Latest
రీల్స్ వివాదం.. టీచర్ ఉద్యోగానికి రాజీనామా
TG: రీల్స్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూక్యా గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో ప్రైవేట్ స్కూల్‌ను ప్రమోట్ చేయడంతో సస్పెండ్ అయిన ఆమెకు ఆరునెలల తర్వాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అయితే DEO నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎప్పుడూ పాఠశాల విధులకు భంగం కలిగించలేదని, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే రీల్స్ చేశానని చెప్పారు. విమర్శలు, అవమానాలు భరించలేక జాబ్‌కు రిజైన్ చేస్తున్నానన్నారు.

📚 ‘నాకు నచ్చిన తెలుగు’: యువ రచయితలకు మంచి అవకాశం!
హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాహితీ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 ఏళ్ల సందర్భంగా 40 ఏండ్లలోపు గల వారి నుంచి ‘నాకు నచ్చిన తెలుగు’ అనే టాపిక్‌పై రచనలను ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా గొప్పతనాన్ని చెబుతూ గానీ, సాహిత్యం గురించి విశ్లేషిస్తూ గానీ పద్యం, గేయం, కవిత రూపంలో 30 లైన్లకు మించకుండా రాసి, ఈ నెల 15వ తేదీలోగా రచనలను sktbn.org@gmail.com కి PDF పంపొచ్చు. ఎంపికైన మంచి రచనలకు బహుమతులు కూడా ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే 9885686415, 9959882963 నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు.

రాష్ట్రంలో రూ.50కే కిలో రైస్ పథకం ప్రారంభం
AP: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. రాష్ట్రంలో 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ APIIC రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. BPT సూపర్ ఫైన్ రైస్ కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50కు అమ్మగా, ఆధార్ అథెంటికేషన్‌తో ఒక్కో వ్యక్తి మ్యాక్సిమమ్ 10 కిలోలు కొనుక్కోవచ్చు.

గేటు పడక.. తాడుతో ట్రాఫిక్ కంట్రోల్
TG: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో JCB ఢీకొనడంతో రైల్వే గేట్ సెన్సార్ బాక్స్ ధ్వంసమై భారీ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రకాశ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలోని గేటును JCB ఢీకొట్టడంతో గేటు పనిచేయలేదు. అదే సమయంలో తిరుపతి–రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రావడంతో గేట్‌ను మూసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో తాడుతో రహదారిని మూసి వాహనాలను నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు, ఘటనపై విచారణ చేపట్టారు.

మూడు రోజులు సెలవులు
తెలంగాణలో విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 8 నుంచి 10 వరకు పాఠశాలలు, కళాశాలలకు మూడురోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 8న రెండో శనివారం, 9న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉంటాయి. ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. దీంతో వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. ఇటీవల వర్షాలు, బంద్‌లు, పండుగల కారణంగా ఇప్పటికే పలుమార్లు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే.

TVK విజయం హిస్టారిక్ విక్టరీ: విజయ్ కొడుకు సంజయ్
CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'బిహైండ్‌వుడ్స్ టీవీ' షోలో, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్‌లో నాన్న పెట్టిన TVK సాధించింది 'హిస్టారిక్ విక్టరీ' అని అన్నారు. ఈ విజయంతో మా ఫ్యామిలీకు మరింత రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్నారు. ప్రజలు మాపై, పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందని జాసన్ సంజయ్ తెలిపారు.

ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో లవ్ లెటర్లు, కత్తి
TG: తోటి మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల <a href="https://www.theclearcutnews.com/n/bgYVUnf">కేసు</a>లో రిమాండ్‌లో ఉన్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో అతని గదిని పోలీసులు సోదా చేయగా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతోపాటు రెండు ప్రేమలేఖలు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. లవ్ లెటర్ల ఆధారంగా మరో <a href="https://www.theclearcutnews.com/n/pjB7k4Q">మహిళతో</a> అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మహిళా ట్రైనీ IPS ఫోన్ లాక్కోవడం, బలవంతంగా గదిలోకి ప్రవేశించిన ఘటనలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు.

భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్
TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఓబులకేశవపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మోకు మహేందర్ రెడ్డి తన భార్య మాధవిపై దాడిచేసి, ఆమె కాళ్లు, చేతులు విరిచిన అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకుని పరారయ్యాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపేందుకు ప్రయత్నించి, పిల్లలను కూడా హాని చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసింది. మహేందర్‌రెడ్డి పిల్లలతో కనిపించకపోగా, ఫోన్ స్విఛాఫ్‌లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
న్యూస్ చదువుతూ నిద్రపోయిన యాంకర్.. నెటిజన్ల రియాక్షన్
అమెరికాకు చెందిన మార్నింగ్ న్యూస్ FOX ఛానెల్లో యాంకర్ లైవ్ జరుగుతుండగా నిద్రలోకి జారిన వీడియో వైరల్ అవుతుంది. <br>సాధారణంగా లైవ్‌లో ఇలా జరిగితే ట్రోల్స్ వస్తాయి. వీడియో వైరల్ అవ్వగానే ఆమె ఇద్దరు పిల్లల తల్లి కావడం, రోజువారీ తెల్లవారుజామున షిఫ్టులే దీనికి కారణమని నెటిజన్లు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఉరవకొండలో ఉద్రిక్తత.. గుంతకల్‌లో సెక్షన్ 30 అమలు
AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయ భూముల అంశంపై YSRCP చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మాజీ MP గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు గుంతకల్ సబ్‌డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు చేశారు. ఇదే అంశంపై TDP కూడా పోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇకపై ఆ రోల్స్ చేయను: విజయ్ సేతుపతి
ఇకపై తను గెస్ట్ రోల్స్ చేయనని హీరో విజయ్ సేతుపతి అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ‘జైలర్-2’లో క్యామియోకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మూవీపై తన పోస్టర్ వేసినా ఆడియన్స్ ఆయన్నే చూస్తారని, అదే చిన్న సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తే తన పోస్టర్‌తోనే మార్కెటింగ్ చేస్తారని పేర్కొన్నారు. దీంతో తను హీరోగా చేస్తున్న మూవీస్‌పై ఎఫెక్ట్ పడుతోదన్నారు.
సార్.. మీ హెల్మెట్ ఏది..?
AP: విశాఖపట్నంలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు పోలీసులను ధైర్యంగా ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీహరిపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సార్.. మీ హెల్మెట్ ఏది అని యువకుడు నిలదీయగా, విధుల్లో ఉన్నామని పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే యువకుడు మాకు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారు.. మీకు రూల్స్ వర్తించవా అని ప్రశ్నించాడు. దీంతో ఓ పోలీస్ తన తప్పును అంగీకరిస్తూ, నువ్వు అడిగింది కరెక్టే.. ఇకపై ఇలా జరగదు అని చెప్పారు.

నటనతో షేక్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్!
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా మనముందుకు వస్తున్నారు. ‘బలగం’ డైరెక్టర్ వేణు యెల్దండి తీస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'పర్షి' పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులు
మహిళా రెజర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 2023లో రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చేసిన నిరసనలతో ఈ కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు 2023 జూన్‌లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు భారత కుస్తీ సమాఖ్య(WFI) మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌లను నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది.

'పుస్తక హుండీ'తో పాత పుస్తకాలకు కొత్త ఊపిరి!
మన ఇంట్లో చదవడం పూర్తియిపోయి, మూలన పడేసిన పాత పుస్తకాలకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) 'బుక్ హుండీ' ద్వారా కొత్త జీవం పోస్తోంది. మనం దాచుకున్న పుస్తకాలను ఇక్కడ డొనేట్ చేస్తే, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు, పుస్తక ప్రియులకు వాటిని ఉచితంగా ఇస్తున్నారు. ఎవరైనా సరే తమకి నచ్చిన రెండు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళొచ్చు. గడిచిన పదేళ్లలో ఇలా దాదాపు 2 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. పుస్తకాలు చదివేవాళ్లు దాతలుగా, దాతలు పాఠకులుగా మారుతూ ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు.

హైవేపై పల్టీలు కొట్టిన లారీ
AP: అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం సమీపంలోని నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఒక లారీ మరో లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొడుతూ సర్వీస్ రోడ్డుపై పడి కలెక్టర్ కార్యాలయ రహదారికి అడ్డంగా పడింది. మరో లారీ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు లారీల్లో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రెండు భారీ క్రేన్లతో లారీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

భారత్‌లో హాలీవుడ్ హవా: 2026 రికార్డుల సంవత్సరం!
2026 మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకు బిగ్గెస్ట్ ఇయర్‌గా నిలిచింది. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'ది ఒడిస్సీ', 'అవేంజర్స్: డూమ్స్‌డే' వంటి భారీ సినిమాలు థియేటర్లలో హౌస్‌ఫుల్ అవుతున్నాయి. హాలీవుడ్ క్రేజ్ చూసి, మన ఇండియన్ మూవీ మేకర్స్ కూడా వాళ్ళతో డైరెక్ట్‌గా పోటీపడకుండా రిలీజ్ డేట్లను వెనక్కి ముందుకి జరుపుకుంటున్నారు. చిన్న నగరాల నుండి ఐమాక్స్ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు హాలీవుడ్ హవాయే నడుస్తోంది.

ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభం
TG: ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 ఇయర్ అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. M.A, MBA, MCA, M.Com, M.Scతో పాటు BA, B.Com, BBA, Diploma సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్స్ ఇస్తున్నారు. పీజీ కోర్సులు నాలుగు సెమిస్టర్లు, యూజీ కోర్సులు ఆరు సెమిస్టర్లుగా ఉంటాయి. MA పొలిటికల్ సైన్స్‌ను తెలుగు మీడియంలో కూడా అందిస్తున్నట్లు యూనివర్సిటీ నోటిఫికేషన్‌లో తెలిపింది. <a href="https://oupgrrcde.com/Registration/Student/Default">అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</a>

రామాయణ కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ!
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'రామాయణ' కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), సాయి పల్లవి (సీత) లుక్‌లు ఆధునిక మోడలింగ్ స్టైల్‌లో ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది త్రేతాయుగమా లేక 2026 మోడరన్ ఫ్యాషనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రామాయణం నాటి పౌరాణిక వాతావరణం లోపించి, సీరియల్ కాస్ట్యూమ్స్‌లా ఉన్నాయని విమర్శిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి
AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి లావణ్య (25), రెండేళ్ల కుమార్తె కీర్తన మృతి చెందగా, తండ్రి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. భాష్యం బ్లూమ్స్ స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబం, స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్ గదిలో యువతి సూసైడ్
AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం(26) విశాఖపట్నంలోని గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె సన్నిహితుడు లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఓ హోటల్‌లో గది తీసుకున్న ఆమె, ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా రషీదా బేగం స్కార్ఫ్‌తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.