్స్ కోసం నన్ను మీమ్ చేశారు: శ్రద్ధా సింగ్

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్‌లో RAF సిబ్బందితో కనిపించిన 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధా సింగ్ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెపై భారీగా ట్రోలింగ్, మీమ్స్ వచ్చాయి. అయితే తాను ఎవరినీ తిట్టలేదని, ఎగతాళి చేయలేదని ఆమె చెబుతోంది. వ్యూ్స్ కోసం తన వీడియోను తప్పుగా చూపిస్తూ మీమ్స్ చేశారని అంటోంది. ఒక్క వీడియోతో వైరల్ అయ్యింది... కానీ వచ్చిన ఫేమ్ కంటే ట్రోల్సే ఎక్కువయ్యాయి!

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
News· 3 Aug 2026

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మేనిఫెస్టో హామీని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసీఆర్ హయాంలో ఒకేసారి 48 వేల ఉద్యోగాలు ఇస్తే, ఇప్పుడు కేవలం 7 వేల ఉద్యోగాలే ఇస్తున్నారంటూ ప్రశ్నించిన వారిని సీఎం 'ఎండ్రిన్ తాగి చావండి' అని అనడం దారుణమన్నారు.

నోటిఫికేషన్ మార్చాలంటూ నిరుద్యోగులు మెరుపు ధర్నా
News· 3 Aug 2026

నోటిఫికేషన్ మార్చాలంటూ నిరుద్యోగులు మెరుపు ధర్నా

TG: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేశారు. 7,437 పోస్టులు కాకుండా 19 వేల పోలీస్ జాబ్స్‌కు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేట్ అవ్వడంతో వేలాది మంది ఓవర్‌ఏజ్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు మ్యాక్సిమమ్ ఏజ్ 36 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని కోరారు. అప్లికేషన్ ఫీజ్ తగ్గించాలని, డిమాండ్లు నెరవేరేదాకా ప్రొటెస్ట్ ఆగదని వార్నింగ్ ఇచ్చారు.

రీల్స్ వివాదం.. టీచర్ ఉద్యోగానికి రాజీనామా
Education· 3 Aug 2026

రీల్స్ వివాదం.. టీచర్ ఉద్యోగానికి రాజీనామా

TG: రీల్స్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూక్యా గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో ప్రైవేట్ స్కూల్‌ను ప్రమోట్ చేయడంతో సస్పెండ్ అయిన ఆమెకు ఆరునెలల తర్వాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అయితే DEO నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎప్పుడూ పాఠశాల విధులకు భంగం కలిగించలేదని, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే రీల్స్ చేశానని చెప్పారు. విమర్శలు, అవమానాలు భరించలేక జాబ్‌కు రిజైన్ చేస్తున్నానన్నారు.

📚 ‘నాకు నచ్చిన తెలుగు’: యువ రచయితలకు మంచి అవకాశం!
Infotainment· 3 Aug 2026

📚 ‘నాకు నచ్చిన తెలుగు’: యువ రచయితలకు మంచి అవకాశం!

హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాహితీ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 ఏళ్ల సందర్భంగా 40 ఏండ్లలోపు గల వారి నుంచి ‘నాకు నచ్చిన తెలుగు’ అనే టాపిక్‌పై రచనలను ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా గొప్పతనాన్ని చెబుతూ గానీ, సాహిత్యం గురించి విశ్లేషిస్తూ గానీ పద్యం, గేయం, కవిత రూపంలో 30 లైన్లకు మించకుండా రాసి, ఈ నెల 15వ తేదీలోగా రచనలను sktbn.org@gmail.com కి PDF పంపొచ్చు. ఎంపికైన మంచి రచనలకు బహుమతులు కూడా ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే 9885686415, 9959882963 నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు.

రాష్ట్రంలో రూ.50కే కిలో రైస్ పథకం ప్రారంభం
Politics· 3 Aug 2026

రాష్ట్రంలో రూ.50కే కిలో రైస్ పథకం ప్రారంభం

AP: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. రాష్ట్రంలో 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ APIIC రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. BPT సూపర్ ఫైన్ రైస్ కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50కు అమ్మగా, ఆధార్ అథెంటికేషన్‌తో ఒక్కో వ్యక్తి మ్యాక్సిమమ్ 10 కిలోలు కొనుక్కోవచ్చు.

గేటు పడక.. తాడుతో ట్రాఫిక్ కంట్రోల్
TG· 3 Aug 2026

గేటు పడక.. తాడుతో ట్రాఫిక్ కంట్రోల్

TG: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో JCB ఢీకొనడంతో రైల్వే గేట్ సెన్సార్ బాక్స్ ధ్వంసమై భారీ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రకాశ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలోని గేటును JCB ఢీకొట్టడంతో గేటు పనిచేయలేదు. అదే సమయంలో తిరుపతి–రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రావడంతో గేట్‌ను మూసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో తాడుతో రహదారిని మూసి వాహనాలను నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు, ఘటనపై విచారణ చేపట్టారు.

మూడు రోజులు సెలవులు
Education· 3 Aug 2026

మూడు రోజులు సెలవులు

తెలంగాణలో విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 8 నుంచి 10 వరకు పాఠశాలలు, కళాశాలలకు మూడురోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 8న రెండో శనివారం, 9న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉంటాయి. ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. దీంతో వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. ఇటీవల వర్షాలు, బంద్‌లు, పండుగల కారణంగా ఇప్పటికే పలుమార్లు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే.

TVK విజయం హిస్టారిక్ విక్టరీ: విజయ్ కొడుకు సంజయ్
Politics· 3 Aug 2026

TVK విజయం హిస్టారిక్ విక్టరీ: విజయ్ కొడుకు సంజయ్

CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'బిహైండ్‌వుడ్స్ టీవీ' షోలో, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్‌లో నాన్న పెట్టిన TVK సాధించింది 'హిస్టారిక్ విక్టరీ' అని అన్నారు. ఈ విజయంతో మా ఫ్యామిలీకు మరింత రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్నారు. ప్రజలు మాపై, పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందని జాసన్ సంజయ్ తెలిపారు.

ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో లవ్ లెటర్లు, కత్తి
Crime· 3 Aug 2026

ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో లవ్ లెటర్లు, కత్తి

TG: తోటి మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల <a href="https://www.theclearcutnews.com/n/bgYVUnf">కేసు</a>లో రిమాండ్‌లో ఉన్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో అతని గదిని పోలీసులు సోదా చేయగా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతోపాటు రెండు ప్రేమలేఖలు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. లవ్ లెటర్ల ఆధారంగా మరో <a href="https://www.theclearcutnews.com/n/pjB7k4Q">మహిళతో</a> అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మహిళా ట్రైనీ IPS ఫోన్ లాక్కోవడం, బలవంతంగా గదిలోకి ప్రవేశించిన ఘటనలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు.

భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్
Crime· 3 Aug 2026

భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్

TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఓబులకేశవపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మోకు మహేందర్‌ రెడ్డి తన భార్య మాధవిపై దాడిచేసి, ఆమె కాళ్లు, చేతులు విరిచిన అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకుని పరారయ్యాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపేందుకు ప్రయత్నించి, పిల్లలను కూడా హాని చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసింది. మహేందర్‌రెడ్డి పిల్లలతో కనిపించకపోగా, ఫోన్ స్విఛాఫ్‌లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

న్యూస్ చదువుతూ నిద్రపోయిన యాంకర్.. నెటిజన్ల రియాక్షన్
News· 3 Aug 2026

న్యూస్ చదువుతూ నిద్రపోయిన యాంకర్.. నెటిజన్ల రియాక్షన్

అమెరికాకు చెందిన మార్నింగ్ న్యూస్ FOX ఛానెల్లో యాంకర్ లైవ్ జరుగుతుండగా నిద్రలోకి జారిన వీడియో వైరల్ అవుతుంది. <br>సాధారణంగా లైవ్‌లో ఇలా జరిగితే ట్రోల్స్ వస్తాయి. వీడియో వైరల్ అవ్వగానే ఆమె ఇద్దరు పిల్లల తల్లి కావడం, రోజువారీ తెల్లవారుజామున షిఫ్టులే దీనికి కారణమని నెటిజన్లు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఉరవకొండలో ఉద్రిక్తత.. గుంతకల్‌లో సెక్షన్ 30 అమలు
Politics· 3 Aug 2026

ఉరవకొండలో ఉద్రిక్తత.. గుంతకల్‌లో సెక్షన్ 30 అమలు

AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయ భూముల అంశంపై YSRCP చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మాజీ MP గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు గుంతకల్ సబ్‌డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు చేశారు. ఇదే అంశంపై TDP కూడా పోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇకపై ఆ రోల్స్ చేయను: విజయ్ సేతుపతి
Cinema· 3 Aug 2026

ఇకపై ఆ రోల్స్ చేయను: విజయ్ సేతుపతి

ఇకపై తను గెస్ట్ రోల్స్ చేయనని హీరో విజయ్ సేతుపతి అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ‘జైలర్-2’లో క్యామియోకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మూవీపై తన పోస్టర్ వేసినా ఆడియన్స్ ఆయన్నే చూస్తారని, అదే చిన్న సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తే తన పోస్టర్‌తోనే మార్కెటింగ్ చేస్తారని పేర్కొన్నారు. దీంతో తను హీరోగా చేస్తున్న మూవీస్‌పై ఎఫెక్ట్ పడుతోదన్నారు.

సార్.. మీ హెల్మెట్ ఏది..?
AP· 3 Aug 2026

సార్.. మీ హెల్మెట్ ఏది..?

AP: విశాఖపట్నంలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు పోలీసులను ధైర్యంగా ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీహరిపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సార్.. మీ హెల్మెట్ ఏది అని యువకుడు నిలదీయగా, విధుల్లో ఉన్నామని పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే యువకుడు మాకు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారు.. మీకు రూల్స్ వర్తించవా అని ప్రశ్నించాడు. దీంతో ఓ పోలీస్ తన తప్పును అంగీకరిస్తూ, నువ్వు అడిగింది కరెక్టే.. ఇకపై ఇలా జరగదు అని చెప్పారు.