Latest

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు
Crime· 1 Aug 2026

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు

TG: కరీంనగర్‌లో భూవివాదంలో ప్రత్యర్థిని <a href="https://www.theclearcutnews.com/n/5YvSyTa">ఇరికించేందుకు</a> గంజాయి కేసు సృష్టించిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భూతగాదాలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయించేందుకు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి దుకాణంలో ఉంచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 370 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. గంజాయి, 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ACP విజయ్‌కుమార్ తెలిపారు.

హాస్టల్‌లో విద్యార్థినుల గొంతు కోసే ప్రయత్నం
Crime· 1 Aug 2026

హాస్టల్‌లో విద్యార్థినుల గొంతు కోసే ప్రయత్నం

AP: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్‌లో నిద్రపోతున్న సుస్మిత, సోఫియా అనే ఇద్దరు విద్యార్థినుల గొంతును మరో అమ్మాయి బ్లేడుతో కోసే ప్రయత్నం చేయగా, వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనను దాచిపెట్టి, హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన వార్డెన్ నల్లమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ
AP· 1 Aug 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రంగ్ దే బసంతి’కి 20 ఏళ్లు - విద్యార్థి పోరాటాలు!
Cinema· 1 Aug 2026

‘రంగ్ దే బసంతి’కి 20 ఏళ్లు - విద్యార్థి పోరాటాలు!

ఇటీవల నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై GenZ విద్యార్థులు చేసిన పోరాటాలు చూస్తే, సరిగ్గా 20 ఏళ్ల ముందు వచ్చిన ‘రంగ్ దే బసంతి’(2006) సినిమానే కళ్లముందు కనిపించింది.ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ ఊరికే రావు, అన్యాయం జరిగినప్పుడు నిలదీయడమే నిజమైన విప్లవం అని ఈ సినిమా తెలియజేస్తోంది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఎలుగెత్తిన నినాదాలు, పాడిన 'ఖూన్ చలా' పాటలు, వ్యవస్థలోని అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై నేటి యువతలో ఎంత ఆక్రోశం ఉందో, నాటి భగత్ సింగ్, ఆజాద్ ల పోరాట స్ఫూర్తిని గుర్తుచేశాయి.

లహావుల్ లోయలో హైదరాబాద్ బైకర్ అదృశ్యం
News· 1 Aug 2026

లహావుల్ లోయలో హైదరాబాద్ బైకర్ అదృశ్యం

హైదరాబాద్‌కు చెందిన అనిల్ మార్ల(42) లహావుల్ లోయలో బైక్‌పై వెళ్తూ కనిపించకుండా పోయాడు. జూలై 19 నుంచి అతడి ఆచూకీ లేదు. అనిల్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు 'సుమ్దో మోడ్ 3' దగ్గర లోయలో పడింది. పోలీసులు, SDRF బృందాలు డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు. ఘటనా స్థలంలో బైక్ భాగాలు, హెల్మెట్, ఫోన్ దొరికాయి. నదీ ప్రవాహంలో అనిల్ కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త దొరికే వరకు గాలింపు చర్యలు ఆపవద్దని అనిల్ భార్య సుమిత కోరింది. ప్రస్తుతం వెతుకులాట కొనసాగుతోంది.

లోకల్, సర్పంచ్ ఎన్నికలపై EC క్లారిటీ
Politics· 1 Aug 2026

లోకల్, సర్పంచ్ ఎన్నికలపై EC క్లారిటీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ ఎలెక్షన్స్ ఏర్పాట్లుపై EC పనులను వేగవంతం చేసింది. ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో ఎలెక్షన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశమౌతున్నారు. ముందుగా ZPTC, MPTC ఎన్నికల తరువాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఎలెక్షన్స్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలెక్షన్ ఆఫీసర్స్‌తో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్లుకు సిద్ధమవుతున్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
AP· 1 Aug 2026

భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో విమానాశ్రయాన్న ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

భారత్‌లో హాలీవుడ్ చిత్రాల సునామీ!
Cinema· 1 Aug 2026

భారత్‌లో హాలీవుడ్ చిత్రాల సునామీ!

ఇటీవల విడుదలైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం మొదటి రోజే భారతదేశ బాక్సాఫీస్ వద్ద రూ.61 కోట్లు రాబట్టి ఆకట్టుకుంది. దీనికి ముందే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ది ఒడిస్సీ' విడుదలైన తొలి రోజే రూ.16.9 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.మన దేశంలో ప్రముఖ స్థానిక నటీనటుల సినిమాలకు లభించే స్థాయిలో హాలీవుడ్ సినిమాలు, దర్శకులకు క్రేజ్ పేరగడం విశేషం.

APలో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు
General· 1 Aug 2026

APలో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

AP: రాష్ట్రంలో కొత్తగా మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో 6 రాగా, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున రికార్డుఅయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 59కి చేరాయి. ఇప్పటివరకు 15 జిల్లాలకు ఈ వైరస్ పాకింది. మొత్తం 531 మందికి టెస్టులు చేశారు. అన్నిటికంటే ఎక్కువగా విశాఖ, రాజమండ్రిలో 11 కేసులు చొప్పున ఉన్నాయి.

'ఫౌజీ'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!
Cinema· 1 Aug 2026

'ఫౌజీ'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫౌజీ'. ఇందులో సీనియర్ హీరోయిన్ 'జయప్రద' ప్రభాస్‌కు తల్లిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మా గ్రామానికి వచ్చా.. పోరాటం మాత్రం ఆగదు: సోనం వాంగ్‌చుక్
Viral· 1 Aug 2026

మా గ్రామానికి వచ్చా.. పోరాటం మాత్రం ఆగదు: సోనం వాంగ్‌చుక్

దిల్లీలో జరిగిన నిరాహార దీక్ష ముగిసిన అనంతరం సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 'ఎక్స్‌'లో భావోద్వేగ పోస్ట్ చేశారు. 'తిరిగి నా గ్రామానికి వచ్చాను... కానీ నేను పోరాడిన అంశాలను మాత్రం మరచిపోలేదు. ప్రభుత్వం మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు. 'ఈ పోస్టుకు ఎలాంటి కాపీరైట్స్ లేవు.. స్వేచ్ఛగా షేర్ చేసుకోవచ్చు' అని తన సందేశంలో తెలిపారు.

చివరి వీడ్కోలులోనూ గాయని కి దక్కని గౌరవం!
News· 1 Aug 2026

చివరి వీడ్కోలులోనూ గాయని కి దక్కని గౌరవం!

లెజెండరీ గాయని జమునా రాణి (88) అంత్యక్రియలు నిన్న బెంగళూరులో ముగిశాయి.జీవితాంతం బ్రహ్మచారిణిగా జీవించిన ఆమె చివరి వీడ్కోలు కార్యక్రమానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.టాలీవుడ్ నుంచి ఒకరిద్దరు మినహా ప్రముఖులెవరూ సంతాపం తెలపకపోవడం బాధాకరం.వేలాది మధుర గీతాలను అందించిన ఆమెకు కనీస గౌరవం దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చివరగా 'మిథునం' చిత్రంలో పాట పాడారు.

జావెలిన్‌లో నీరజ్‌కు సిల్వర్, యశ్వీర్‌కు బ్రోన్జ్
Sports· 1 Aug 2026

జావెలిన్‌లో నీరజ్‌కు సిల్వర్, యశ్వీర్‌కు బ్రోన్జ్

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తను 85.83 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి గోల్డ్ గెలిచాడు. ఇదే ఆటలో యువ ఆటగాడు యశ్వీర్ సింగ్ తన చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి బ్రోన్జ్ సాధించాడు. దీంతో భారత్ కు ఒకేసారి రెండు పతకాలు వచ్చాయి. ఇంకో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ 81.56 మీటర్లు విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

కనుల వేడుకగా రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమం
TG· 1 Aug 2026

కనుల వేడుకగా రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమం

TG: హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌లో రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమంగా కనుల వేడుకగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీతలు స్వర్ణకిలారి, నరేష్కుమార్ సూఫీ, చరణ్ పరిమి, మహమ్మద్ గౌస్‌లకు నిర్వాహకులు కుమార్ కూనపరాజు, అతిథులు కలిసి పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కుప్పిలి పద్మ, తాడి ప్రకాశ్, అరుణాంక్ లత, వేంపల్లె షరీఫ్ వారి పుస్తకాల గురించి మాట్లాడారు.

ప్రధానిపై కామెంట్స్.. బాలిక క్షమాపణలు
Politics· 1 Aug 2026

ప్రధానిపై కామెంట్స్.. బాలిక క్షమాపణలు

జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన రుచికా సింగ్ క్షమాపణలు కోరారు. 'తనకు 15 ఏళ్లు మాత్రమేనని, తోటి నిరసనకారుల ప్రభావంతోనే అలా మాట్లాడానని' వీడియోలో తెలిపారు. 'తాను చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పని అంగీకరిస్తూ, దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని' ఆమె అన్నారు. ఈ ఘటనపై నమోదైన 'ZERO FIR'ను దిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

పెరిగిన వరద ఉద్ధృతి.. భద్రాచలంలో హైఅలర్ట్
TG· 1 Aug 2026

పెరిగిన వరద ఉద్ధృతి.. భద్రాచలంలో హైఅలర్ట్

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నీటిమట్టం 55.1 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల స్నానఘట్టాలు, సీతవాగు వద్ద పలు ప్రాంతాలు నీటమునిగాయి. చర్ల మండలంలోని ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల సమయంలో సీఐ, ఎస్సై వరద నీటిలో పడినా క్షేమంగా బయటపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

GCDO అరుంధతిపై చర్యలు తీసుకోవాలి: AISF
Education· 1 Aug 2026

GCDO అరుంధతిపై చర్యలు తీసుకోవాలి: AISF

TG: నల్గొండ KGBV జిల్లా సమన్వయ అధికారిణి (GCDO), MEOగా బాధ్యతలు నిర్వహిస్తున్న అరుంధతిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని AISF నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ.. KGBV పాఠశాలలను సక్రమంగా పర్యవేక్షించకపోవడం వల్ల విద్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. దీంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అపార్ట్‌మెంట్ నుంచి దూకిన టెక్కీ
Crime· 1 Aug 2026

అపార్ట్‌మెంట్ నుంచి దూకిన టెక్కీ

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వాసవి JP ట్రెండ్స్ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుజీత్ కుమార్ పండిట్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 17వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు మానసిక ఒత్తిడా, వ్యక్తిగత సమస్యలా లేదా మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

పెట్టుబడిదారులకు CM కీలక హామీ
TG· 1 Aug 2026

పెట్టుబడిదారులకు CM కీలక హామీ

తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత గమ్యస్థానమని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం కొనసాగుతోందన్నారు. మంచి పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు పూర్తి ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

యూనివర్సిటీల్లో భారీ మార్పులు
Education· 1 Aug 2026

యూనివర్సిటీల్లో భారీ మార్పులు

AP: రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన సభ్యులకే ఈ నిర్ణయం వర్తిస్తుందని, క్లాజ్-1 కింద ఉన్న ఎక్స్‌ ఆఫిషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల పాలనలో పారదర్శకత, సమర్థత పెంచే దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది.

ఆయిల్‌పామ్ కంపెనీలకు తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్
TG· 1 Aug 2026

ఆయిల్‌పామ్ కంపెనీలకు తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్

TG: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోని కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 85వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని వెల్లడించారు. పలుమార్లు సమావేశాలు, నోటీసులు ఇచ్చినా పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. ఇకపై లక్ష్యాలు సాధించని కంపెనీల నుంచి జిల్లాలను వెనక్కి తీసుకుని ఇతర సంస్థలకు అప్పగిస్తామని హెచ్చరించారు.