Latest

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
Local· 6d ago

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం బుగ్గారం మండలంలో ఎంఆర్‌ఓ అందుబాటులో లేకపోవడంతో డీటీ రాకేష్‌కు జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

24 గంటల కరెంటు కోసం రైతుల ధర్నా
Local· 6d ago

24 గంటల కరెంటు కోసం రైతుల ధర్నా

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ గట్టు సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా కొనసాగుతోంది. సాగునీటి కోసం నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు వివిధ రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంటలకు సాగునీరు అందాలంటే 24 గంటల విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

నీట్ ప్రొటెస్టర్స్‌కి బిగ్ రిలీఫ్..
Gen Z· 6d ago

నీట్ ప్రొటెస్టర్స్‌కి బిగ్ రిలీఫ్..

ప్రొటెస్టర్స్ పై ఫైల్ అయిన FIRలను డ్రాప్ చేయాలని, ఇకపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోమని ఢిల్లీ పోలీస్ సుప్రీంకోర్టును కోరారు. ఇదే దారిలో అస్సాం, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ కూడా FIRలను క్వాష్ చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రొటెస్ట్ చేసే రైట్ ఉపయోగించినందుకు ఏ ప్రొటెస్టర్ కోర్టు కేసులు ఫేస్ చేయకూడదని, అన్ని స్టేట్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేలా యూనియన్ గవర్నమెంట్ చూడాలని CJP లాయర్ రత్నా సింగ్ అన్నారు.

డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!
Viral· 6d ago

డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!

పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్ కార్ డెమో కాస్తా మిస్‌ఫైర్‌గా మారింది. పార్క్ చేసి ఉన్న పోలీస్ వ్యాన్‌ను కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీ-చౌక్ దగ్గర జరిగిన ఈ డెమోలో జర్నలిస్ట్ ముహమ్మద్ ఆలిజా కారులోనే ఉండి వీడియో రికార్డ్ చేశారు. కారు రిమోట్‌గా ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్‌తో ఆపరేట్ చేస్తున్న టైమ్‌లో కనెక్షన్‌లో ప్రాబ్లమ్ రావడంతో కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొంత నష్టం జరగగా, ఎవరికీ గాయాలు కాలేదు.

దిల్లీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు
Current Affairs· 6d ago

దిల్లీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు

దిల్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా వచ్చింది. మొత్తం 1.45 కోట్ల ఓటర్లలో దాదాపు 47.5 లక్షల మంది పేర్లు ఇప్పుడు జాబితాలో లేవు. అంటే ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతయ్యింది. 70 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల ఒక్కో చోట లక్షకు పైగా పేర్లు తగ్గాయి. ఐదు నియోజకవర్గాల్లో 2025 ఎన్నికల్లో ఉన్న ఓటర్లలో 40 శాతానికి పైగా పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోవడం విచిత్రం. ఈ ఐదింటిలో మూడు ఆప్ గెలవడా, రెండు బీజేపీ గెలిచింది.

'వండర్ వుమన్' ఆగిపోయినట్టేనా?
Entertainment· 6d ago

'వండర్ వుమన్' ఆగిపోయినట్టేనా?

హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్ తన 'వండర్ వుమన్' రోల్‌కి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. మూడో పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ గన్‌తో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదని 41 ఏళ్ల ఈ యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని, నెక్స్ట్ ఈ రోల్ చేసే యాక్టర్‌కి ఆల్‌ది బెస్ట్ అని తెలిపారు. ఇప్పటివరకు 2 సోలో మూవీస్‌తో సహా మొత్తం 6 డీసీ చిత్రాల్లో వండర్ వుమన్ సూపర్ హీరోగా మెప్పించి గ్లోబల్ రేంజ్‌లో హ్యూజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

నోటీసులు ఇచ్చారు.. కానీ అధికారులే రాలేదు!
Local· 6d ago

నోటీసులు ఇచ్చారు.. కానీ అధికారులే రాలేదు!

TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ (జి) మండల కేంద్రంలో అధికారుల తీరుపై గ్రామపంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలలోపు గ్రామపంచాయతీ కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, నోటీసులు అందుకున్న సభ్యులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటలు దాటినా సంబంధిత అధికారులు కార్యాలయానికి హాజరుకాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులే సమయపాలన పాటించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చి, తామే కార్యాలయానికి ఆలస్యంగా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్
Sports· 6d ago

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పానిష్ భాషలో చేతితో రాసిన నోట్‌బుక్ ఎంట్రీని పోస్ట్ చేస్తూ, అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. పోస్ట్ చివర్లో “ఈ మాటలు జూలై 21న, ఫైనల్ తర్వాత రెండు రోజులకు రాశాను. నా తండ్రికి జరిగినది తర్వాత నేడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను” అని కూడా రాశారు. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ ఆగస్టు 8న రోసారియోలోని ఆసుపత్రిలో 68 ఏళ్ల వయసులో మరణించారు.

నిధులు మంజూరు చేయాలని వినతి
Local· 6d ago

నిధులు మంజూరు చేయాలని వినతి

TG: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పాలకవర్గం మంత్రి శ్రీధర్‌బాబును కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రిని హుజురాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

UCO Bankలో జాబ్స్.. టెక్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్!
Jobs· 6d ago

UCO Bankలో జాబ్స్.. టెక్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్!

UCO Bankలో Specialist Officer పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 20 పోస్టులు ఉండగా.. Manager-AI/ML Engineer, Manager-Cyber Security పోస్టులు చెరో 10 ఉన్నాయి. ఆగస్ట్ 29 నుంచి <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్స్ స్టార్ట్</a> కాగా.. సెప్టెంబర్ 18, 2026తో ముగుస్తాయి. ఆయా ఫీల్డ్స్‌లో B.E./B.Tech, MCA, M.Tech/M.E. వంటి క్వాలిఫికేషన్‌తో పాటు మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ 25-35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2026 నాటికి) ఉండాలి. SC/ST/PwBD వారికి రూ. 175, ఇతర క్యాండిడేట్స్‌కు రూ. 850 <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్</a> Fee ఉంటుంది.

హైదరాబాద్‌లో జోమాటో బిగ్ షాక్!
Current Affairs· 6d ago

హైదరాబాద్‌లో జోమాటో బిగ్ షాక్!

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో హైదరాబాద్‌లోని యూజర్ సపోర్ట్ ఆపరేషన్స్‌ను క్లోజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ ఆఫీస్‌కు చెందిన దాదాపు 250 మంది ఎంప్లాయీస్‌ ఉద్యోగాలు కోల్పోనున్నారు. తమ కస్టమర్ సపోర్ట్ వర్క్‌ను గురుగ్రామ్ హెడ్ ఆఫీస్‌కు షిఫ్ట్ చేస్తున్నట్లు జోమాటో అనౌన్స్ చేసింది. జాబ్ పోగొట్టుకున్న ఎంప్లాయీస్‌కి ఆగస్టు సాలరీతో పాటు అదనంగా 4 నెలల పేమెంట్, మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సపోర్ట్ అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

మెట్టూర్ డ్యామ్ నీరు విడుదల చేసిన సీఎం విజయ్
National· 6d ago

మెట్టూర్ డ్యామ్ నీరు విడుదల చేసిన సీఎం విజయ్

తమిళనాడు సీఎం సి.జోసఫ్ విజయ్ మెట్టూర్ డ్యామ్ నుంచి నీరు విడుదల చేశారు. సాధారణంగా జూన్ 12న ఈ డ్యామ్ తెరుస్తారు. ఈసారి నీళ్లు తక్కువగా ఉండడం వల్ల లేట్ అయింది. నైరుతి రుతుపవనాలు తక్కువగా పడడం, ఎల్ నినో ప్రభావం వల్ల ఇలా జరిగింది. సీఎం విజయ్ మాట్లాడుతూ కావేరీ నీటిపై తమిళనాడుకు ఉన్న హక్కుల విషయంలో రాజీపడం అని చెప్పారు. రైతులు నీటిని జాగ్రత్తగా వాడాలని, మధ్యస్థ కాలం పంటలు వేసుకోవాలని, నీరు ఆదా చేసే పద్ధతులు పాటించాలని కోరారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక తలుపులకు నోటీసు
Local· 6d ago

ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక తలుపులకు నోటీసు

TG: వరంగల్‌‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పరీక్షల విభాగం వద్ద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గది నంబర్‌ 103లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం పరీక్షలు నిర్వహించడంలేదని తెలుపుతూ తలుపులకు నోటీసు అంటించారు. దీంతో తెల్లవారుజామునే దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన రోగులు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరీక్షలు అవసరమైన సమయంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు ప్రశ్నించారు.

మహాధర్నాకు కదిలిన సూర్యాపేట ఉపాధ్యాయులు
Local· 6d ago

మహాధర్నాకు కదిలిన సూర్యాపేట ఉపాధ్యాయులు

TG: సూర్యాపేట జిల్లా నుంచి పీఆర్‌టీయూ-టీఎస్‌ ఉపాధ్యాయులు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్‌ నివేదికను వెంటనే తెప్పించి మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చిన ఎమ్మెల్యే
Local· 6d ago

ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చిన ఎమ్మెల్యే

AP: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. మంగళవారం కూటమి నాయకులు, అధికారులతో కలిసి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే నేరుగా పింఛన్‌ సొమ్మును అందజేశారు. మండలంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తుందని అన్నారు.

మహాధర్నాకు భారీగా తరలిన నల్లబెల్లి టీచర్లు
Local· 6d ago

మహాధర్నాకు భారీగా తరలిన నల్లబెల్లి టీచర్లు

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్‌టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే పీఆర్సీని తక్షణమే అమలుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నల్లబెల్లి మండలం నుంచి ఉపాధ్యాయులు తరలివెళ్లారు.

తిరువణ్ణామలైలో నేటి నుంచి కొత్త రూల్..ఫోన్లకు NO
Infotainment· 6d ago

తిరువణ్ణామలైలో నేటి నుంచి కొత్త రూల్..ఫోన్లకు NO

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. తమిళనాడు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్(HR&amp;CE) శాఖ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు, రీల్స్ తీయడాన్ని నిషేధించారు. ఆలయంలో ఇక ఎవరూ ఫోన్లు వాడకూడదు. భక్తుల కోసం ఆలయం దగ్గర ఐదు మొబైల్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లను ఈ కేంద్రాల్లో ₹5 చెల్లించి డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవచ్చు. దర్శనం తర్వాత టోకెన్‌తో ఫోన్‌ను తిరిగి తీసుకోవచ్చు.

బాధిత నర్సు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క
TG· 6d ago

బాధిత నర్సు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చౌటుగూడెం గ్రామానికి చెందిన నర్సు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో హత్యకు గురైన ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కొంత ఆర్థికసాయం అందించామని తెలిపారు.

IAS దివ్యా మిట్టల్ రాజీనామా
National· 6d ago

IAS దివ్యా మిట్టల్ రాజీనామా

2013 బ్యాచ్ IAS అధికారి దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సర్వీస్ తర్వాత రాజీనామా చేశారు. మిర్జాపూర్‌లో 75 ఏళ్లుగా తాగునీరు లేని లహురియాదహ్ గ్రామానికి పైప్‌లైన్ ద్వారా నీరు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఒత్తిడి లేదా ఏదైనా సంఘటన వల్ల తీసుకున్న నిర్ణయం కాదని ఆమె తెలిపారు. కుటుంబం, పర్సనల్ ప్రిఫరెన్స్, తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఇతర విషయాల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.

గోల్డ్ లవర్స్‌కి అప్‌డేట్!
Current Affairs· 6d ago

గోల్డ్ లవర్స్‌కి అప్‌డేట్!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌పై ₹160 పెరిగి ₹1,56,930కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై ₹150 పెరిగి ₹1,43,850 వద్ద, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,17,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం కొనేముందు ఈ రేట్స్‌ని మార్కెట్‌లో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోండి.

హైదరాబాద్‌కు 3 కొత్త లోగోలు.. సిటీకి కొత్త ఐడెంటిటీ!
TG· 6d ago

హైదరాబాద్‌కు 3 కొత్త లోగోలు.. సిటీకి కొత్త ఐడెంటిటీ!

TG: హైదరాబాద్ సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక మార్పుకు మరో విజిబుల్ మార్క్ వచ్చింది. CM రేవంత్‌రెడ్డి GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కొత్త లోగోలను లాంచ్ చేశారు. నిన్న మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు ఈ లోగోలను రిలీజ్ చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత GHMCకి కొత్త లోగో వచ్చింది. CMC లోగో కేర్, సస్టైనబిలిటీ, గ్రోత్‌ను, MMC లోగో ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్, గుడ్ గవర్నెన్స్, ప్రజా సేవను రిప్రజెంట్ చేసేలా ఈ లోగోలను డిజైన్ చేశారు.