← Back to news

కాకతీయ వైభవాన్ని గుర్తుచేసేలా ఎయిర్‌పోర్ట్

By MAHESH· 15 Jul 2026· DELHI
కాకతీయ వైభవాన్ని గుర్తుచేసేలా ఎయిర్‌పోర్ట్

TG: దిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా భూసేకరణ చేసిన రేవంత్‌రెడ్డిని రామ్మోహన్ నాయుడు అభినందించారు. ప్రధాన భవనాల నిర్మాణానికి నాలుగు వారాల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 2028 జూన్‌కల్లా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ తనను కోరినట్టు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టును కాకతీయ వైభవం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

More in Politics