Latest

'కల్మా' హోంవర్క్‌పై రాజాసింగ్ ఫైర్▶
Politics· 16 Jul 2026

'కల్మా' హోంవర్క్‌పై రాజాసింగ్ ఫైర్

TG: హైదరాబాద్‌ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌ విద్యార్థులకు టీచర్ 'కల్మా' హోంవర్క్‌ ఇవ్వడంపై గోషామహల్ MLA రాజాసింగ్ ఫైరయ్యారు. కొన్ని శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనే స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, అలాగే హిందూ సముదాయాలపై ఈ విధంగా దాడులు, ప్రయోగాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందంటూ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో చిన్నారులపై ఇలాంటి మతపరమైన బోధనలు ఏంటని ప్రశ్నించారు. సక్సెస్ స్కూల్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలన్నారు.

తెలంగాణ అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!
Politics· 16 Jul 2026

తెలంగాణ అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

తెలంగాణలోని అన్ని అంగన్‌వాడీల్లో వచ్చే నెల (ఆగస్టు) నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని టెస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నారులకు హై-క్వాలిటీ ఫుడ్ అందించడమే తమ గవర్నమెంట్ మెయిన్ గోల్ అని సీతక్క స్పష్టం చేశారు. ఒకవేళ పాలు, గుడ్లు, ఇతర సరకుల సప్లైలో నాణ్యత లోపిస్తే సదరు కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య
Crime· 16 Jul 2026

పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య

TG: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సందీప్ ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్
TG· 16 Jul 2026

13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ డివిజన్‌లోని వెంకటాద్రినగర్‌లో 1200 గజాల పార్కు స్థలం గత13 ఏళ్ల నుంచి కబ్జాకు గురైంది. వెంకటాద్రి నగర్ కాలనీ వాసుల సుదీర్ఘ పోరాటం ఫలిచింది. స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు TPCC ప్రచార కమిటీ ఛైర్మన్, ఎల్బీనగర్ ఇంఛార్జ్ మధు యాష్కి గౌడ్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాకు గురైన ఆ స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

వేస్ట్ ఫుడ్ బయటపడేస్తే హోటళ్లు సీజ్
TG· 16 Jul 2026

వేస్ట్ ఫుడ్ బయటపడేస్తే హోటళ్లు సీజ్

TG: హైదరాబాద్ హబ్సిగూడలోని సుబ్రభాత్, అమరావతి హోటళ్లను మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలను బయట పారబోసినా, పశువుల ఫారాలకు పంపినా..వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెస్టారెంట్లు తడి వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం సొంతంగా ఇన్‌సీటు బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్లాంటు లేని హోటళ్లు జీహెచ్ఎంసీ వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్లకు మాత్రమే పంపాలని సూచించారు.

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాపై అప్‌డేట్
Cinema· 16 Jul 2026

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాపై అప్‌డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టీమ్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది. సినిమాని డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

పురిటినొప్పులతో విలవిలలాడినా పట్టించుకోలేదు▶
TG· 16 Jul 2026

పురిటినొప్పులతో విలవిలలాడినా పట్టించుకోలేదు

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని డాక్టర్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పురిటినొప్పులు ఎక్కువై నిల్చున్న చోటే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనను చూసి ఇతర రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు హాస్పిటల్‌కు వచ్చి విచారణ చేపట్టగా, వారికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

గొంతులో ఆహారం అడ్డుపడుతోందా?
Health· 16 Jul 2026

గొంతులో ఆహారం అడ్డుపడుతోందా?

ఆహారం లేదా నీరు మింగేటప్పుడు గొంతులో అడ్డుపడినట్లు అనిపిస్తుందా? మింగడం కష్టంగా ఉంటోందా? దీన్ని ‘డిస్ఫేజియా’ అని డాక్టర్లు అంటున్నారు. ఇది చిన్న ప్రాబ్లమ్‌గా కనిపించినా, కొన్నిసార్లు తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ రావచ్చని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, నరాల సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. రోజూ ఆహారం గొంతులో ఇరుక్కోవడం, దగ్గు, ఛాతీలో అసౌకర్యం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలంటున్నారు.

లంచ్ బ్యాగ్ శుభ్రంగా ఉండాలంటే చిట్కాలివే
Infotainment· 16 Jul 2026

లంచ్ బ్యాగ్ శుభ్రంగా ఉండాలంటే చిట్కాలివే

మనం రోజూ బయటకి తీసుకెళ్లే లంచ్ బ్యాగ్‌లు జిడ్డుగా మారుతుంటాయి. వాటిని క్లీన్‌గా ఉంచేందుకు, చిన్న గిన్నెలో చెంచా వెనిగర్, చెంచా నీళ్లు పోసి బాగా కలిపి దానిలో పత్తిని ముంచి, దాంతో తుడిస్తే లంచ్ బ్యాగ్ పైన ఉన్న జిడ్డు పోతుంది. దీంతోపాటు మగ్గులో గ్లాస్ వేడినీళ్లు పోసి, చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపి అందులో పాత టూత్‌బ్రష్‌ను ముంచి బ్యాగ్ జిప్‌ను తుడవాలి. దీంతో బ్యాగ్ కొత్తగా మెరుస్తుంది.

ఎంబీబీస్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్
TG· 16 Jul 2026

ఎంబీబీస్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్

TG: తెలంగాణలో ఎంబీబీస్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ శుభవార్త చెప్పింది. బుధవారం ఎంబీబీస్ సీట్లకు సంబంధించి ఎన్‌ఎంసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణలో ఏకంగా 810 ఎంబీబీస్ సీట్లను పెంచింది. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకు 110, ప్రైవేట్ కాలేజీలకు 600, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీలకు 100 సీట్లు అదనంగా కేటాయించింది. గత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 8,840 ఎంబీబీస్ సీట్లు ఉండగా, పెరిగిన సీట్లతో మొత్తం 9,650కు చేరుకున్నాయి.

'జననాయగన్' రాక కన్ఫర్మ్!
Cinema· 16 Jul 2026

'జననాయగన్' రాక కన్ఫర్మ్!

గత సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ ‘జననాయగన్’ మూవీ సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడింది. మొత్తానికి సెన్సార్ పూర్తి చేసుకొని ఈనెల 23న విడుదలవుతున్నట్లు మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. చిత్రబృందం ఇన్‌స్టాలో ఆఫిషియల్‌గా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ న్యూస్‌తో తలపతి అభిమానుల్లో సందడి మొదలైంది.

గురుకులంలో నీటి కష్టాలు▶
Education· 16 Jul 2026

గురుకులంలో నీటి కష్టాలు

TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నీటి సమస్య తీర్చాలంటూ ధర్నా చేశారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక గురుకుల పాఠశాల సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పది పది రూపాయలు చెల్లిస్తేనే రిపేర్ చేపిస్తామని HM చెప్పినట్లు వారు వాపోయారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.

మళ్లీ తగ్గిన బంగారం రేట్
India· 16 Jul 2026

మళ్లీ తగ్గిన బంగారం రేట్

బంగారం రేట్ మరోసారి తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,290గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350కి చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు, డాలర్ బలపడటం వల్ల గోల్డ్ రేట్స్ తగ్గాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గోల్డ్ కొనాలనుకునేవారికి కాస్త రిలీఫ్ దొరికింది. మరోవైపు వెండి రేటు మాత్రం పెద్దగా మారలేదు. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.40 లక్షలుగా కొనసాగుతోంది.

వారం రోజులు..నో రెయిన్స్
TG· 16 Jul 2026

వారం రోజులు..నో రెయిన్స్

TG: తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు పెద్దగా వర్షాలు పడే ఛాన్స్ లేదని వాతావరణశాఖ తెలిపింది. ఎల్‌నినో ఎఫెక్ట్, వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో చాలామంది ఏసీలు, కూలర్లు వాడడం మొదలుపెట్టారు. అయితే..ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
India· 16 Jul 2026

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్

టికెట్ బుకింగ్‌ను మరింత తేలిక చేస్తూ IRCTC వెబ్‌సైట్‌ కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు చిరాకు తెప్పించే యాడ్స్, పాప్-అప్‌ యాడ్స్ ఉండవు. దీనివల్ల తత్కాల్ టికెట్లను చాలా వేగంగా బుక్ చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ సీట్ల వివరాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తాయి. రెగ్యులర్ ప్రయాణికుల వివరాలు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసేలా కెపాసిటీ పెంచారు. ఈ కొత్త బీటా వెర్షన్ లింక్ ప్రస్తుత IRCTC వెబ్‌సైట్‌లో ఉంది.

ట్రీట్‌మెంట్ అంటూ..మెడ కొరికిన డాక్టర్
TG· 16 Jul 2026

ట్రీట్‌మెంట్ అంటూ..మెడ కొరికిన డాక్టర్

TG: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఆరు నెలల గర్భిణికి ముఖం, మెడ మీద వాపు రావడంతో లోకల్‌ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అతను ట్రీట్‌మెంట్ పేరుతో ఆమె మెడను పళ్లతో దారుణంగా కొరికేశాడు. దీంతో ఆమె కండిషన్ క్రిటికల్ అయ్యింది. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడి డాక్టర్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటిలేటర్‌పై ఉంచి, అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్‌తో ఆమె ప్రాణాలు కాపాడారు.

జులై 20న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్
Sports· 16 Jul 2026

జులై 20న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ స్టార్ట్ అయింది. జూలై 20న న్యూజెర్సీ వేదికగా జరిగే ఈ మెగా క్లాష్‌లో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా, డిఫెన్స్‌తో దూసుకెళ్తున్న స్పెయిన్‌తో తలపడనుంది. సెమీస్‌లో ఫ్రాన్స్‌కు స్పెయిన్ చెక్ పెట్టగా ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి అర్జెంటీనా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలిస్తే బ్రెజిల్(1958, 1962) తర్వాత వరుసగా రెండు వరల్డ్ కప్‌లు కొట్టిన టీమ్‌గా అర్జెంటీనా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఇది వాళ్ళ నాలుగో టైటిల్ అవుతుంది.

19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ హంగర్ స్ట్రైక్▶
India· 16 Jul 2026

19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ హంగర్ స్ట్రైక్

సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ 19వ రోజుకు చేరింది. ఆయన దాదాపు 9 కిలోలు బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని డాకర్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్యానికి రిస్క్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఇప్పుడే హంగర్ స్ట్రైక్ ఆపనని వాంగ్‌చుక్ చెప్పారు. ఇంకా 2–4 రోజుల్లో చనిపోయే పరిస్థితి లేదని, తన కోసం టెన్షన్ పడొద్దని వీడియో రిలీజ్ చేశారు.

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు
TG· 16 Jul 2026

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు

TG: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కల్మా చదువుకుని రావాలని ఓ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మత ప్రార్థనలను కూడా నేర్చుకుని రావాలని విద్యార్థి డైరీలో రాసి పంపించింది. అయితే ఆ డైరీ చూసిన విద్యార్థి పేరెంట్స్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని, అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారని ఫైరయ్యారు. కల్మా హోమ్‌వర్క్ చేయాలని ఒత్తిడి చేసిన టీచర్‌ను వెంటనే తొలగించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

యువకుడు దారుణ హత్య
Crime· 16 Jul 2026

యువకుడు దారుణ హత్య

AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్(28) తన అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చాడు. ఓ దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. తన చెల్లిపై ఎందుకు కామెంట్ చేశారని రాకేష్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. అమ్మమ్మ ఖననం కోసం స్మశాన వాటికకు వెళ్లిన రాకేష్‌పై వంశీ అనే యువకుడు, మరో నలుగురు చాకులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

మాజీ మంత్రిపై కేసు నమోదు
AP· 16 Jul 2026

మాజీ మంత్రిపై కేసు నమోదు

AP: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే క్రమంలో అంబటి రాంబాబు, YCP నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. తమ విధులకు ఆటకం కలిగించారని, తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో FIR నమోదైంది.