← Back to news

ఓటు హక్కును కాపాడుకోండి

By MAHESH· 15 Jul 2026
ఓటు హక్కును కాపాడుకోండి

TG: చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా మీ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫారాల పంపిణీకి 10 రోజుల గడువు మాత్రమే ఉందని, ఈలోపు ఎన్యూమరేషన్ పత్రాలని సమర్పించాలని కోరారు. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకు మంగళవారం సాయంత్రానికి 49.28 శాతం మంది ఓటర్లు వారి ఎన్యూమరేషన్ ఫామ్‌లను సమర్పించారని ప్రకటించారు. మిగతా ఓటర్లు వెంటనే పత్రాలను నింపి బీఎల్‌వోలకు అందించాలని సీఈవో ఓటర్లకు సూచించారు.

More in TG