Latest

పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్!
AP· 11 Jul 2026

పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్!

AP ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబైలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ కారణంగా డాక్టర్లు శనివారం మూడున్నర గంటలపాటు ఈ ఆపరేషన్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్స్ చేతులు పట్టి లాగడంతో పవన్ భుజాలకు గాయాలయ్యాయి. పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని మరో భుజానికి రెండు నెలల తర్వాత సర్జరీ చేయనున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

గూగుల్ డ్రైవ్‌లో ఇవి పెడితే జైలే!
Legal· 11 Jul 2026

గూగుల్ డ్రైవ్‌లో ఇవి పెడితే జైలే!

గూగుల్ డ్రైవ్‌ను సేఫ్ అనుకుంటే పొరపాటే. UPకి చెందిన ఓ యువకుడు తన డ్రైవ్‌లో 15 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను స్టోర్ చేశాడు. దీనిపై అలర్ట్ అయిన గూగుల్ టీమ్ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పోలీసులు IMEI నంబర్, IP అడ్రస్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ కంటెంట్‌ను గూగుల్ అకౌంట్స్‌లో పెడితే జైలు శిక్ష తప్పదు. డిజిటల్ స్పేస్‌లో ప్రైవసి రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.

నేరెళ్ల బాధితుడు కన్నుమూత
TG· 11 Jul 2026

నేరెళ్ల బాధితుడు కన్నుమూత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017 జూలైలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక లారీలు అడ్డుకున్న దళితులను పోలీసులు తీవ్రంగా హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత పరిణామాలు పెద్ద వివాదంగా మారాయి. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. గోపాల్ మృతితో మిగిలిన బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
Politics· 11 Jul 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹490, 22 క్యారెట్లపై ₹450, 18 క్యారెట్లపై ₹370 చొప్పున ప్రైస్ తగ్గింది. ప్రెసెంట్ లేటెస్ట్ రేట్స్ చూస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,44,330 దగ్గర, 22 క్యారెట్లు ₹1,32,300 దగ్గర, అలాగే 18 క్యారెట్లు ₹1,08,250 గా ఉంది. షాపింగ్ ప్లాన్ చేసుకునే వారు మార్కెట్ రేట్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి.

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్
Crime· 11 Jul 2026

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్

AP: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు రేవులో వెల్డింగ్ పనులు చేసే ఆనంద్‌కు సినిమాలు చాలా ఇష్టం. ఎప్పటికైనా తానే ఓ మూవీ తీయాలనుకున్నాడు. దీంతో చోరీల బాటపట్టాడు. షాపింగ్ మాల్సే టార్గెట్‌గా అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ మాల్‌లో నగదు చోరీ చేశాడు. ఇలా దోపిడీలు చేసి కూడగట్టిన రూ.2.5 కోట్లతో హీరో, దర్శకుడిగా రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబర్ 13 అనే హారర్ మూవీ తీశాడు. అప్పులు పెరగడంతో మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికాడు. బెంగళూరు-అనంతపురం హైవేపై నిందితుడిని అరెస్ట్ చేశారు. లాడ్జిల్లో ఉంటే దొరుకుతానని కారులోనే తిరిగేవాడని పోలీసులు తెలిపారు.

తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా..?
Politics· 11 Jul 2026

తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా..?

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుహత్యల ఘటనపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నగర శివారులో ఒకేరోజు ఆరుహత్యలు జరగడం రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు ఇన్ని హత్యలు చేస్తున్నా నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని ఆపలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఆరుగురి హత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి.. CM, హోంమంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్
TG· 11 Jul 2026

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్

TG: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. కారు డ్రైవర్ సహా, అందులో ఉన్నవారు వెంటనే కిందికు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. వెంటనే క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కవితను అడ్డుకున్న అధికారులు.. సింగరేణిలో టెన్షన్
Politics· 11 Jul 2026

కవితను అడ్డుకున్న అధికారులు.. సింగరేణిలో టెన్షన్

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి JVR OC-2లో TRS చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకుంది. సింగరేణి అధికారులు కవితను లోపలికి అనుమతించలేదు. దీంతో TRS శ్రేణులతో గేట్ తాళాలు బద్దలు కొట్టి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. కార్మికుల సమస్యలపై ఆమె మాట్లాడారు. సత్తుపల్లి సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను అణగదొక్కుతోందని, ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కవిత అన్నారు.

రాస్తారోకోతో ట్రాఫిక్‌జామ్.. షాబాద్‌లో హైటెన్షన్
TG· 11 Jul 2026

రాస్తారోకోతో ట్రాఫిక్‌జామ్.. షాబాద్‌లో హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో ఆరుగురి హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. షాబాద్ -షాద్‌నగర్ ప్రధాన రహదారిపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు చేపట్టిన రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఉద్రిక్తత నెలకుంది. షాబాద్ నుంచి సర్దార్‌నగర్, షాద్‌నగర్, ఎల్లికట్ట వరకు, మరోవైపు నాగల్‌గూడ వరకు సుమారు 12KM మేర వాహనాలు ఎక్కడికక్కడ భారీగా నిలిచిపోయాయి. పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు.

అంగన్‌వాడీలపై CI వివాదాస్పద వ్యాఖ్యలు
AP· 11 Jul 2026

అంగన్‌వాడీలపై CI వివాదాస్పద వ్యాఖ్యలు

AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నంద్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. CITU ఆధ్వర్యంలో 600మందికి పైగా అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. వినతిపత్రాన్ని కలెక్టర్ స్వీకరించకుండానే వెళ్లిపోయారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఓ అంగన్వాడీ కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో మరింత ఉద్రిక్తంగా మారింది. అంతేకాకుండా, నంద్యాల 3 టౌన్ CI వేణుగోపాల్ అంగన్వాడీలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చారా, నన్ను ఏం చేయలేరంటూ దురుసగా ప్రవర్తించారు. CI , లేడీ కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్రికెట్‌లా ఫుట్‌బాల్‌లోనూ భారత్ నంబర్-1 కావాలి▶
Sports· 11 Jul 2026

క్రికెట్‌లా ఫుట్‌బాల్‌లోనూ భారత్ నంబర్-1 కావాలి

ఇండియా ఫుట్‌బాల్ జట్టు కూడా క్రికెట్ లాగే వరల్డ్ కప్ ఆడాలని, అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఆకాంక్షించారు. మనదేశంలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, సరైన శిక్షణ, మౌలికవసతులు కల్పిస్తే ఇండియా కూడా కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఎందుకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఆడలేకపోతోందని ప్రశ్నించారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఫుట్‌బాల్‌కు కూడా దక్కాలని, మనదేశానికి ఎంతో మంది మెస్సీలు, రొనాల్డోల ప్రతిభ ఉన్న ఆటగాళ్లను తయారుచేసే సత్తా ఉందని అన్నారు.

హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
TG· 11 Jul 2026

హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. వీకెండ్ కావడం, ఖమ్మం జిల్లాలో నిన్న CM రేవంత్‌రెడ్డి సభ ఉండడంతో వాహనాల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. CM సభకు జనాలను తరలించేందుకు HYDలోని వివిధ డిపోల నుంచి వందలాది RTC బస్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. బస్సులు ఒకేసారి హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా మీదుగా బయలుదేరాయి. అప్పటికే వాహనాలతో నిండిపోయిన హైవే, ఈ బస్సులు తోడవడంతో పంతంగి టోల్‌గేట్ వద్ద పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది.

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చాడు !
TG· 11 Jul 2026

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చాడు !

పాతికేళ్ల క్రితం పొరుగు దేశంలో తీసుకున్న అప్పును గుర్తు పెట్టుకొచ్చిమరీ రిటర్న్ చేశాడో నిజాయితీ పరుడు. సౌదీలో కలసి పని చేసిన మహమ్మద్ ఇస్మాయిల్ అవసరం కోసం ఎడ్ల లచ్చన్న అనే వ్యక్తి నుంచి 25 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత కలవలేకపోయిన ఇస్మాయిల్ గుర్తు పెట్టుకుని అడ్రస్ తెలీకపోయినా గూగుల్ హెల్ప్ తీసుకుని లచ్చన్న ఇంటిని కనుగొని అమౌంట్ రిటర్న్ చేశారు. అదే టైమ్ లో గల్ఫ్ లో ఉన్న లచ్చన్నతో మాట్లాడారు. అప్పు తీర్చడానికి ఇస్మాయిల్ కేరళ నుంచి జగిత్యాలకు రావడం విశేషం.

అమ్మ నోట్స్ తో ఐఐటీ డ్రీమ్ ఫుల్ !
Education· 11 Jul 2026

అమ్మ నోట్స్ తో ఐఐటీ డ్రీమ్ ఫుల్ !

బీహార్‌కు చెందిన 17 ఏళ్ల గుంజన్ కుమార్‌కు ఊపిరితిత్తి కుప్పకూలడం, 70% చూపు తగ్గడం, మూడు నెలలు బెడ్‌రెస్ట్... వరుస కష్టాలు ఎదురైనా IIT డ్రీమ్‌ను వదల్లేదు. ఆన్‌లైన్ క్లాసులకు అతని అమ్మ గుంజా కుమారి హాజరై, చేతితో నోట్స్ రాసి చదివించింది. ఆ కష్టమే ఫలించింది. ఇప్పుడు గుంజన్ IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ సీట్ దక్కించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

చిరుత సంచారం.. తిరుమలలో హైఅలర్ట్
AP· 11 Jul 2026

చిరుత సంచారం.. తిరుమలలో హైఅలర్ట్

AP: తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి నరసింహస్వామి టెంపుల్ సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, గుంపులుగా ముందుకు సాగాలని సూచించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని TTD, ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీ సిబ్బంది నడకమార్గ పొడవునా గస్తీ నిర్వహిస్తూ, CC కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయొద్దు
Politics· 11 Jul 2026

రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయొద్దు

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయడం క్షమించరాని నేరమని మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయలేని తన చేతగానితనాన్ని CM రేవంత్ రెడ్డి అబద్ధాలతో కప్పిపుచ్చాలని చూడటం హీనమైన చర్య అని అన్నారు. 28లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని, ఇప్పుడు వస్తున్న లక్ష క్యూసెక్కుల వరదకు ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్‌ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు
Crime· 11 Jul 2026

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక.. రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16న తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్‌‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. తనపై ఫోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన రాజ్ కుమార్ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక కుటుంబంలోని ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బాలికను హత్య చేసే ముందు పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని కూడా హత్య చేశాడు.

పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా?
News· 11 Jul 2026

పచ్చబొట్టు ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులా?

పచ్చబొట్టు ఉందన్న కారణంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారుల ప్రమోషన్ను నిలిపివేయడాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో కొత్తగా చేరేవారికీ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పచ్చబొట్టు వేయించుకోవడం తప్పుకాదని, కానీ అది శరీరంలో ఎక్కడ ఉంది, ఏ పరిమాణంలో ఉందనే అంశాల ఆధారంగానే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది...

అరటికి గ్లోబల్ క్రేజ్- ఎన్నెన్నో వెరైటీస్ !
General· 11 Jul 2026

అరటికి గ్లోబల్ క్రేజ్- ఎన్నెన్నో వెరైటీస్ !

అరటిపండు ఇప్పుడు ఫ్రూట్ మాత్రమే కాదు.. ఫుల్ ట్రెండ్! కాఫీలు, మాక్‌టెయిల్స్, చిప్స్, క్యాండీలు, ఐస్‌క్రీమ్‌లు, ప్రోటీన్ బార్స్.. ఇలా ఎక్కడ చూసినా Banana ఫ్లేవర్ హవా నడుస్తోంది. అమెరికాలో కేఫేలు, సూపర్‌మార్కెట్లలో Banana ప్రొడక్ట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. నిపుణుల మాటల్లో.. తీపి రుచి, నాస్టాల్జియా ఫీలింగ్, సోషల్ మీడియా ట్రెండ్ కలిసి Bananaని 2026లో హాట్ ఫుడ్ ఫ్లేవర్‌గా మార్చేశాయి.

వింత ఆచారం.. వర్షాల కోసం ఏం చేశారంటే..?
AP· 11 Jul 2026

వింత ఆచారం.. వర్షాల కోసం ఏం చేశారంటే..?

AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో వర్షాలు కురవాలని పెళ్లి కాని యువకులు 108 బిందెల నీటితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుగురు పెళ్లి కాని యువకులు 108 బిందెలతో నీటిని మోసుకొచ్చి శమీ వృక్షం, నాగుల కట్టకు జలాభిషేకం చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టి, 108 నిమ్మకాయలతో పూజలు చేశారు. కొత్త కుండను జొన్నలపై ఉంచి నీటితో నింపి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. జమ్మి అంకాలమ్మ అనుగ్రహంతో వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని కోరారు.

ఫేస్ బుక్, ఇన్ స్టా ఫీచర్లపై ఈయూ కమిషన్ ఫైర్ !
News· 11 Jul 2026

ఫేస్ బుక్, ఇన్ స్టా ఫీచర్లపై ఈయూ కమిషన్ ఫైర్ !

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లైన ఫేస్ బుక్ ఇన్ స్టా గ్రామ్ లు యూజర్ల మైండ్ ను ఆటో పైలెట్ మోడ్ లోకి నెడుతున్నాయని యూరోపియన్ కమిషన్ ఆరోపించింది. ఈరెండు ప్లాట్ ఫామ్ లలో ఉన్న ఫీచర్లలో మార్పులు చేయాలని లేకుంటే భారీగా పెనాల్టీ పడుతుందని మెటా సంస్థను వార్న్ చేసింది. ఈ రెంటిలోనూ ఉన్న ఇన్ ఫినిట్ స్క్రోలింగ్,ఆటో ప్లే ఫీచర్లు టీనేజ్ యూజర్ల మైండ్ ను అడిక్ట్ అయ్యేలా ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది. అయితే మెటా సంస్థ దీనికి తాము తగిన ఫీచర్లు ఇచ్చామని టీనేజీ యూజర్ల విపరీత వాడకాన్ని పేరెంట్స్ కంట్రోల్ చేసే ఆప్షన్స్ కొన్ని ఉన్నాయని బదులిచ్చింది.