ఇచ్చాపురాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

AP: వర్షాభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడిందని YSR CP సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇచ్చాపురం మండలం టీ. బరంపురం గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వర్షాలు లేక మొలకెత్తిన వరి ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సాగునీటి కొరతతో దమ్ములు చేసి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చాపురాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, అత్యవసర సాగునీటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



