తిరువణ్ణామలైలో నేటి నుంచి కొత్త రూల్..ఫోన్లకు NO

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. తమిళనాడు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్(HR&CE) శాఖ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు, రీల్స్ తీయడాన్ని నిషేధించారు. ఆలయంలో ఇక ఎవరూ ఫోన్లు వాడకూడదు. భక్తుల కోసం ఆలయం దగ్గర ఐదు మొబైల్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లను ఈ కేంద్రాల్లో ₹5 చెల్లించి డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవచ్చు. దర్శనం తర్వాత టోకెన్‌తో ఫోన్‌ను తిరిగి తీసుకోవచ్చు.



