EMI కట్టలేకపోతే వెంటనే ఈ పని చేయండి!

ఇల్లు, కార్, బిజినెస్ లోన్ EMIలు టైమ్‌కి కట్టకపోతే బ్యాంకులు లేట్ ఛార్జీలు వేస్తాయి. ఒక్క EMI మిస్ అయినా మెసేజ్ ఇచ్చి అలర్ట్ చేస్తారు. 90 రోజులు దాటితే ఆ లోన్ అకౌంట్‌ను డేంజర్ జోన్ (NPA)లో పెడతారు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో లోన్స్, క్రెడిట్ కార్డ్స్ రావడం కష్టమవుతుంది. అందుకే ఈ ప్రాబ్లమ్ రాకముందే బ్యాంక్‌ను విజిట్ చేసి మాట్లాడి, EMI కట్టే డేట్ మార్చుకోవాలి. కొత్త లోన్ తీసి పాత EMIలు కడితే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదవుతుంది.


