Latest

కష్టపడి మెడిసన్ చదవకండి.. వేస్ట్- ఎలన్ మస్క్
News· 31 Jul 2026

కష్టపడి మెడిసన్ చదవకండి.. వేస్ట్- ఎలన్ మస్క్

మెడికల్ కాలేజీలలో చేరి ఎంబీబీఎస్ చదవడం శుద్ధ వేస్ట్ అంటున్నారు ఎలన్ మస్క్. మరో మూడేళ్లలో ఆప్టిమస్ రోబోలు ఈ భూమిపై ఉన్న ఏ బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన సర్జరీలు చేయగలవని, అదికూడా భారీ స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయనంటున్నారు. మెడికల్ టెక్నాలజీ అంతలా అభివృద్ధి చెందుతుందని మస్క్ అంచనా

ఆర్థ రైటిస్ వెంటాడినా ఓ రెజ్లర్ మదర్ సంచలనం !
Sports· 31 Jul 2026

ఆర్థ రైటిస్ వెంటాడినా ఓ రెజ్లర్ మదర్ సంచలనం !

మాతృత్వం తర్వాత తీవ్రమైన ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) బారిన పడినా, భారత రెజ్లర్ సీమా కాలిరామ్నా అసాధారణ పట్టుదలతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో బ్రాంజ్ మెడల్ సాధించింది. డెలివరీ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ పెయిన్ ఉన్నప్పటికీ తీవ్రంగా శ్రమించి మ్యాట్ పైకి రీ-ఎంట్రీ ఇచ్చింది. విపరీతమైన ఫిజికల్ ఛాలెంజెస్ , డిప్రెసింగ్ సిట్యుయేషన్స్‌ను దాటుకుని మెడల్ గెలవడం ఆమె డెడికేషన్ అండ్ విల్ పవర్‌కు నిదర్శనంగా నిలిచింది.

మెకానిక్ కుమార్తెకు జుడోలో గోల్డ్ మెడల్ !
Sports· 31 Jul 2026

మెకానిక్ కుమార్తెకు జుడోలో గోల్డ్ మెడల్ !

కామన్వెల్త్ గేమ్స్ జూడో 48 కేజీల కేటగిరీలో అస్మితా డే గోల్డ్ మెడల్ సాధించి ఇండియాకు సరికొత్త రికార్డును అందించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒక సాధారణ సైకిల్ మెకానిక్ కూతురైన అస్మిత, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్‌ను ఎదుర్కొని ఈ గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ ఫ్లాగ్‌ను ఎగురవేసింది. ఆమె డెడికేషన్ అండ్ హార్డ్‌వర్క్‌పై స్పోర్ట్స్ వరల్డ్ ప్రశంసలు కురిపిస్తోంది.

కశ్మీర్లో ఉగ్రదాడి- బీహారీ కార్మికుని మృతి !
News· 31 Jul 2026

కశ్మీర్లో ఉగ్రదాడి- బీహారీ కార్మికుని మృతి !

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుడు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏరియాలో లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వర్గాలు వెంటనే అలర్ట్ అయి, దాడి జరిగిన ప్రాంతాన్ని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) తో స్వాధీనం చేసుకున్నాయి. గత కొంతకాలంగా నాన్-లోకల్స్ టార్గెటెడ్ కిల్లింగ్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

స్టూడెంట్స్ కోపం న్యాయమైనదే-రాఘవ్ చద్దా !
Politics· 31 Jul 2026

స్టూడెంట్స్ కోపం న్యాయమైనదే-రాఘవ్ చద్దా !

NEET పేపర్ లీక్ వివాదంపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన మౌనాన్ని వీడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు చర్చలో మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం తన విధి అని, ఇప్పుడు ట్రెజరీ బెంచ్‌లో ఉన్నందున సమస్యకు పరిష్కారం చూపడమే తన బాధ్యతని పేర్కొన్నారు. కేవలం మీడియా సౌండ్‌బైట్స్ లేదా హెడ్‌లైన్స్ కోసం కాకుండా, పేపర్ లీక్స్‌ని నిరోధించే పక్కా చట్టం మరియు ఇన్సిటిట్యూషనల్ సొల్యూషన్ వచ్చే వరకు వేచి చూశానని, విద్యార్థుల కోపం పూర్తిగా సరైనదేనని ఆయన స్పష్టం చేశారు.

భోగాపురం రైతులకు కోర్టు ద్వారా సెటిల్మెంట్- మంత్రి
News· 31 Jul 2026

భోగాపురం రైతులకు కోర్టు ద్వారా సెటిల్మెంట్- మంత్రి

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్‌లో భూములిచ్చిన రైతులకు కాంపెన్సేషన్ ఇష్యూను కోర్టు ద్వారా సాల్వ్ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్రోచ్ రోడ్డు కోసం ఎకరాకు ₹1 కోటి డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ₹48 లక్షలు ఆఫర్ చేసింది. ఈ అమౌంట్‌ను విశాఖపట్నం ట్రిబ్యునల్‌లో డిపాజిట్ చేశామని, కొద్ది నెలల్లోనే లీగల్ ప్రోసెస్‌ ద్వారా రైతులకు డబ్బులు అందేలా చూస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రామిస్ చేశారు.

భోగాపురం డేటా సెంటర్ పై మళ్లీ రివ్యూ చేయాలి- శర్మ
News· 31 Jul 2026

భోగాపురం డేటా సెంటర్ పై మళ్లీ రివ్యూ చేయాలి- శర్మ

దేశంలో ఏర్పాటవుతున్న ప్రతీ AI, డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా పరిశీలించి, పర్యావరణ చట్టాలకు లోబడి ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే ముందడుగు వేయాలని కేంద్ర పర్యావరణ శాఖను మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ E.A.S. శర్మ కోరారు. ఇవి భారీగా విద్యుత్, నీటిని వినియోగిస్తూ స్థానిక పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగాపురం పరిసరాల్లో రిలయెన్స్ డేటా సెంటర్ కు కేటాయించిన స్థలాలు తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలని, సరైన పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులివ్వడం సరికాదని హెచ్చరించారు.

రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయండి !- EASశర్మ
News· 31 Jul 2026

రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయండి !- EASశర్మ

భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని,పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎపి పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం - 2019 ప్రకారం 75 శాతం ఉద్యోగాలను లోకల్స్ కే ఇచ్చేలా జీఎంఆర్ సంస్థను ఆదేశించాలన్నారు. అటు విశాఖ ఎయిర్ పోర్టుపై ఆధారపడిన వారికి కూడా న్యాయం చేయాలన్నారు.సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పరిహారం, ఉపాధి భద్రత, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

లోకల్స్ ని వదిలేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ?
News· 31 Jul 2026

లోకల్స్ ని వదిలేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చే ప్రాసెస్ లో లోకల్స్ అభ్యంతరాలను పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌లో లోపాలు ఉన్నాయని, పబ్లిక్ హియరింగ్‌లో రైతులు చెప్పిన జీవనోపాధి నష్టం, వాటర్ టేబుల్ పడిపోవడం వంటి టెక్నికల్ ఇష్యూస్‌ను క్లియరెన్స్ కమిటీ కన్సిడర్ చేయలేదన్నది ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ల ఆరోపణ. రీహ్యాబిలిటేషన్ ప్లాన్ లేకుండానే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడుతున్నారు. రైతులకు ఉచిత ఫ్లైట్ జర్నీతో చేతులు దులిపేసుకుంటున్నారు.

భోగాపురంఎయిర్ పోర్టు నైట్ వ్యూ సింప్లీ సూపర్బ్ !
News· 31 Jul 2026

భోగాపురంఎయిర్ పోర్టు నైట్ వ్యూ సింప్లీ సూపర్బ్ !

భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కోసం అర్ధరాత్రుళ్లు కూడా కార్మికులు తుది మెరుగులు దిద్దుతున్నారు. శనివారం నాటి సభకోసం విఐపీలు, వివిఐపీలు, ఎయిర్ పోర్టుకు ల్యాండ్ ఇచ్చిన రైతులు, నిర్మించిన సంస్థ జీఎంఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వేర్వేరు గ్యాలరీలు రెడీ చేశారు. స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లతో చీకట్లోనూ లేజర్ షోను పోలిన కళను తీసుకొచ్చారు. ఎల్ ఈడీ లైట్లు, నియాన్ బల్బులు, విద్యుద్ధీపాలతో కలర్ పుల్ గా ఎయిర్ పోర్టు కనిపిస్తోంది.రన్ వే, టాక్సీ వే, ఎప్రాన్ ఇలా అన్ని మార్గాలూ లైట్ల వెలుగులో కళకళలాడుతున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్టుకు  ఇక శెలవు !
News· 31 Jul 2026

విశాఖ ఎయిర్ పోర్టుకు ఇక శెలవు !

భోగాపురం కేంద్రంగా ఆగస్ట్ 17 అర్ధరాత్రి ఒంటిగంట నుంచి విమాన రాకపోకలు మొదలవుతాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాలను ఇక నిలిపేస్తు సివిల్ ఏవియేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 30 సంవత్సరాల పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ (ఐఎన్‌ఎస్‌ డేగ) సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రమే విశాఖ ఎయిర్‌పోర్ట్ ను వాడతారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఐఏటీఏ కోడ్ VTZను కొత్త ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తారు.

మోడ్రన్ టెక్నాలజీకి మారు పేరు ఈ ఎయిర్ పోర్ట్ !
News· 31 Jul 2026

మోడ్రన్ టెక్నాలజీకి మారు పేరు ఈ ఎయిర్ పోర్ట్ !

భోగాపురం ఎయిర్ పోర్టు కంప్లీట్‌ గా డిజిటల్ టెక్నాలజీతో రూపొందింది. ప్రయాణికులకు ఫాస్ట్ అండ్ ఈజీ ట్రావెల్ కోసం మోడ్రన్ చెక్-ఇన్ కౌంటర్లు,సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ,ఆటో మేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా బిజినెస్ రంగాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించిన ఎయిర్ పోర్టు. ఏటా 20,000 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ కూడా చేసేలా రూపొందింది. దాదాపు వెయ్యి మందికి నేరుగా జాబ్స్ కల్పించనుంది. ఉత్తరాంధ్ర ఎకానమీకి ఇది బూస్టప్ ఇస్తుంది.

అదిరిపోయే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్టు !
News· 31 Jul 2026

అదిరిపోయే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్టు !

విశాఖ లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అత్యాధునిక మౌలిక వసతులు ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌తో అట్రాక్టివ్ గా రూపొందింది. సుమారు 2,700 ఎకరాల భారీ విస్తీర్ణంలో, రూ. 4,727 కోట్ల అంచనా వ్యయంతో తయారైన ఈఎయిర్ పోర్టు కంటికి ఇంపుగా ఉండే ‘ఫ్లయింగ్ ఫిష్’ (ఎగిరే చేప) ఆకారంలో డిజైన్ చేశారు. తీరప్రాంతం కావడంతో గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన తుఫాను గాలులను సైతం తట్టుకునేలా దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో 3,800 మీటర్ల పొడవైన రన్ వేతో పాటు మోడ్రన్ ATC టవర్ కూడా ఉంది.

భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కు సర్వం సిద్ధం !
News· 31 Jul 2026

భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కు సర్వం సిద్ధం !

ప్రధాని చేతుల మీదుగా శనివారం ఓపెన్ చేసే భోగాపురం ఎయిర్ పోర్టు వేడుకకు అన్నీ సిద్ధం చేశారు. ఈ ఓపెనింగ్ సెరిమనీకి అటెండ్ అయ్యే వారికోసం 5 వేల బస్సులను రెడీ చేశారు. బస్సుల్లో వచ్చే వారికి ప్రత్యేక డ్రాప్ పాయింట్లు, ఫుడ్ సప్లయ్ ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణతో పాటు, ప్రత్యేక రూట్ మ్యాప్, పార్కింగ్ సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వెయ్యి మంది పారిశుధ్య సిబ్బంది,1600 టెంపరరీ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

సీఎం విజయ్ ఆఫీస్ షిఫ్టింగ్?
News· 31 Jul 2026

సీఎం విజయ్ ఆఫీస్ షిఫ్టింగ్?

తమిళనాడు సీఎం విజయ్ తన ఆఫీస్‌ను బ్రిటిష్ కాలం నాటి ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10వ అంతస్తుకు షిఫ్ట్ చేస్తున్నారు. పాత బిల్డింగ్‌లో స్పేస్ తగినంత లేకపోవడం, అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు పెరగడమే దీనికి ప్రధాన కారణం. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కూడా కొత్త సచివాలయం కోసం ప్రయత్నించారు. ఇప్పుడు విజయ్ డెసిషన్ తో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ డిమాండ్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

గుడ్ న్యూస్! SIR డెడ్‌లైన్ పొడిగింపు?
News· 31 Jul 2026

గుడ్ న్యూస్! SIR డెడ్‌లైన్ పొడిగింపు?

తెలంగాణ ప్రజలకు అలర్ట్! ఓటర్ ఐడీ రిజిస్ట్రేషన్, కరెక్షన్స్ కోసం నడుస్తున్న SIR ప్రాసెస్ డెడ్‌లైన్‌ను ఎలక్షన్ కమిషన్ ఆగస్టు 10 వరకు ఎక్స్‌టెండ్ చేసింది. ఓటర్ కార్డ్ అప్లై చేయని యూత్, అలాగే అడ్రస్ అప్‌డేట్ చేయాలనుకునే వాళ్లు ఈ ఎక్స్‌ట్రా టైమ్‌ని వాడుకోవచ్చు. ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయ్యేలోపు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, చేంజెస్ ఉన్నా ఆగస్టు 10 వరకు అప్లై చేసుకోవచ్చని EC అధికారులు చెప్పారు.

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?
General· 31 Jul 2026

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

రోజూ నిద్రపోయాక కలలు వస్తుంటాయి. కానీ అవి ఎందుకు వస్తాయో తెలుసా? నిజం చెప్పాలంటే.. దీనికి ఇప్పటికీ ఒక్క సమాధానం లేదు. మనం ఎక్కువగా REM Sleep అనే స్టేజ్‌లోనే కలలు కంటాం. ఆ టైమ్‌లో మన మెదడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చూసిన విషయాలు, గుర్తుండిపోయిన సంఘటనలు, మనలో ఉన్న ఫీలింగ్స్‌ని మెదడు సెట్ చేసే సమయంలో కలలు రావొచ్చని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. కానీ కలలు అసలు ఎందుకు వస్తాయి? వాటి అసలు పని ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు.

Gen Z ఆలోచించాలి!
Politics· 31 Jul 2026

Gen Z ఆలోచించాలి!

21 ఏళ్ల యూత్ కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేయొచ్చన్న CM రేవంత్ రెడ్డి పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ CJP ప్రొటెస్టర్ <a href="https://x.com/VijayMallangi/status/2082812145805488481?s=20">విజయ్ మల్లాంగి</a> ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ పార్టీలు యూత్‌కి అవకాశాలు ఇవ్వాలని, కేవలం లీడర్ల పిల్లలు, బంధువులకే టికెట్లు ఇస్తే యూత్‌ని మోసం చేయడమే అవుతుందీ అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లు, ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయని తెలంగాణ యూత్ వెయిట్ చేస్తోందన్నారు. యూత్ పాలిటిక్స్ లోకి వచ్చి ప్రశ్నించాలని, చాన్స్ ఇస్తే పోటీకి రెడీ అని చెప్పారు.

MPలు ఏం మాట్లాడినా పర్లేదా- అభిజీత్ దీప్కే
Politics· 31 Jul 2026

MPలు ఏం మాట్లాడినా పర్లేదా- అభిజీత్ దీప్కే

సోషల్ మీడియాలో మహిళలను దారుణంగా బూతులు తిడుతున్న IT cell సభ్యులపై కూడా FIRలు నమోదు చేస్తారా అని <a href="https://x.com/abhijeet_dipke/status/2083183749668196558?s=20">అభిజీత్</a> దీప్కే ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో తిట్టినందుకు ఒక అమ్మాయిపై కేసు పెట్టడంపై స్పందిస్తూ, తిట్టడం తప్పే కావచ్చు కానీ కేసు బుక్ చేయడం ఏంటని ఆయన అన్నారు. ఒకవేళ తిట్టినందుకు కేసులు పెడితే, ఏళ్ల తరబడి ఆన్‌లైన్‌లో మహిళలను బూతులు తిడుతున్న BJP IT cell మెంబర్స్, అలాగే పార్లమెంట్‌లోనూ అసభ్యంగా మాట్లాడిన నాయకులపై కూడా కేసులు పెట్టాలని అభిజీత్ డిమాండ్ చేశారు.

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?
General· 31 Jul 2026

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?

మనం రోజూ వేసుకునే షర్టుల్లో ఓ కామన్ విషయం ఎప్పుడైనా గమనించారా? దాదాపు అన్ని షర్టుల్లో జేబు ఎడమవైపే ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం కాదు. దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ప్రపంచంలో 85-90% మంది కుడిచేతితోనే పనులు చేస్తారు. అందుకే షర్టు జేబును ఎడమవైపు పెడితే, కుడిచేతితో అందులో ఉన్న పెన్, డబ్బులు, ఐడీ కార్డ్ లాంటి వాటిని ఈజీగా తీసుకోవచ్చు. ఇదే డిజైన్ తర్వాత స్టాండర్డ్‌గా మారిపోయి, ఇప్పటికీ చాలా షర్టుల్లో అలాగే కొనసాగుతోంది.

సాయం చేయబోయి.. పెద్ద తప్పు చేశారు!
Viral· 31 Jul 2026

సాయం చేయబోయి.. పెద్ద తప్పు చేశారు!

మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ఎండ ఎక్కువగా ఉండటంతో స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగి కిందపడిపోయింది. అది చూసిన ఇద్దరు యువకులు గుండెపోటు వచ్చిందనుకుని వెంటనే CPR ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదని, ఎండ వల్లే స్పృహ తప్పిందని చెప్పారు. పైగా అవసరం లేకుండా చేసిన CPR వల్ల రెండు పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. అందుకే ఎవరైనా పడిపోతే వెంటనే CPR చేయడం కాదు.. ముందు అసలు పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.