'పుస్తక హుండీ'తో పాత పుస్తకాలకు కొత్త ఊపిరి!

మన ఇంట్లో చదవడం పూర్తియిపోయి, మూలన పడేసిన పాత పుస్తకాలకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) 'బుక్ హుండీ' ద్వారా కొత్త జీవం పోస్తోంది. మనం దాచుకున్న పుస్తకాలను ఇక్కడ డొనేట్ చేస్తే, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు, పుస్తక ప్రియులకు వాటిని ఉచితంగా ఇస్తున్నారు. ఎవరైనా సరే తమకి నచ్చిన రెండు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళొచ్చు. గడిచిన పదేళ్లలో ఇలా దాదాపు 2 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. పుస్తకాలు చదివేవాళ్లు దాతలుగా, దాతలు పాఠకులుగా మారుతూ ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు.



