Latest
సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా సోనాక్షి సిన్హా!
18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మద్దతు ఇచ్చారు. దేశం కోసం ఎంతో చేసిన వాంగ్‌చుక్ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. "నేను కూడా ఈ దేశ పౌరురాలినే, ఇకపై నేను మౌనంగా ఉండలేను" అంటూ వాంగ్‌చుక్ మరియు యువత చేస్తున్న నిరసనలకు మద్దతుగా సోనాక్షి ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 100+ కి గాయాలు!
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. రథయాత్ర చూడటానికి జనాలు భారీగా రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వాళ్లని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

అందరం కలిసికట్టుగా పోరాడాలి
TG: హిందూ మతంలో సంస్కరణ తీసుకురావాలని పోరాడే ‘విజయవిహారం’ రమణమూర్తిపై దాడి చేయడం బాధాకరమని సామాజికవేత్తలు, మేధావులు అన్నారు. రమణమూర్తిపై హిందూత్వ ఉన్మాది దాడి ఘటనకు ఖండనగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో సామాజికవేత్తలు, కళాకారులు, మేధావులు మాట్లాడుతూ భౌతిక దాడి చేసే శక్తులపై రమణమూర్తితో కలిసి అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

డ్రగ్స్ కేసులో MLC కొడుకు? అసలు నిజం చెప్పిన తండ్రి!
తన కొడుకు భరత్ రాజ్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడనే వార్తలను MLC వెంకట్రాంరెడ్డి ఖండించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ కోసం ఈరోజు పోలీసులు తమ ఇంటికి వచ్చారని, భరత్ కామన్ ఫ్రెండ్స్ ఫోన్ లిస్ట్‌లో నెంబర్ ఉండటంతోనే ఎంక్వైరీ చేశారని చెప్పారు. ఈ కేసుతో భరత్ కి ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిందని పోలీసులు క్లియర్ చేశారన్నారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకోలేదని, దయచేసి అవాస్తవాలు నమ్మవద్దని కోరారు.
గోల్కొండ బోనాలు స్టార్ట్!
హైదరాబాద్‌లో ఆషాడ బోనాల పండుగ గ్రాండ్‌గా మొదలైంది. లంగర్ హౌస్ చౌరస్తా దగ్గర తెలంగాణ గవర్నమెంట్ తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కలిసి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ బోనాల ఓపెనింగ్ ఈవెంట్‌లో గవర్నమెంట్ అడ్వైజర్ వి. హనుమంతరావు, MLA దానం నాగేందర్, మధు యాష్కీ గౌడ్, మరికొందరు లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. బోనాలు స్టార్ట్ కావడంతో గోల్కొండ ఏరియా అంతా భక్తులతో ఫుల్ రష్‌గా మారింది. అక్కడ పండుగ వైబ్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

9వ తరగతిలో 'థర్డ్ లాంగ్వేజ్' వద్దన్న సుప్రీంకోర్టు!
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ఈ కీలక దశలో కొత్త లాంగ్వేజ్ నేర్పించడం స్టూడెంట్స్‌పై ఎక్స్‌ట్రా ప్రెజర్ పెంచుతుందని కేంద్రానికి సూచించింది. CBSE తీసుకొచ్చిన త్రీ-లాంగ్వేజ్ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ కామెంట్స్ చేసింది. చిన్న క్లాసెస్ నుంచే దీన్ని అమలు చేస్తే బెటర్ అని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై తదుపరి విచారణలో కేంద్రం, CBSE తమ డెసిషన్‌ను చెప్పనున్నాయి.

‘విజయవిహారం’ రమణమూర్తిపై దాడి..18న శాంతియుత నిరసన
TG: రచయిత, జర్నలిస్టు, సామాజికవేత్త ‘విజయవిహారం’ రమణమూర్తిపై హిందూత్వ ఉన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనకు ఖండనగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో సామాజికవేత్తలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. దీంతోపాటు ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నారు.

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. మరో రాజ్యసభ MP రిజైన్!
బెంగాలీ స్టార్ హీరోయిన్, TMC రాజ్యసభ MP రుక్మిణి మల్లిక్ తన పదవికి సడన్‌గా రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే MPగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె, 4 నెలలు తిరక్కుండానే క్విట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా TMC నుండి రిజైన్ చేసిన 4వ MP రుక్మిణి మల్లిక్. అయితే ఈ సంచలన నిర్ణయంపై మమతా బెనర్జీ టీమ్ ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.

అయోధ్యలో అవినీతి వాళ్లకు సమస్య: ‘విజయవిహారం’ రమణమూర్తి
TG: తనపై దాడి చేసినవాళ్లకు రాముడు, కృష్ణుడు ముఖ్యం కాదని.. వాళ్లకు సమస్యంతా అయోధ్యలో అవినీతి అని ‘విజయవిహారం’ రమణమూర్తి అన్నారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చాలామంది తెలియనివాళ్లు తనకు కాల్ చేసి బెదిరిస్తున్నారని, అయినా తను భయపడనని అన్నారు.

హిందూ మతంలో విమర్శకు చోటుంది: ‘విజయవిహారం’ రమణమూర్తి
TG: హిందూ మతంలో విమర్శకు చోటు ఉంది కానీ, దుర్భాషలకు చోటు లేదని ‘విజయవిహారం’ రమణమూర్తి అన్నారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎవరిపైనా దాడి చేయకూడదని కోరారు. మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మామూలు చర్చలు సరిపోవని, మతపెద్దల దగ్గరకు వెళ్ళి సంస్కరణపై చర్చించాలన్నారు.
ట్యాంకర్లతో వరి నారుకు నీరు
TG: ఎల్‌నినో ఎఫెక్ట్, రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో రైతు బాలకృష్ణ తన వరి నారును బతికించడం కోసం ట్యాంకర్లతో పారిస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటేందుకు సిద్ధం చేసిన వరి నారు ఎండిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పోస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.

అప్పుడు రంగరాజన్‌పై..ఇప్పుడు నాపై: ‘విజయవిహారం’ రమణమూర్తి
TG: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి చేసినప్పుడు, దాన్ని ఖండిస్తూ ఇక్కడికి వచ్చాననని..ఇవాళ తనపై జరిగిన దాడికి ఖండన తెలుపుతున్నారని ‘విజయవిహారం’ రమణమూర్తి తెలిపారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది చూస్తున్న లైవ్ ప్రోగ్రాంలో ఇలా దాడి చేసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో గమనించాలని అన్నారు.
సోనమ్ వాంగ్చుక్‌కు సపోర్ట్‌గా అతుల్ కుల్కర్ణి దీక్ష!
ఫేమస్ యాక్టర్ అతుల్ కుల్కర్ణి సోనమ్ వాంగ్చుక్ పోరాటానికి మద్దతుగా జూలై 16న తన నివాసంలోనే ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. వాంగ్చుక్ పడుతున్న బాధను పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తన సున్నితత్వాన్ని చాటుకుని వెంటనే చర్చలు జరపాలని ఆయన కోరారు. చర్చలు జరపడం అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ అంటూ పోస్ట్ చేశారు. ఈ నిరసనకు అందరూ సపోర్ట్ చేయాలని #DardSeDardKaRishta హ్యాష్ ట్యాగ్‌తో ఆయన పిలుపునిచ్చారు.

అమ్మవారి తాళిబొట్టు కూడా వదల్లేదు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఎల్లమ్మ టెంపుల్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టిన దొంగలు CCTV కెమెరాలను ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఏళ్ల తరబడి హుండీ లెక్కింపు చేపట్టకపోవడంతో అందులో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం. దుండగులు ఆ హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోనమ్ వాంగ్చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
సోనమ్ వాంగ్చుక్ హెల్త్ కండిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ చేస్తున్న ఈ నిరాహార దీక్షలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దాఖలైన PILపై కోర్టు స్పందించింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైందని, వాంగ్చుక్‌కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన ట్రీట్‌మెంట్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆల్రెడీ ప్రభుత్వ డాక్టర్లు ఆయన హెల్త్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు కన్ఫర్మ్ చేశారు.

‘విజయవిహారం’ రమణమూర్తిపై దాడి దారుణం
TG: ‘విజయవిహారం’ రమణమూర్తిపై హిందూత్వ ఉన్మాది దాడి చేయడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సామాజికవేత్తలు తెలిపారు. రాజకీయాలకు, మతానికి, దేవుళ్ళకు ఎందుకు ముడి పెడుతున్నారని ప్రశ్నించారు. దాడి ఘటనకు ఖండనగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ‘కృష్ణుడి తలకాయ తీసేసి మోదీ తల పెట్టి అవమానిస్తున్నారు’ అని అడిగినందుకు చెప్పుతో దాడి చేస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.
సోనమ్ వాంగ్చుక్ దీక్షకు యాక్టర్ సయాజీ షిండే సపోర్ట్!
18 రోజులుగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షకు నటుడు సయాజీ షిండే తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వాంగ్చుక్ వాయిస్‌ను గవర్నమెంట్ వినాలని, వెంటనే చర్చలు జరపాలని ఆయన కోరారు. శాంతి మార్గంలో కూడా విప్లవం తేవచ్చని వాంగ్చుక్ మరోసారి ప్రూవ్ చేశారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా వాంగ్చుక్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాయిస్ రైజ్ చేస్తున్నారు.

ప్రోటీన్‌ను రీప్లేస్ చేస్తున్న పెప్టైడ్స్
హెల్త్ అండ్ ఫిట్‌నెస్ రంగంలో 'ప్రోటీన్' చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ బార్లు, పౌడర్లు, స్నాక్స్ అంటూ మార్కెట్‌లో చాలా వస్తువులు దొరుకుతున్నాయి. ఇదంతా నిన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని 'పెప్టైడ్స్’ రీప్లేస్ చేస్తున్నాయి. బరువు తగ్గాలన్నా, మెరిసే చర్మం కావాలన్నా, కండరాల రికవరీ జరగాలన్నా పెప్టైడ్స్ ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో ప్రమోషన్ జరుగుతోంది. శరీరం కరెక్ట్‌గా పనిచేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు.

APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?
APలో పోలీసుల తీరుపై వరుస ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలులో బొల్లి ఏడుకొండలు పోలీస్ కస్టడీలో మృతిచెందగా, అది లాకప్ డెత్ అని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం ఆయన విషం తాగాడని చెబుతున్నారు. మరోవైపు పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపిస్తోంది. రెండు ఘటనలపైనా పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భార్యే విలనా? హై-సెక్యూరిటీ ఇంట్లో డాక్టర్ హత్య!
కర్ణాటక ధార్వాడ్‌లోని ఓ హై-సెక్యూరిటీ అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ కిరణ్ (45) కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఆయన 8 ఏళ్ల కొడుకుపై కూడా కత్తితో దాడి జరగడంతో హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. ఇన్సిడెంట్ టైంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని, కేవలం భార్య ప్రియాంక మాత్రమే ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. బంధువుల ఫోన్లకు ఆమె పొంతన లేని ఆన్సర్స్ ఇవ్వడంతో ఈ కేసులో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నయి. ఫ్యామిలీ గొడవలే రీజన్ అని డౌట్ పడుతున్న పోలీసులు.. భార్యనే హత్య చేసి ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు.

కరోనా కలకలం.. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు
AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తికి డాక్టర్స్ చికిత్స అందించారు. బాధితుడిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు. ఇటీవల జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఎయిమ్స్ డాక్టర్స్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, జ్వరంతో వచ్చే రోగులకు ఇక్కడే ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్‌లో కరోనా కలకలం రేపడంతో గుంటూరు (GGH) వైద్యులు అలెర్ట్ అయ్యారు.