Latest

బస్సులో కండక్టర్ బ్యాగ్ మిస్
India· 15 Jul 2026

బస్సులో కండక్టర్ బ్యాగ్ మిస్

బెంగళూరు నగరంలోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ బ్యాగ్ మిస్సయ్యింది. టికెట్ బ్యాగ్ దొరకకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని కండక్టర్ ఆందోళనకు గురయ్యారు. బస్సును మధ్యలోనే నిలిపేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ప్రయాణికుల బ్యాగులు వెతకగా టికెట్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్ తీసుకున్నట్లు చూశామని ప్రయాణికులు చెప్పారు. ఆ టైంలో ఆమె వీడియోను కూడా రికార్డు చేశారు.

తిరుపతిలో ₹85 లక్షల స్కామ్!
News· 15 Jul 2026

తిరుపతిలో ₹85 లక్షల స్కామ్!

తిరుపతిలో శ్రీవారి దర్శనం, రూమ్స్, సేవా టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడిన TTD మాజీ ఉద్యోగి అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు భక్తుల నుంచి ఇతడు ₹3.20 లక్షలు వసూలు చేశాడు. నిందితుడి బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయగా.. ఏకంగా ₹85 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2023లో ఇలాంటి ఫ్రాడ్స్ చేయడంతో TTD ఇతడిని జాబ్ లోంచి తీసేసింది. అరుణ్‌కుమార్ నుంచి ₹99 వేల క్యాష్, మొబైల్, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న ముద్రగడ ఫ్యామిలీ!
News· 15 Jul 2026

ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న ముద్రగడ ఫ్యామిలీ!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రొటోకాల్‌ను రిజెక్ట్ చేశారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని అఫిషియల్స్‌కు స్పష్టం చేశారు. సాధారణ పద్ధతిలోనే సొంత గ్రామం అయిన కిర్లంపూడిలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ముద్రగడ చనిపోవడంతో ఆయన ఫాలోవర్స్, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తెలంగాణ ఓటర్లకు అలర్ట్: SIR గడువును పొడిగింపు!
News· 15 Jul 2026

తెలంగాణ ఓటర్లకు అలర్ట్: SIR గడువును పొడిగింపు!

తెలంగాణ ఓటర్లకు అలర్ట్! రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పొడిగించింది. రీసెంట్ షెడ్యూల్ ప్రకారం, ఈ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ ECI అఫీషియల్ డెసిషన్ తీసుకుంది. బీఎల్ఓ (BLO)ల డోర్-టు-డోర్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత పక్కాగా పూర్తి చేసేందుకు, ప్రజల్లో అవేర్‌నెస్ పెంచేందుకు ఈ ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. అర్హులైన సిటిజన్స్ ఈ డెడ్‌లైన్ లోపు తమ ఓటర్ కార్డు వివరాలను చెక్ చేసుకుని, అప్‌డేట్ చేసుకోవచ్చు.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు: పాడె మోసిన YS జగన్!▶
News· 15 Jul 2026

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు: పాడె మోసిన YS జగన్!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన సొంతూరు కిర్లంపూడిలో జరిగాయి. YCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి ఈ అంతిమయాత్రకు హాజరై, ముద్రగడ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణతో కలిసి జగన్ ముద్రగడ పాడె మోశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ముద్రగడ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు ముగిసే వరకు జగన్ అక్కడే ఉన్నారు.

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ
TG· 15 Jul 2026

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ

TG: హిందూ ధర్మాన్ని జై భారత్ మూమెంట్ ద్వారా ప్రచారం చేస్తున్న ‘విజయవిహారం’ రమణమూర్తి మీద ఒక ఛానెల్లో జరిగిన దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయ్. హిందుత్వవాదుల దాడుల్నిని ఖండిస్తూ గురువారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన సభ నిర్వహిస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (KVPS), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(TPSK) సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే  నిందితుడికి బెయిల్
Politics· 15 Jul 2026

కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే నిందితుడికి బెయిల్

TG: కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే రంగారెడ్డి జిల్లా షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చిందని BRS పార్టీ జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్‌కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడన్నారు. కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను రక్షించాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు
TG· 15 Jul 2026

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు

TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు సరఫరా చేసింది. అయితే, ఆ చీరలు పంపిణీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ స్టోర్‌రూమ్ పక్కన చెత్తకుప్పలో పడేయడం తీవ్ర కలకలం రేపింది. సుమారు 30వేలకుపైగా చీరలు అక్కడ ఉన్నట్లు సమాచారం. మహిళల కోసం లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలు మహిళలకు ఇవ్వకుండా చెత్తకుప్పలో పడేయడం పట్ల మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం
Crime· 15 Jul 2026

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం

TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్ స్పాట్‌లోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు SI శివకుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్ళిన బండ్ల గణేష్!
News· 15 Jul 2026

సుప్రీంకోర్టుకు వెళ్ళిన బండ్ల గణేష్!

ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ చర్యలను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద ఇప్పటికే దాదాపు ₹129.02 కోట్లు బ్యాంకు వసూలు చేసిందని, బకాయిలు తీరిపోయినా తన ఆస్తిని అన్యాయంగా వేలం వేశారని బండ్ల గణేష్ వాదిస్తున్నారు. అంతకుముందు హైకోర్టు బ్యాంక్ చర్యలను సమర్థించడంతో, ఇప్పుడు ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హసీనా వస్తే ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!
Politics· 15 Jul 2026

హసీనా వస్తే ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వచ్చి, తన 'అవామీ లీగ్' పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె రాకను స్వాగతిస్తున్నామని, అయితే దేశంలోకి వస్తే ఉరిశిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో విచారణ పారదర్శకంగా ఉంటుందని, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి వరల్డ్ బెస్ట్ లాయర్లను తెచ్చుకోవచ్చని, కోర్టులో వాదనలను బట్టి తీర్పు మారే ఛాన్స్ కూడా ఉందని పేర్కొన్నారు.

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌
TG· 15 Jul 2026

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌

TG: కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ ZPHSలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వంటగది మొత్తం వ్యాపించడంతో వంట సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులు ఉన్నారు. సకాలంలో మంటలను అర్పివేయడం, సిలిండర్ పేలకుండా రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నిరాహార దీక్షతో దేశాన్ని కదిలించిన నాయకులు!
Politics· 15 Jul 2026

నిరాహార దీక్షతో దేశాన్ని కదిలించిన నాయకులు!

మహాత్మా గాంధీ నుంచి అన్నా హజారే వరకు, నిరాహార దీక్షలు భారత రాజకీయాలను మార్చిన శక్తివంతమైన ఆయుధంగా నిలిచాయి. తెలంగాణ కోసం కె. చంద్రశేఖర్ రావు (KCR) 2009లో చేపట్టిన 11 రోజుల ఆమరణ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి భారీ ఊపు ఇచ్చి, చివరికి తెలంగాణ ఆవిర్భావానికి కీలక మలుపైంది. అలాగే పొట్టి శ్రీరాములు, ఇరోమ్ షర్మిల, అన్నా హజారే దీక్షలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఎక్స్‌పైరీ ఫుడ్ కలర్స్‌తో ఐస్‌క్రీమ్
Crime· 15 Jul 2026

ఎక్స్‌పైరీ ఫుడ్ కలర్స్‌తో ఐస్‌క్రీమ్

TG: HYDలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఓ కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడిచేశారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, వివిధ రకాల ఫ్లేవర్లను ఉపయోగించడంతో పాటు, పూర్తిగా ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన పద్ధతుల్లో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు, ఎలాంటి లేబుళ్లు లేని ముడి పదార్థాలు, భారీ మొత్తంలో లూజ్ టూటీ ఫ్రూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీమ్ యూనిట్‌ను సీజ్ చేసి నిర్వాహకుడు మందుల రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ వ్యవహారం.. యువకుడి హత్య
Crime· 15 Jul 2026

ప్రేమ వ్యవహారం.. యువకుడి హత్య

TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ (29) హైదరాబాద్‌లోని మాదాపూర్‌‌లో ఓ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వగ్రామానికి చెందిన యువతితో పరిచయం ప్రేమగా మారింది. దీంతో కుటుంబసభ్యులు యువతికి మరో యువకుడితో వివాహం చేశారు. భార్యాభర్తలకు గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. అయితే తన కూతురి విడాకులకు భాస్కర్ కారణమని ఆమె తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. ఐదుగురు వ్యక్తులు వచ్చి కర్రలు, కత్తులతో భాస్కర్‌పై విచక్షణారహితంగా పొడిచి చంపారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
Politics· 15 Jul 2026

భారీగా పెరిగిన బంగారం ధరలు!

గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ ఈరోజు (బుధవారం) సడన్‌గా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹770 పెరిగి ₹1,43,570కి చేరింది. అలాగే 22 క్యారెట్లపై ₹700 పెరిగి ₹1,31,600 వద్ద, 18 క్యారెట్లపై ₹570 పెరిగి ₹1,06,670 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు, కాబట్టి షాపింగ్‌కు వెళ్లే ముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర.

కాకతీయ వైభవాన్ని గుర్తుచేసేలా ఎయిర్‌పోర్ట్
Politics· 15 Jul 2026

కాకతీయ వైభవాన్ని గుర్తుచేసేలా ఎయిర్‌పోర్ట్

TG: దిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా భూసేకరణ చేసిన రేవంత్‌రెడ్డిని రామ్మోహన్ నాయుడు అభినందించారు. ప్రధాన భవనాల నిర్మాణానికి నాలుగు వారాల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 2028 జూన్‌కల్లా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ తనను కోరినట్టు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టును కాకతీయ వైభవం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

చిన్నవయసులోనే గుండెపోటు..ఎందుకు?
Health· 15 Jul 2026

చిన్నవయసులోనే గుండెపోటు..ఎందుకు?

2025 నివేదికల ప్రకారం ఇండియాలో 25 శాతం గుండెపోట్లు 40 ఏళ్లలోపు ఉన్నవారికే వస్తున్నాయి. ఇతర ఖండాలతో పోలిస్తే దక్షిణాసియా ప్రజలు దాదాపు ఒక దశాబ్దం ముందే కరోనరీ ఆర్టరీ వ్యాధి బారిన పడుతున్నారు. యువకులలో ‘సైలెంట్ హార్ట్ ఎటాక్స్’ పెరుగుతున్నాయి. ఇవి అజీర్ణం, స్వల్ప ఆయాసం లాంటి లక్షణాలతో నిశ్శబ్దంగా బయటపడతాయి. రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సిగరెట్‌ను మానుకోవడం వంటివి ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఓటు హక్కును కాపాడుకోండి
TG· 15 Jul 2026

ఓటు హక్కును కాపాడుకోండి

TG: చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా మీ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫారాల పంపిణీకి 10 రోజుల గడువు మాత్రమే ఉందని, ఈలోపు ఎన్యూమరేషన్ పత్రాలని సమర్పించాలని కోరారు. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకు మంగళవారం సాయంత్రానికి 49.28 శాతం మంది ఓటర్లు వారి ఎన్యూమరేషన్ ఫామ్‌లను సమర్పించారని ప్రకటించారు. మిగతా ఓటర్లు వెంటనే పత్రాలను నింపి బీఎల్‌వోలకు అందించాలని సీఈవో ఓటర్లకు సూచించారు.

18వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
Politics· 15 Jul 2026

18వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటివరకు ఆయన 8 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం. మరోవైపు కొంతమంది ప్రముఖులు దీక్ష విరమించాలని కోరగా, ప్రభుత్వం చర్చలకు రావాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు.

అమర చిత్రకథలోకి HAL కొత్త కామిక్ రిలీజ్
India· 15 Jul 2026

అమర చిత్రకథలోకి HAL కొత్త కామిక్ రిలీజ్

ప్రముఖ కామిక్ సిరీస్ అమర చిత్రకథ వచ్చే నెలలో 'HAL: The Force Behind the Forces' పేరుతో కొత్త కామిక్‌ను రిలీజ్ చేస్తోంది. భారత విమానయాన రంగంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) 86 ఏళ్ల ప్రయాణం, తేజస్, ప్రచండ్, ధ్రువ్ వంటి స్వదేశీ విమానాల అభివృద్ధి, అంతరిక్ష రంగంలో సంస్థ రోల్‌ను ఇందులో వివరించనున్నారు. కొత్తతరం యువతకు భారత వైమానిక రంగ చరిత్రను చెప్పడమే ఈ కామిక్ లక్ష్యంగా పేర్కొన్నారు.